E-Paper
Advertisement

OnePlus Nord CE5 5G: ఛార్జింగ్ టెన్షన్ ఉండదిక.. 7100mAh బ్యాటరీ వన్‌ప్లస్ నార్డ్ CE5 5G ఇప్పుడు తక్కువ ధరకే!

OnePlus Nord CE5 5G: ఛార్జింగ్ టెన్షన్ ఉండదిక.. 7100mAh బ్యాటరీ వన్‌ప్లస్ నార్డ్ CE5 5G ఇప్పుడు తక్కువ ధరకే!
Advertisement

OnePlus Nord CE5 5G: భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్న యూజర్లకు వన్‌ప్లస్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. శక్తివంతమైన ఫీచర్లు, ప్రీమియం లుక్ కలిగిన OnePlus Nord CE5 5G మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న ‘OnePlus Freedom Sale’లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత చౌకైన ధరకే లభిస్తోంది. తక్కువ ధరకే లభించడమే కాకుండా.. అదనపు ప్రయోజనాలతో ఈ ఫోన్ ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది.

భారీ తగ్గింపుతో బంపర్ ఆఫర్స్:

ఈ ఫోన్ అసలు ధర రూ.24,999 కాగా.. వన్‌ప్లస్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా రూ. 500 తగ్గింపుతో రూ. 24,499కి అందుబాటులో ఉంది. అయితే బ్యాంకు ఆఫర్లను ఉపయోగించుకుంటే, ఈ ధర ఇంకొంచెం తగ్గుతుంది. HDFC లేదా Axis Bank క్రెడిట్ కార్డ్ EMI ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ఫైనల్ ధర రూ.22,999కి చేరుతుంది. లేదంటే నెలకు రూ.4,083 చొప్పున 6 నెలల నోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా వాడుకోవచ్చు. అంతేకాదు.. ఫ్రీ మాగ్నెటిక్ కేస్, డిస్‌ప్లేపై లైఫ్ టైమ్ వారంటీని కూడా కంపెనీ అదనంగా అందిస్తోంది.

Advertisement

Also Read: డీఎస్‌ఎల్‌ఆర్ క్వాలిటీ ఫోన్ కావాలా? వివో X300 సిరీస్‌పై క్రేజీ డిస్కౌంట్, కెమెరా లవర్స్‌కు పండగే!

పవర్‌ఫుల్ ప్రాసెసర్:

OnePlus Nord CE5 5G ఫీచర్ల పరంగా చూసుకుంటే.. ఎక్కడా రాజీ పడలేదు. దీనిలో 6.77 అంగుళాల భారీ AMOLED స్క్రీన్‌ను అమర్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్ ఆడుతున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు విజువల్స్ చాలా స్మూత్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. వేగవంతమైన పనితీరు కోసం మీడియాటెక్ డైమన్షిటీ 8350 అపెక్స్ ప్రాసెసర్‌ను వాడారు. ఇది మల్టీ టాస్కింగ్‌ను చాలా సులభతరం చేస్తుంది.

కెమెరా క్వాలిటీ అద్భుతం:

Advertisement

ఇక ఫొటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరాతో పాటు అల్ట్రావైడ్ లెన్స్‌ను అమర్చారు. ఇది హైక్వాలిటీ ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయడానికి ఎంతగానో సహకరిస్తుంది. ఇకపోతే ఈ ఫోన్ హైలైట్ పాయింట్ దీని బ్యాటరీ. ఏకంగా 7,100mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న ఈ ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడ్రోజుల పాటు బ్యాకప్ ఇస్తుంది. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో బ్యాటరీ చాలా తక్కువ సమయంలోనే ఫుల్ అవుతుంది.

Also Read: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 7500mAh బ్యాటరీ.. వన్‌ప్లస్ 15T పెర్ఫార్మెన్స్ మాములుగా లేదుగా!

 

 

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×