E-Paper
Advertisement

విజ‌య్‌కు ‘కులం లేదు’ ట‌! స్వ‌యంకృషితోనే…. సినిమా, రాజ‌కీయం రెండింట్లోనూ!

విజ‌య్‌కు ‘కులం లేదు’ ట‌! స్వ‌యంకృషితోనే…. సినిమా, రాజ‌కీయం రెండింట్లోనూ!
Advertisement

మ‌న తెలుగు రాష్ట్రాల కంటే త‌మిళ తంబీలే బెట‌ర‌ట‌.  క‌మ్మ‌, కాపు, రెడ్డి.. వెల‌మ‌.. ఇలా కులాల‌ను కాకుండా అక్క‌డ అంద‌రినీ ఆద‌రిస్తున్నార‌ని తేలింది. అది సినిమాల్లోనైనా.. రాజ‌కీయాల్లోనైనా! విజ‌య్ గెలుపుతో ఇప్పుడు ఆయ‌న‌ది ఏ కులం అనే టాపిక్ సీరియ‌స్‌గా న‌డుస్తుంది. అత‌డు ద‌ళితుడు.. కానీ క్రైస్త‌వ మతం తీసుకున్నాడ‌ని ఒక‌రు.. కాదు కాదు. బీసీ అని ఇంకొక‌రు… ఇలా ఎవ‌రికి వారే విజ‌య్ కులం గురించి చ‌ర్చోప‌చర్చ‌లు చేసుకుంటున్నారు. కానీ అత‌ని తండ్రి చిన్న‌ప్పుడు స్కూళ్లో చేర్పించిన‌ప్పుడే కులం లేదు.. అని రాయించార‌ట‌. ఇది కూడా ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ రాజ‌కీయంగా ఎదుగుతూ వ‌చ్చిన కులాల‌న్ని బ‌లంగా ఉన్న‌వే. కానీ బ‌ల‌మైన కులాల‌నే ఆద‌రించాల‌ని, త‌మ కుల‌మే ఉండాల‌నే కుల‌గ‌జ్జి మాత్రం మ‌న తెలుగు రాష్ట్రాల‌తో పోల్చితే అక్క‌డ చాలా త‌క్కువేనని తేలిందట‌. ఈ విశ్లేష‌ణ కూడా జ‌రుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో. ఏ కుల‌మో ఇత‌మిత్థంగా తెలియ‌క‌పోవ‌డం కూడా విజ‌య్‌కు రాజకీయాల్లో క‌లిసొచ్చిన అంశంగా చెబుతున్నారు.

ఇక క్రైస్త‌వుల శాతం అక్క‌డ 4 శాతానికి మించి లేద‌ట‌. ఈ లెక్క‌న చూస్తూ విజ‌య్ గెలిచేవాడు కాదు. అంటే.. అటు రాజ‌కీయాల్లో ఇటు సినిమా రంగంలో త‌న సొంత ప్ర‌తిభ‌తోనే ఎదిగాడు విజ‌య్‌. త‌న‌కు ఈ రెండు రంగాల్లో ఎలాంటి గాడ్ ఫాద‌ర్ లేడ‌న్న‌మాట‌. క‌నీసం కుల‌బలం కూడా లేదు. కేవ‌లం స్వ‌యంకృషితోనే ఆయ‌న ఎదుగుతూ వ‌చ్చాడు. ఇప్పుడు సీఎం స్థాయికి పోయాడు. ఇదీ స్పూర్తిదాయ‌క‌మైన విష‌యం క‌దా! అదే మ‌న తెలుగు రాష్ట్రాల్లో ఇలా జరిగేదా? జ‌రిగిందా? అనేది కూడా ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం.

Advertisement

త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే..

మలయాళీ నాయర్ అయిన ఎంజీఆర్‌ను వారు పెద్ద హీరోగా, తర్వాత ముఖ్యమంత్రిగా ఎదిగించారు. అలాగే మైసూరులో జన్మించిన బ్రాహ్మణురాలు జయలలితను కూడా అగ్రనాయకురాలిగా నిలబెట్టారు. ఆలయ సంగీతకారుల వర్గానికి చెందిన కరుణానిధి కూడా పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదిగారు.అక్కడ సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఒకే కులం ఆధిపత్యం లేదనే భావన ఉంది. ఇప్పుడు విజయ్‌తో అది మరింత బలపడుతోందని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయినా భార‌త‌దేశ‌మే కుల రాజ‌కీయాల‌తో కుళ్లిపోయి ఉంది కదా! ఇది సాధ్య‌మేనా? నిజ‌మేనా? అని ముక్కున వేలేసుకోవ‌ద్దు. ఇత‌ర ప్రాంతాల‌తో చూస్తే కొంచెం బెట‌ర‌నుకోవాలి. సినిమా పిచ్చి కూడా అంద‌రికంటే కొంచెం ఎక్కువ‌నుకోవాలి. అంతే ఇలా కార‌ణాలు వేరైనా… కులం విష‌యంలో.. మ‌రీ కుల‌గ‌జ్జి ప్ర‌ద‌ర్శ‌న లేద‌ని అనుకోవ‌డం కొంచెం రిలీఫ్ అంతే!

Tags

Related News

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?

తిరుప‌తి పుంగ‌నూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప‌ద‌వి కోసం తెలుగు త‌మ్ముళ్ల కుమ్ములాట‌..!

కేసీఆర్ టీఆరెస్ పార్టీకి బీజం వేసిన బ‌షీర్‌బాగ్ కాల్పుల ఉదంతం..! రాజ‌కీయ గ‌తిని మ‌లుపుతిప్పిన చ‌లో అసెంబ్లీ…

Big Stories

Advertisement
×