E-Paper
Advertisement

Oneplus Buds Pro 3: వన్ ప్లస్ బడ్స్ ప్రో 3.. ఫీచర్లు అదరహో

Oneplus Buds Pro 3: వన్ ప్లస్ బడ్స్ ప్రో 3.. ఫీచర్లు అదరహో
Advertisement

Oneplus Buds Pro 3 Features and Price: వన్ ప్లస్ బడ్స్ ప్రో 3.. ట్రూ వైర్లెస్ స్టీరియో (టిడబ్ల్యుఎస్) ఇయర్ ఫోన్లు.. కొత్తగా భారతదేశంలో లాంచ్ అయ్యాయి. ఇవి వినియోగదారులకు ఒక అనిర్వచనీయమైన ధ్వని శబ్ధాన్ని, శ్రావ్యతను అందిస్తున్నాయని టెకీలు చెబుతున్నారు. వీటి ప్రారంభ ధర రూ.11,999గా ఉంది.

ఇక ఈ ఆడియో బడ్స్ ఫీచర్స్ గురించి చెప్పాలంటే.. ఇందులో 11 ఎంఎం వూఫర్స్, 6 ఎంఎం ట్వీటర్లు ఉన్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్సీ), ఎల్ హెచ్ డీసీ 5.0 ఆడియో కొడెక్, డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ ఉన్నాయి. ఇంకా 50 డీబీ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇయర్ బడ్స్ స్లైడ్ టచ్ కంట్రోల్ ఫంక్షన్ కి మద్దతు ఇస్తాయి. అలాగే మొత్తం 43 గంటల బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంటుందని చెబుతున్నారు.

Advertisement

వన్ ప్లస్ బడ్స్.. ఎక్స్ ఎస్, ఎస్, ఎం, ఎల్ సైజుల్లో వస్తున్నాయి. అవుట్-ఆఫ్-ది-బాక్స్ మీడియం ఆప్షన్ ఒకటి ఉంది. అలాగే గుండ్రని బడ్స్ కి తీగలా ఉండే ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఇవి డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ను కలిగి ఉంటాయి. ఇకపోతే ఇయర్ ఫోన్లు ఇతర ఫంక్షన్లను అనుమతిస్తాయి.

Also Read:  IQOO నుంచి Z9s సిరీస్ ఫోన్లు.. భారత్ లో ధరలివే.. అప్పట్నుంచే అందుబాటులోకి..

Advertisement

లూనార్ రేడియెన్స్ (తెలుపు), మిడ్నైట్ ఓపస్ (నలుపు) అనే రెండు బేసిక్ షేడ్స్ తో లభించే వన్ ప్లస్ బడ్స్ ప్రో 3 ఇయర్ ఫోన్లను సులభంగా తీసుకెళ్లగలిగే ఆకారంలో ఉంటాయి. అలాగే ఇవి ఒక ప్రత్యేక కాంతితో ప్రకాశించడం వీటి ప్రత్యేకత. ఇకపోతే ఛార్జింగ్ కేస్ ప్లాస్టిక్ యూనిబాడీ బిల్డ్ తో వస్తుంది.

ఈ కేసుకు ఐపి రేటింగ్ లేదు. ఒక ఇయర్ బడ్ సైజు 33.60 x 21.15 x 25.00 మిమీతో 5.28 గ్రాముల బరువు ఉంటుంది. కేస్ 64.70 x 52.45 x 25.75 మిమీ పరిమాణం ఉంటుంది. ఇయర్ ఫోన్స్ తో కలిపి 61.38 గ్రాముల బరువు ఉంటుంది. ఇది మనుషుల పనితీరుకు, ఇంకా వారు చెవులకు పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది కలిగించదని చెబుతున్నారు.

డ్రైవర్ – 11 మిమీ + 6 మిమీ, ఇంకా కంపానియన్ యాప్ – హే మెలోడీ.. ఇలా ఎన్నో స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఉన్నాయి. అంతేకాదు ఇందులో ఉన్న గోల్డెన్ సౌండ్ ఫీచర్ కారణంగా అవతలివాళ్లు మాట్లాడే మాటలే కాదు చక్కని పాటలను కూడా శ్రావ్యంగా, మనసుకెంతో ఆహ్లాదకరంగా వినిపిస్తాయని తయారీదారులు చెబుతున్నారు.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×