E-Paper
Advertisement

OnePlus Pad 4 వచ్చేసింది.. ల్యాప్‌టాప్‌ను మర్చిపోయేలా చేసే ఏఐ ఫీచర్లు.. వావ్ అనిపించేలా బ్యాటరీ!

OnePlus Pad 4 వచ్చేసింది.. ల్యాప్‌టాప్‌ను మర్చిపోయేలా చేసే ఏఐ ఫీచర్లు.. వావ్ అనిపించేలా బ్యాటరీ!
Advertisement

OnePlus Pad 4: మొత్తానికి వన్‌ప్లస్ తమ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ OnePlus Pad 4ను ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ చేసేసింది. 2026కి సంబంధించి కంపెనీ నుంచి వచ్చిన అత్యంత పవర్‌ఫుల్ డివైజ్ ఇదే అని చెప్పాలి. పాత మోడల్స్‌తో పోలిస్తే దీనిలో డిజైన్, స్పీడ్, బ్యాటరీ ఇలా ప్రతి విషయంలోనూ భారీ మార్పులు చేశారు. ఇకపై ల్యాప్‌టాప్ అవసరం లేకుండానే అన్ని పనులూ చక్కబెట్టుకోవాలి అనుకునే వారికి ఇదొక పర్ఫెక్ట్ ఆప్షన్ కానుంది.

రూ.5వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్..

ఈ OnePlus Pad 4 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB+256GB మోడల్ ధర రూ.59,999 కాగా.. 12GB+512GB మోడల్ ధర రూ.64,999గా ఉంది. అయితే పాత Pad 3తో పోలిస్తే ధర కొంచెం పెరిగిన మాట నిజమే. కానీ, HDFC బ్యాంక్ కార్డు ఉన్నవారికి రూ.5,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. డ్యూన్ గ్లో, సేజ్ మిస్ట్ అనే సూపర్ కలర్స్‌లో వస్తున్న ఈ టాబ్లెట్ సేల్ మే 5వ తేదీ మధ్యాహ్నం నుంచి వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో మొదలవుతుంది.

పెన్సిల్ కంటే సన్నగా..

Advertisement

ఈ టాబ్లెట్‌ను చూడగానే ముందుగా దాని లుక్ మనల్ని ఫిదా చేస్తుంది. ఇది పెన్సిల్ కంటే సన్నగా (కేవలం 5.94mm మందం) ఉండి, చేత్తో పట్టుకుంటే చాలా లైట్ వెయిట్‌గా అనిపిస్తుంది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. 13.2 అంగుళాల పెద్ద స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది కాబట్టి.. టచ్ అదిరిపోతుంది. ముఖ్యంగా ఆఫీస్ వర్క్ చేసుకునే వారికి, డాక్యుమెంట్స్ చదివే వారికి ఈ స్క్రీన్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Also Read: ఇంత తక్కువ ధరకే ఫ్లాగ్‌షిప్ ఫోనా? Motorola Edge 30 Proపై దిమ్మతిరిగే ధర తగ్గింపు!

గేమర్లకు పూనకాలే..

Advertisement

దీనిలో వాడిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ వేరే లెవెల్ అని చెప్పాలి. వన్‌ప్లస్ టాబ్లెట్లలో ఇప్పటివరకు వచ్చిన అత్యంత వేగవంతమైన చిప్‌సెట్ ఇదే. గేమింగ్ ఎక్కువగా ఆడేవారి కోసం ఈ పాడ్‌లో ప్రత్యేకంగా కూలింగ్ సిస్టమ్ పెట్టారు. దీనివల్ల గంటల తరబడి పబ్జీ లాంటి గేమ్స్ ఆడినా టాబ్లెట్ వేడెక్కదు. పైగా మల్టీటాస్కింగ్ కోసం ఒకేసారి ఐదు విండోలు ఓపెన్ చేసి పనులు చేసుకోవచ్చు.

ప్రత్యేకంగా 8 స్పీకర్లు..

ఇకపోతే బ్యాటరీ విషయంలో వన్‌ప్లస్ ఈసారి రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా 13,380mAh భారీ బ్యాటరీని ఇచ్చింది. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజంతా వీడియోలు చూసినా, గేమ్స్ ఆడినా ఛార్జింగ్ అయిపోదు. ఒకవేళ ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చినా.. బాక్స్‌లోనే 80W ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు కాబట్టి.. నిమిషాల్లోనే ఫుల్ అయిపోతుంది. ఇక ఆడియో గురించి చెప్పక్కర్లేదు.. దీనిలో 8 స్పీకర్లు ఉన్నాయి. సినిమా చూస్తుంటే సౌండ్ చుట్టూ వినిపిస్తూ భలే మజా ఇస్తుంది.

అంతా ఏఐ మయమే..

ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ ట్యాబ్లెట్‌లో బోలెడన్ని ఏఐ ఫీచర్లను ఇచ్చారు. నోట్స్ రాయడానికి, మేటర్ షార్ట్ చేసి ఇవ్వడానికి, ట్రాన్స్‌లేషన్ చేయడానికి ఇవి భలే హెల్ప్ అవుతాయి. దీనితో పాటు వచ్చే స్టైలో ప్రో పెన్సిల్ కూడా చాలా స్మార్ట్‌గా ఉంటుంది. బొమ్మలు గీసేవారికి, నోట్స్ రాసేవారికి ఇది బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఒక ల్యాప్‌టాప్‌లో ఉండే పవర్, టాబ్లెట్‌లో ఉండే సౌలభ్యం రెండూ కలిపి వన్‌ప్లస్ మనకు అందిస్తోంది.

Also Read: వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు పండగే.. 8000mAh బ్యాటరీతో నార్డ్ కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్, ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా!

Related News

ఫోన్ బ్యాటరీని సైలెంట్‌గా ఖాళీ చేస్తున్న 5G.. ఈ ఒక్క సెట్టింగ్ మారిస్తే.. మైండ్ బ్లోయింగ్ రిజల్ట్!

ఇంతవరకు ఏ ఇయర్‌బడ్స్‌లోనూ లేని ఫీచర్లు..లుక్ చూస్తే మైండ్ బ్లాకే!

తడిసిన ఇయర్‌బడ్స్‌ను ఎలా కాపాడుకోవాలి? ఈ తప్పులు అస్సలు చేయకండి!

మీ స్మార్ట్‌ఫోన్ కొత్తదా లేక వాడిందా? ఈ చిన్న ట్రిక్స్‌తో..2 నిమిషాల్లో కనిపెట్టండి!

ఫిలిప్స్, షావోమీ, నోవా.. రూ. 1,500 లోపు ఏ ట్రిమ్మర్ కొంటే బెటర్?

ఇండిపెండెన్స్ డే ధమాకా సేల్స్..ఐఫోన్లు,వన్‌ప్లస్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు!

వైఫై రూటర్ మీద యాంటెనాలు దేనికోసమో తెలుసా? ఇప్పటివరకు మీకు ఎవ్వరూ చెప్పని షాకింగ్ ఫ్యాక్ట్స్!

మార్కెట్లోకి All-in-One మిక్సీ.. 1 మిషన్, 10 రకాల పనులు.. హెవీ డ్యూటీకి కేరాఫ్!

Big Stories

Advertisement
×