BigTV English

IQOO Z9s &Z9s Pro: IQOO నుంచి Z9s సిరీస్ ఫోన్లు.. భారత్ లో ధరలివే.. అప్పట్నుంచే అందుబాటులోకి..

IQOO Z9s &Z9s Pro: IQOO నుంచి Z9s సిరీస్ ఫోన్లు.. భారత్ లో ధరలివే.. అప్పట్నుంచే అందుబాటులోకి..

IQOO Z9s &Z9s Pro: తక్కువ ధరలో.. మంచి ఫీచర్లు ఉన్న మొబైల్ కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. IQOO మరో రెండు ఆండ్రాయిడ్ మొబైల్స్ ను ఆవిష్కరించింది. Vivoకి సబ్ బ్రాండ్ అయిన IQOO.. Z9 సిరీస్ లో IQOO Z9s అండ్ IQOO Z9s Pro స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. రూ.20 వేల నుంచి రూ.30 వేల మధ్యలోనే.. అద్భుతమైన ఫీచర్లతో ఈ మొబైల్స్ ను అందిస్తుంది. కొన్ని చిన్న చిన్న మార్పులతో.. మిక్స్డ్ స్పెసిఫికేషన్లతో ఇవి మార్కెట్లలో రిలీజయ్యాయి.


3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ ప్లే ఉంది. IQOO Z9s లో మీడియాటెక్ డైమెన్షన్ 7300 ప్రాసెసర్, IQOO Z9s Proలో కాలమ్ స్నాప్ డ్రాగన్ 7th జనరేషన్ 3 ప్రాసెసర్ ను ఇచ్చారు. అలాగే 50 ఎంపీ మెయిన్ కెమెరా, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి.

iQOO Z9s & iQOO Z9s Pro స్పెసిఫికేషన్లు, ఫీచర్లు


iQOO Z9 సిరీస్ లో వచ్చిన రెండు స్మార్ట్ ఫోన్లు 6.7 అంగుళాల 3D కర్వ్ అమోల్డ్ డిస్ ప్లే ను కలిగి ఉన్నాయి. FHD + రిజెల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్ ను అందిస్తోంది. Z9s Pro 4500నిట్ ల బ్రైట్ నెస్ ను ఇస్తుండగా Z9s 1800 నిట్ ల బ్రైట్ నెస్ ను ఇస్తుంది. ఈ రెండు ఫోన్లు ఇప్పటి వరకూ లాంచ్ చేసిన వాటికంటే సన్నగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

iQOO Z9s డ్యూయల్ రియల్ కెమెరాలను కలిగి ఉండగా.. ప్రధాన కెమెరా 50 MP సోనీ IMX882తో వస్తుంది. 2 MP పోర్ట్రెయిట్ కెమెరా కూడా ఉంది. iQOO Z9s Pro విషయానికొస్తే.. iQOO Z9s లో ఇచ్చిన రెండు సెన్సార్లతో పాటు.. 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. రెండు ఫోన్లలో AI ఎరేస్, AI ఫొటో ఎడిటింగ్ ఫీచర్లను కూడా కంపెనీ ఇస్తోంది. రెండింటిలోనూ 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చింది.

iQOO Z9s అండ్ iQOO Z9s ప్రో ఫోన్లలో 5500 mAh బ్యాటరీని ఇన్ బిల్ట్ చేశారు. Z9s 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో రాగా.. Z9s Pro 80 వాట్స్ ఛార్జింగ్ తో వస్తోంది. ఈ రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14తో రన్ అవుతాయి.

ఇండియాలో iQOO Z9s & iQOO Z9s Pro ధర

iQOO Z9s ఇండియాలో ఒనిక్స్ గ్రీన్, టైటానియం మ్యాట్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. iQOO Z9s Pro ఫ్లాంబాయింట్ ఆరెంజ్, లక్స్ మార్బుల్ షేడ్స్ లో వస్తుంది. iQOO Z9s 8GB+ 128 GB మోడల్ ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుండగా.. 8GB+ 256 GB ధర రూ.21,999గా ఉంటుంది. 12GB+ 256 GB వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది.

iQOO Z9s Pro ధర 8GB + 128 GB వేరియంట్ ధర రూ.24,999 నుంచి ప్రారంభమవుతుంది. 8GB + 256 GB వేరియంట్ ధర రూ.26,999గా, 16GB + 256 GB ధర రూ.28,999గా నిర్ణయించింది కంపెనీ. ఈ రెండు మొబైల్స్.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో అందుబాటులోకి రానున్నాయి. iQOO Z9s అమ్మకాలు ఆగస్టు 29 నుంచి అందుబాటులోకి రానున్నాయి. HDFC, ICICI కార్డులు ఉన్నవారు రూ.3000 తగ్గింపును కూడా పొందవచ్చు. మీరు మంచి ఫీచర్లతో తక్కువ ధర మొబైల్ కోసం చూస్తున్నట్లైతే ఇదే బెస్ట్ ఆప్షన్.

 

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×