OnePlus Buds Clip: చైనాకు చెందిన ప్రముఖ వన్‌ప్లస్ నుంచి కొత్త ఓపెన్ ఇయర్ ఇయర్‌బడ్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. OnePlus Buds Clip పేరుతో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్‌ను కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది. దీంతో వీటికి సంబంధించిన ఫీచర్లు, కలర్ ఆప్షన్లు బయటకు వచ్చాయి. చెవిలోపల పెట్టుకునే సాధారణ ఇయర్‌బడ్స్‌కు భిన్నంగా, చెవికి క్లిప్‌లా అమర్చుకునేలా వీటిని రూపొందించారు. డెన్మార్క్‌కు చెందిన ఆడియో కంపెనీ డైనోడియో సహకారంతో వీటిని తయారు చేశారు. అయితే ధర, లాంచ్ తేదీ వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
OnePlus Buds Clipలో చెవిలోపలికి వెళ్లే డిజైన్ ఉండదు. చెవికి బయటివైపు క్లిప్‌లా అమర్చుకోవచ్చు. ఇందులో 11mm, 9mm సైజుల్లో రెండు డైనమిక్ డ్రైవర్లు ఉన్నాయి. LHDC 5.0, AAC, SBC ఆడియో కోడెక్‌లకు సపోర్ట్ ఉంది. సౌండ్‌ను మనకు నచ్చినట్లు మార్చుకునేందుకు 10-బ్యాండ్ ఈక్వలైజర్, బాస్‌ను సర్దుబాటు చేసే ‘బేస్‌వేవ్’ ఫీచర్లు కూడా ఇచ్చారు. అలాగే, సౌండ్ బయటకు ఎక్కువగా వినిపించకుండా ‘ప్రైవేట్ సౌండ్‌స్టేజ్’ ఫీచర్ ఉపయోగపడుతుంది.
Also Read: ఇక వాట్సప్ చాట్ నుంచే డైరెక్ట్‌గా రీల్స్ షేరింగ్.. కొత్త ఫీచర్ వచ్చేస్తోంది మామా!
ప్రతి ఇయర్‌బడ్‌లో రెండు MEMS మైక్రోఫోన్లు, ఒక VPU మైక్రోఫోన్ ఉన్నాయి. ‘ఏఐ బోన్ కాల్’ ఫీచర్ ద్వారా చుట్టూ ఉన్న శబ్దాన్ని తగ్గించి, మన మాటలు స్పష్టంగా వినిపించేలా చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 6nm ఏఐ ఆడియో చిప్ కూడా ఉంది. బ్లూటూత్ 6.1 సపోర్ట్‌తో ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ ఫాస్ట్ పెయిర్,
మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్, ఏఐ ట్రాన్స్‌లేట్, టచ్ జెస్చర్లు, డ్రాప్ మానిటర్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇయర్‌బడ్స్ 8 గంటల వరకు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేసుతో కలిపి మొత్తం 36 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ప్రతి ఇయర్‌బడ్‌లో 58mAh బ్యాటరీ, కేసులో 530mAh బ్యాటరీ ఉన్నాయి. ఇయర్‌బడ్స్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 60 నిమిషాలు పడుతుంది. కేసుతో కలిపి ఛార్జ్ చేస్తే 80 నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది. USB టైప్-C పోర్ట్ ఇచ్చారు.
OnePlus Buds Clipను పెర్ల్ వైట్, పెబుల్ గ్రే, ట్విలైట్ రోజ్ రంగుల్లో తీసుకురానున్నారు. ఒక్కో ఇయర్‌బడ్ బరువు 3.9 గ్రాములు కాగా, కేసు బరువు 35.9 గ్రాములు. వీటికి IP55 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది. త్వరలో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో ఇవి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతాయి, ధర ఎంత ఉంటుంది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: ప్లాస్టిక్ గుడ్లపై FSSAI కీలక సూచనలు..గుడ్డు తాజాదనాన్ని ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి!