E-Paper
Advertisement

‘అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు’.. చైనా వ్యూహంపై కేంద్ర మంత్రి సెటైర్లు!

‘అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు’.. చైనా వ్యూహంపై కేంద్ర మంత్రి సెటైర్లు!
Advertisement

Piyush Goyal: జర్మనీ పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ భారతీయ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన ముఖాముఖిలో కీలక విషయాలను వెల్లడించారు. విదేశాల్లో స్థిరపడ్డ భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులను మళ్లీ తమ దేశానికి రప్పించేందుకు చైనా అమలు చేస్తున్న ప్రభుత్వ నిధుల ప్రోగ్రామ్ పై ఆయన స్పందించారు. చైనా మోడల్‌ను యథాతథంగా భారత్‌లో అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. చైనాలో నియంతృత్వ విధానాలు ఉంటాయని, అక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తే మనుషులే కనుమరుగవుతారని పేర్కొన్నారు. కానీ ప్రజాస్వామ్య దేశమైనా భారత్ లో అలాంటివి చోటుచేసుకుంటే తీవ్ర విమర్శలు వస్తాయని వ్యాఖ్యానించారు.

ఇదే అంశంపై మాట్లాడుతూ సీజేపీ నాయకుడు అభిజీత్ దీప్కే తీరుపై మంత్రి పీయూష్ గోయల్ చురకలంటించారు. ‘మనం చైనా తరహాలో ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారిని వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తే అభిజీత్ దీప్కే లాంటి వ్యక్తులు వస్తారు. విద్యార్థులకు నిధులు ఇవ్వడం, స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయడం ఇలా అన్నీ ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నిస్తారు’ అని పేర్కొన్నారు. మరోవైపు జర్మనీలో స్థిరపడ్డ భారతీయ శాస్త్రవేత్తలు, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న ప్రతిభను భారత్‌కు రప్పించడానికి ఎలాంటి ఆలోచనలు అమలు చేయవచ్చో సూచించాలని కోరారు. ‘మిమ్మల్ని మళ్లీ భారత్‌కు స్వాగతించాలని మేము బలంగా కోరుకుంటున్నాము. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించినది మాత్రమే కాదు. మీ జ్ఞానాన్ని మీ మాతృభూమికి ఏదో ఒక రూపంలో తిరిగి ఇచ్చేయాలి’ అని పిలుపునిచ్చారు.

Advertisement

మరోవైపు ‘బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ 2026’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పీయూష్ గోయల్.. వాతావరణ మార్పులపై ఐరోపా సమాఖ్య అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుపట్టారు. వాతావరణ సంక్షోభానికి అభివృద్ధి చెందిన దేశాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ‘అసలు ఈ పర్యావరణ సమస్యను ఎవరు సృష్టించారు? ఓజోన్ పొరను ఎవరు దెబ్బతీశారు? ఆ కార్బన్ మొత్తాన్ని వాతావరణంలోకి పంపింది ఎవరు?’ అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. వేదికపై ఉన్న మరో ప్యానెలిస్ట్ ‘మనమందరం కలిసి చేశాం’ అని బదులివ్వగా, దానిని మంత్రి తీవ్రంగా ఖండించారు.

Also Read: చదువుకున్న స్కూల్‌లోనే దారుణం.. ప్రిన్సిపల్‌పై మాజీ స్టూడెంట్స్ దాడి.. పాఠశాల డబ్బుతో జంప్!

Advertisement

ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17 శాతానికి పైగా ఉన్నప్పటికీయ.. కర్బన్ ఉద్గారాలలో తమ వాటా 3 శాతం కంటే తక్కువగానే ఉందని మంత్రి వివరించారు. ఇందుకు భిన్నంగా ఐరోపా జనాభా 3 లేదా 4 శాతం మాత్రమే ఉన్నప్పటికీ వారి కార్బన్ ఉద్గారాల వాటా చాలా ఎక్కువ అని ఎత్తి చూపారు. ఐరోపా తన ఆర్థిక వ్యవస్థను పెంచుకోవడానికి గతంలో బొగ్గును విపరీతంగా వాడిందని గుర్తుచేశారు. ఇప్పుడు కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజమ్ (CBAM) వంటి పన్నులు, విపరీతమైన దిగుమతి సుంకాలు విధించడం ద్వారా జీవన వ్యయాన్ని పెంచుకుంటూ నష్టాలను కొనితెచ్చుకుంటోందని హెచ్చరించారు.

Also Read: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

Tags

Related News

చదువుకున్న స్కూల్‌లోనే దారుణం.. ప్రిన్సిపల్‌పై మాజీ స్టూడెంట్స్ దాడి.. పాఠశాల డబ్బుతో జంప్!

కర్ణాటక ‘స్టింగ్ ఆపరేషన్’ వివాదంలో బిగ్ ట్విస్ట్.. సీఎం డీకే శివకుమార్ సంచలన విషయాలు వెల్లడి!

ప్రపంచ శాంతికి వేదిక యూఎన్.. అయినా యుద్ధాలు ఎందుకు ఆగడం లేదు?

చిరిగిన రూ.10 నోటు వివాదం.. డెలివరీ బాయ్‌పై కస్టమర్ దాడి.. అవమానంతో యువకుడు సూసైడ్!

‘దేశ ప్రతిష్టను తాకట్టు పెడుతున్నారు’.. రాహుల్‌పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ!

డేంజర్ బెల్స్.. ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి హెచ్చరిక!

ఆడి కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొట్టి, బాధితుడ్ని తొక్కుకుంటూ వెళ్లిన డ్రైవర్!

Big Stories

Advertisement
×