E-Paper
Advertisement

తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు.. కొడుకు విక్టరీపై విజయ్ తండ్రి రియాక్ట్, చారిత్రాత్మక విజయమంటూ..

తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు.. కొడుకు విక్టరీపై విజయ్ తండ్రి రియాక్ట్, చారిత్రాత్మక విజయమంటూ..
Advertisement

Channai: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ తండ్రి చంద్రశేఖర్ అన్నారు. కొడుకు విక్టరీపై తొలిసారి ఆయన నోరు విప్పారు. కొడుకు విజయం ఒక తండ్రిగా తనకెంతో గర్వంగా ఉందన్నారు. ఎవరితోనూ పొత్తులు లేకుండా ఒంటరిగా తన కాళ్లపై నిలబడి గెలిచాడని అన్నారు. ఇది విజయ్‌కే కాదు తమిళనాడు రాష్ట్రానికే చారిత్రాత్మక విజయమని అన్నారు.

కొడుకు విక్టరీపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ రియాక్ట్

Advertisement

తమిళనాడులో సోమవారం ఉదయం అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు జరుగుతోంది. ఓ వైపు నటుడు విజయ్, ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తిరుత్తానిలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఫలితాలు సూచిన తర్వాత ఓ న్యూస్ ఏజెన్సీతో ఆయన మాట్లాడారు.

విజయ్ రాజకీయ రంగ ప్రవేశంలో అత్యుత్తమ మార్కులతో విజయం సాధించాడని అన్నారు. అన్నింటికంటే ముందు ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నానని చెప్పారు. రెండేళ్లుగా తన కొడుకు ఆత్మవిశ్వాసం పెరగడాన్ని తాను గమనిస్తున్నానని, అందుకే కొడుక్కి శుభాకాంక్షలు తెలిపాడు.

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు.. చారిత్రాత్మక విజయమని వ్యాఖ్య

తాను తమిళనాడు ముఖ్యమంత్రి అవుతానని, కొడుకు విజయ్ తనతో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కన్నతండ్రి గుర్తు చేసుకున్నాడు. ప్రచారంలో తన కుమారుడు ఏమాత్రం అధైర్యపడలేదన్నారు.  నా కాళ్ళ మీద నేను నిలబడతానని, ఎలాంటి పొత్తు వద్దని విజయ్ తనతో చెప్పినట్లు ఆయన తండ్రి వివరించారు.

తమిళనాడుకు-తమిళనాడు ప్రజలకు ఒక చారిత్రాత్మక విజయం అని తాను భావిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. మూడు దశాబ్దాలుగా సమాజం కోసం, తమిళ ప్రజల కోసం ఏదైనా చేయాలని నిత్యం ఆలోచిస్తూ వచ్చాడని తెలియజేశాడు. ఆ ఆలోచన కొడుకు మనసులో ఉందని, దాన్ని నెమ్మదిగా అభివృద్ధి చేసుకుని విజయం సాధించాడన్నాడు.

ALSO READ: తమిళనాట విజయ్ ప్రభంజనం.. డ్రైవర్ కొడుకు అద్భుత విజయం

తన కొడుకు తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారని ఆనందంతో చెప్పుకొచ్చారు. తమిళనాడులోని 234 స్థానాలకు తమిళగ వెట్రి కజగం-టీవీకే పార్టీ 110 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏఐఏడీఎంకే-58, కాంగ్రెస్-డీఎండీకేల కూటమి 65 స్థానాలతో సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది.

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×