E-Paper
Advertisement

వావ్.. లాంచ్ అయిన కొద్దిరోజులకే Samsung Galaxy A37పై ఊహించని డిస్కౌంట్!

వావ్.. లాంచ్ అయిన కొద్దిరోజులకే Samsung Galaxy A37పై ఊహించని డిస్కౌంట్!
Advertisement

Samsung Galaxy A37 Price Cut: శాంసంగ్ ఫోన్లంటే ఇష్టపడే వారికి ఇదో క్రేజీ అప్‌డేట్. నిజానికి ఏదైనా కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చిందంటే.. దాని ధర తగ్గడానికి కనీసం మూడు నాలుగు నెలల టైమ్ పడుతుంది. కానీ Galaxy A37 విషయంలో శాంసంగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్‌లో లాంచ్ అయిన కేవలం కొద్ది రోజుల్లోనే ఈ మిడ్‌రేంజ్ ఫోన్ ధరను భారీగా తగ్గించేసింది. ఫోన్ క్రేజీ ఫీచర్లతో ఉన్నా.. లాంచ్ ప్రైస్ కొంచెం ఎక్కువ అని ఫీలైన వారికి ఇప్పుడు ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.

అమెజాన్‌లో ఊహించని డిస్కౌంట్:

ఈ Galaxy A37 ఫోన్ రిలీజ్ అయినప్పుడు దీని బేస్ వేరియంట్ ధర రూ.41,999గా ఉండేది. కానీ ఇప్పుడు అమెజాన్‌లో చూస్తే ఏకంగా రూ.32,994కే దొరుకుతోంది. ఒకేసారి దాదాపు రూ.9,000 వరకు తగ్గించేశారన్నమాట. ప్రస్తుతం ఆసమ్ చార్‌కోల్ కలర్ మోడల్‌పై ఈ ఆఫర్ నడుస్తోంది. ఒకవేళ మీ దగ్గర ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే.. మరికొంత క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది. ఇక పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ పెడితే ఈ ధర ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది.

Advertisement

Also Read: స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్న మోటరోలా ఫోల్డబుల్ ఫోన్లు.. ఆ క్రేజీ ఫీచర్లకు టెక్ ప్రియులంతా ఫిదా!

నీళ్లలో పడినా ఏం కాదు..

చూడటానికి ఈ ఫోన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీనిలో 6.7 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ ఇచ్చారు కాబట్టి.. కలర్స్ చాలా రిచ్‌గా కనిపిస్తాయి. అలాగే ఫోన్ వాడుతున్నప్పుడు చాలా స్మూత్‌గా అనిపించడానికి దీనిలోని120Hz రిఫ్రెష్ రేట్ సాయపడుతుంది. ఇక ఎండలోకి వెళ్లినా స్క్రీన్ మీద అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఫోన్ ముందు, వెనుక కూడా గొరిల్లా గ్లాస్ రక్షణ ఉండటంతో పాటు, పొరపాటున నీళ్లలో పడినా ఏమీ కాకుండా వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఇచ్చారు.

ఆరేళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్స్..

Advertisement

ఈ Galaxy A37లో శాంసంగ్ సొంత ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్ వాడారు. దీనివల్ల గేమ్స్ ఆడినా, మల్టీ టాస్కింగ్ చేసినా ఫోన్ చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌తో వస్తోంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. రాబోయే 6 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ చెప్పింది. అంటే ఒక్కసారి ఈ ఫోన్ కొంటే వచ్చే ఆరు సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేర్ గురించి టెన్షన్ పడక్కర్లేదు.

50 మెగాపిక్సల్ కెమెరా..

ఇక ఫొటోల విషయానికి వస్తే.. దీనిలో 50MP మెయిన్ కెమెరా ఉంది. చేతులు వణికినా ఫొటోలు బ్లర్ అవ్వకుండా ఉండటానికి OIS టెక్నాలజీని వాడారు. ఇక సెల్ఫీల కోసం ఉన్న కెమెరాతో 4K క్వాలిటీలో వీడియోలు తీసుకోవచ్చు. అలాగే 5000mAh బ్యాటరీ ఉండటం వల్ల ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రోజంతా వాడుకోవచ్చు. పైగా 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఫోన్ కూడా చాలా త్వరగా ఛార్జ్ అయిపోతుంది.

Also Read: iPhone 17 Proపై భారీ డిస్కౌంట్.. ఈ ధరకు మరెక్కడా దొరకదు, ఆఫర్ ఎలా పొందాలంటే?

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×