E-Paper
Advertisement

Sanju Samson : వివాదంలో సంజు శాంస‌న్‌..కేర‌ళం సీఎం ముందే కొబ్బ‌రి నీళ్లు తాగి !

Sanju Samson : వివాదంలో సంజు శాంస‌న్‌..కేర‌ళం సీఎం ముందే కొబ్బ‌రి నీళ్లు తాగి !
Advertisement

Sanju Samson :  వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ ( Sanju Samson) ప్రస్తుతం కేరళంలోనే ఉన్నారు. అతి త్వరలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరబోతున్నాడు సంజు శాంసన్. అయితే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి కంటే ముందు సంజు శాంసన్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజ‌య‌న్ ( CM Pinarayi Vijayan) ముందే కొబ్బరి నీళ్లు తాగి ( Coconut Water), కాంట్రవర్సీకి తెర లేపారు. ఓ ముఖ్యమంత్రి ముందు హీరో రేంజ్ లో కొబ్బరి నీళ్లు తాగుతావా ? అంటూ సంజు శాంస‌న్ ను విల‌న్ చేసి, కేరళం సీఎం అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైరల్ చేసి సంజు శాంసన్ పైన విష ప్రచారం చేస్తున్నారు.

Also Read: Pakistan PM: గాజులు వేసుకోని ఇంట్లో కూర్చోండి.. బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మిపై పాక్ ప్ర‌ధాని సీరియ‌స్ !

వివాదంలో సంజు శాంస‌న్‌

Advertisement

టీమిండియా స్టార్ ఆటగాడు సంజు శాంసన్ సొంత రాష్ట్రం కేరళం అన్న సంగతి తెలిసిందే. ముందు నుంచి కేరళం రాష్ట్రంలో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక మొన్న వరల్డ్ కప్ లో సంజు శాంసన్ ఇరగదీసిన నేపథ్యంలో, కేరళం రాష్ట్రంలో అతని పేరు మారుమోగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి కార్యక్రమానికి అతన్ని పిలుస్తోంది. ఇక కేరళం రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అతని బాగా వాడుకునేందుకు సీఎం పినరయి విజయన్ ( CM Pinarayi Vijayan) కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీపంలోని మంగళాపురంలో కొత్త కేరళ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి సంజు శాంసన్ ను సీఎం పినరయి విజ‌య‌న్ ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదిక పైన సీఎం పినరయి విజయ‌న్ అలాగే సంజు శాంసన్ ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. ఈ క్రమంలోనే సంజు శాంసన్ కోసం కొబ్బరి నీళ్లు తీసుకువచ్చింది ఒక లేడీ. అయితే వెంటనే తనకు వద్దు మొదట సీఎం పినరయి విజయ‌న్ కు ఇవ్వాలి అంటూ సంజు శాంస‌న్ ఆ లేడీ తో చెప్పాడు. అయితే తాను తాగను… అంటూ సీఎం పినరయి విజయన్ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో ఆ ఒక్క గ్లాస్ తీసుకొని హీరో రేంజ్ లో సంజు శాంసన్ కొబ్బరి నీళ్లు తాగాడు. అందులో స్ట్రా కూడా వేసుకున్నాడు. ఈ విషయమే సీఎం పినరయి విజయన్ అభిమానులకు మండింది. మా ముఖ్యమంత్రి ముందు హీరో రేంజ్ లో నువ్వు కొబ్బరి నీళ్లు తాగుతావా ? అంటూ సంజు శాంసన్ పైన సీరియస్ అవుతున్నారు. సంజు శాంసన్ కొబ్బరి నీళ్లు తాగిన వీడియోలు ఎడిట్ చేసి రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఒక వరల్డ్ కప్ తెస్తేనే హీరో అయిపోతావా ? అంటూ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Also Read: Trolls On Shubman Gill: ఓరి ద‌రిద్రుడా..రోహిత్ శ‌ర్మ సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నావా ? గిల్ పై దారుణంగా ట్రోల్స్‌

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×