E-Paper
Advertisement

షాకింగ్ ప్రైస్.. రూ.20 వేల లోపే OnePlus కొత్త ఫోన్.. Nord కంటే తక్కువ ధరకే!

షాకింగ్ ప్రైస్.. రూ.20 వేల లోపే OnePlus కొత్త ఫోన్.. Nord కంటే తక్కువ ధరకే!
Advertisement

OnePlus N Series: చైనా దేశానికి చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత మార్కెట్లో తమ పట్టును మరింత పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదల చేసిన OnePlus Nord CE6 Lite మోడల్‌కు మంచి స్పందన రావడంతో.. ఇప్పుడు అంతకంటే తక్కువ ధరలోనే మరో సరికొత్త సిరీస్‌ను తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త సిరీస్ వచ్చే నెలలోనే భారత వినియోగదారుల ముందుకు రానున్నట్లు టెక్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

కొత్త సిరీస్ ఎంట్రీ:

టెక్ నిపుణుల లీక్స్ ప్రకారం.. వన్‌ప్లస్ సంస్థ భారత్‌లో వన్‌ప్లస్ ఎన్ (N) సిరీస్‌ను పరిచయం చేయబోతోంది. ఈ సిరీస్ కింద వచ్చే మొదటి ఫోన్ జులై నెలలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Nord CE 6 Lite కంటే ఈ ఫోన్ ధర చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ రూ.20 వేలలోపే ఈ సిరీస్ ఫోన్లను కంపెనీ తీసుకురానుంది.

ధరల వివరాలు:

Advertisement

ఇటీవలే మే 7న విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 6 లైట్ బేస్ వేరియంట్ (6GB+128GB) ధర రూ.20,999గా ఉంది. అలాగే 8GB+128GB టాప్ వేరియంట్ ధరను రూ.22,999గా నిర్ణయించారు. అయితే రాబోయే సరికొత్త వన్‌ప్లస్ ఎన్ సిరీస్ ఫోన్లు దీనికంటే తక్కువ ధరకే లభిస్తాయి కాబట్టి.. బడ్జెట్ ధరలో వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ కానుంది.

Also Read: iPhone Fold Leaks.. యాపిల్ తొలి మడత ఫోన్ ఇలా ఉండబోతుందా? డిజైన్ చూస్తే ఆశ్చర్యపోతారు!

నార్డ్ సీఈ 6 లైట్ ఫీచర్లు:

Advertisement

ఇక నార్డ్ సీఈ 6 లైట్ విషయానికొస్తే.. దీనిలో 6.72 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 144Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అపెక్స్ ప్రాసెసర్‌ను ఇందులో వాడారు. ఫోన్ మన్నిక కోసం ఐపీ64 రేటింగ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కూడా అందించారు.

కెమెరా, బ్యాటరీ సామర్థ్యం:

ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP సెకండరీ కెమెరా ఉంది. ఇక సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ముఖ్యంగా దీనిలో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఏకంగా 7000mAh భారీ బ్యాటరీని అందించడం విశేషం. రాబోయే కొత్త ఎన్ సిరీస్ ఫోన్లలో కూడా ఇలాంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉంటాయని మొబైల్ ప్రియులు ఆశిస్తున్నారు.

Also Read: iOS 27 వచ్చేసింది.. iPhone 11 నుండి iPhone 17 Pro Max వరకు.. ఎవరెవరికి సపోర్ట్ చేస్తుందంటే?

Related News

గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!

నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!

రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

డిజైన్ పిచ్చెక్కిస్తోంది బాబోయ్.. ఐకూ లవర్స్‌కి ఇది కదా కావాల్సింది!

యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

8,000mAh బ్యాటరీనా.. అమోలెడ్ స్క్రీనా? ఈ 3 కొత్త 5G ఫోన్లలో ఏది కొనుగోలు చేయడం ఉత్తమం?

Big Stories

Advertisement
×