E-Paper
Advertisement

ప్లాస్టిక్ గుడ్లపై FSSAI కీలక సూచనలు..గుడ్డు తాజాదనాన్ని ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి!

ప్లాస్టిక్ గుడ్లపై FSSAI కీలక సూచనలు..గుడ్డు తాజాదనాన్ని ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి!
Advertisement

FSSAI Guidelines: గుడ్లు ఆరోగ్యానికి మంచివని చాలామంది రోజూ తింటుంటారు. అయితే సోషల్ మీడియాలో ప్లాస్టిక్ గుడ్ల గురించి వచ్చే వార్తలు అప్పుడప్పుడు ఆందోళన కలిగిస్తుంటాయి. నిజంగా గుడ్లు ప్లాస్టిక్‌తో తయారవుతాయా? మనం కొన్న గుడ్డు తాజాగా ఉందో, పాడైందో ఇంట్లోనే ఎలా తెలుసుకోవాలి? ఈ విషయాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఓ వీడియో ద్వారా అవగాహన కల్పించింది. గుడ్డు తాజాదనాన్ని తెలుసుకోవడానికి నీటితో సులభంగా పరీక్ష చేయవచ్చని తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకుండా, సరైన సమాచారం తెలుసుకోవాలని సూచించింది.

నీటితో చెక్ చేయొచ్చు:

గుడ్డు తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో గుడ్డును మెల్లగా వేయాలి. గుడ్డు అడుగున అడ్డంగా పడుకుంటే అది తాజాగా ఉండే అవకాశం ఉంది. కొంతకాలం నిల్వ ఉన్న గుడ్డు అడుగున నిటారుగా నిలబడవచ్చు. ఇక గుడ్డు నీటిపై తేలితే అది పాతదై ఉండొచ్చు. అయితే ఈ పరీక్షతో గుడ్డు ఖచ్చితంగా తినడానికి సురక్షితమని చెప్పలేం.

Advertisement

Also Read: షుగర్ అదుపులో ఉండాలంటే అన్నం ఒక్కటి మానేస్తే సరిపోతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

గుడ్డు తేలితే ప్లాస్టిక్‌తో చేసినట్టా?

గుడ్డు నీటిలో తేలినంత మాత్రాన అది ప్లాస్టిక్‌తో తయారైందని అనుకోవద్దు. గుడ్డు పెంకు లోపలికి, బయటికి గాలి వెళ్లేలా చిన్న రంధ్రాలు ఉంటాయి. కాలం గడిచేకొద్దీ గుడ్డులోని తేమ తగ్గి, లోపల గాలి ఖాళీ పెరుగుతుంది. దీంతో గుడ్డు నీటిలో తేలే అవకాశం ఉంటుంది. ఇది గుడ్డు పాతబడటానికి సంబంధించిన సహజ మార్పు మాత్రమే.

 పచ్చసొన, తెల్లసొన కలిస్తే?

Advertisement

గుడ్డును పగలగొట్టినప్పుడు పచ్చసొన, తెల్లసొన స్పష్టంగా కనిపించకపోవచ్చు. గుడ్డు పాతబడటంతో వాటి గట్టితనం తగ్గి, రెండూ కలిసినట్టు కనిపించే అవకాశం ఉంది. అంతమాత్రాన గుడ్డు నకిలీదని నిర్ణయించకూడదు. FSSAI కూడా ఇలాంటి మార్పులను చూసి ప్లాస్టిక్ గుడ్లని నమ్మవద్దని చెబుతోంది.

వాడే ముందు ఏం చేయాలి?

గుడ్డును వండే ముందు పెంకుపై పగుళ్లు ఉన్నాయా, అసహజమైన వాసన వస్తుందా అనేది గమనించండి. పగలగొట్టిన తర్వాత వాసన అనుమానంగా ఉంటే దాన్ని తినకండి. నీటి పరీక్ష ఒక్కటే గుడ్డు సురక్షితమో కాదో చెప్పలేదు. సరైన పద్ధతిలో నిల్వ చేయడం, అనుమానం ఉన్న గుడ్లను వాడకపోవడం ముఖ్యం. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా, FSSAI వంటి నమ్మకమైన వనరుల సమాచారాన్ని అనుసరించండి.

Also Read: దిష్టి ఎలా తీయాలో తెలుసా? వేటితో తీస్తే వెంటనే ఫలితం ఉంటుంది?

Tags

Related News

గంజాయి, డ్రగ్స్ వ్యసనంతో బాధపడుతున్నారా? ఈ దురలవాటు మానేయడానికి మార్గాలివే

పాలతో ఇంట్లోనే అదిరిపోయే కలాకండ్..నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది!

అమ్మమ్మ కాలం నాటి అరుదైన వంటకం.. వెదురు చిగుళ్ల కూర తింటే ఇన్ని లాభాలా?

రెస్టారెంట్ స్టైల్ మఖాన కర్రీ..ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు!

దెయ్యాలు ఉన్నాయని చెప్పడం, గిలిగింతలు పెట్టడం చేస్తున్నారా? పిల్లల పెంపకంలో ఈ తప్పులు చేయకూడదు

నోరూరించే బెండకాయ పచ్చడి..చపాతీ,అన్నంలోకి సూపర్ కాంబినేషన్!

పీతలను ఇలా మసాలా పెట్టి వండితే.. ఆ వాసనకే కడుపు నిండిపోతుంది!

Big Stories

Advertisement
×