BigTV English

Skydeck In Bengaluru: బెంగళూరులో భారీ స్కై డెక్..250 మీటర్ల ఎత్తునుంచి నగరాన్ని వీక్షించవచ్చు

Skydeck In Bengaluru: బెంగళూరులో భారీ స్కై డెక్..250 మీటర్ల ఎత్తునుంచి నగరాన్ని వీక్షించవచ్చు

South Asia’s Tallest Skydeck Worth ₹ 500 Crore To Come Up In Bengaluru: ఆకాశంలో పక్షిలా విహరిస్తూ చుట్టుపక్కల సుందర దృశ్యాలను చూడాలని ఎవరికి ఉండదు. మనకు కూడా ఆ క్షణంలో రెక్కలు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అయితే ఇకపై మీరు అలా చూడాలని అనుకుంటే బెంగళూరు వెళ్లాల్సిందే.


కర్ణాటక రాజధాని బెంగళూరుకు అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఓ బృహత్ భారీ ప్రణాళిక రూపుదిద్దుకోనుంది. ఈ భారీ ప్రాజెక్టుకు కర్ణాటక ప్రభుత్వం రూ.500 కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన బెంగళూరు ప్రాంతం ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే స్కై డెక్ తో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోబోతోంది. ఇకపై పర్యాటకంగా మరింత శోభను సంతరించుకోబోతోంది.

నగరానికే తలమానికం


బెంగళూరుకే తలమానికంగా రూపుదిద్దుకోనున్న స్కైడెక్ ను అధిరోహించి చుట్టూ 360 డిగ్రీల వ్యూహంతో సిటీ మొత్తాన్ని సందర్శించవచ్చు. ఢిల్లీలోని కుతుబ్ మినార్ మాదిరిగా దీనిని అత్యాధునిక సాంకేతిక విలువలతో నిర్మించనున్నారు. లోపల లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది. 250 కిలో మీటర్ల ఎత్తు నుంచి సిటీని చూడవచ్చు. న్యూఢిల్లీ వద్ద ఉన్న కుతుబ్ మినార్ 73 మీటర్ల ఎత్తు ఉంటుంది. కానీ స్కై డెక్ మాత్రం అంతకు మూడింతలు ఎక్కువగా ఉండనుంది.

స్కైడెక్ దక్షిణాసియాలోనే అత్యంత ఎత్తయిన ప్రాజెక్టు. పర్యాటక రంగానికి ఊతమిచ్చే క్రమంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గార్డెన్ సిటీ అందాలను పై నుంచి చూడగలిగే భాగ్యం స్కైడెక్ ద్వారా కలగనుంది. ఇలాంటి గర్వపడే ప్రాజెక్టు భారతదేశం మొత్తం మీద తమ నగరానికే పరిమితం కావడం పట్ల స్థానికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×