E-Paper
Advertisement

లెనిన్ మూవీ నుండి భాగ్యశ్రీ బర్తడే స్పెషల్ పోస్టర్.. గెటప్ చూస్తే అనుమానం గ్యారంటీ!

లెనిన్ మూవీ నుండి భాగ్యశ్రీ బర్తడే స్పెషల్ పోస్టర్.. గెటప్ చూస్తే అనుమానం గ్యారంటీ!
Advertisement

Bhagya Sri Borse:ప్రముఖ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను సొంతం చేసుకున్న ఈమె.. తొలిసారి మాస్ మహారాజ రవితేజ హీరోగా , డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 2024 లో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ద్వారా హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమాలో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. చివరిగా 2025లో ప్రముఖ హీరో రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో హీరోయిన్ గా నటించి మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈరోజు ఈమె పుట్టినరోజు ..ఈ సందర్భంగా ఈమెకు స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈమె నటిస్తున్న సినిమా యూనిట్ ఆకట్టుకునే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఆ పోస్టర్ చూస్తుంటే ఇది పౌరాణిక చిత్రమా రొమాంటిక్ డ్రామానా అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

లెనిన్ టీం నుంచి స్పెషల్ విషెస్..

గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు అఖిల్ కథానాయకుడిగా.. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లెనిన్. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా జూన్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన వారేవా వారేవా పాటతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్లో అఖిల్, భాగ్యశ్రీ కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ లభించింది.

Advertisement

ఆకట్టుకుంటున్న గెటప్..

ఇకపోతే ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడంతో టి సిరీస్ సంస్థ అధికారికంగా భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ ను రివీల్ చేస్తూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.. “అత్యంత ప్రతిభావంతులైన, ప్రకాశవంతమైన భాగ్యశ్రీ బోర్సే కి లెనిన్ టీం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. భారతి ఎప్పటిలాగే ఇప్పుడు కూడా తన మాయాజాలంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసి, జయించడానికి సిద్ధంగా ఉంది” అంటూ భాగ్యశ్రీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ పోస్టర్లో కిరీటం పెట్టుకొని మీసాలతో వైభవోపేతమైన సాంప్రదాయ పౌరాణిక శైలి వస్త్రధారణతో కనిపిస్తూనే.. ఒక యోధిరాలి గెటప్ లో భాగ్యశ్రీ కనిపిస్తోంది. ఇకపోతే ఇందులో ఈమె భారతి పాత్ర పోషిస్తోంది. ఒక లవర్ గా అయితే ఇప్పుడు సడన్ గా ఈ గెటప్ ఏంటి అంటూ అభిమానులు కూడా పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ALSO READ:బిగ్ బాస్ షోపై హరితేజ సంచలన వ్యాఖ్యలు!

భాగ్యశ్రీ బోర్సే కెరియర్..

భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే.. నైజీరియాలోని లాగోస్ లో చదువు పూర్తి చేసిన ఈమె ఇండియాకి వచ్చి బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్లో కెరియర్ ఎంచుకొని ఒక ఏజెన్సీతో కలిసి పని చేసింది కూడా.. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించిన ఈమె క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక యారియాన్ 2 సినిమాతో నటిగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది భాగ్యశ్రీ.
.

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×