E-Paper
Advertisement

Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామ అభివృద్ధే ధ్యేయం, నిరుపేదలకు ఇందిరిమ్మ ఇల్లు

Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామ అభివృద్ధే ధ్యేయం, నిరుపేదలకు ఇందిరిమ్మ ఇల్లు
Advertisement

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల కోలాహలం పతాక స్థాయికి చేరుకుంది. మొదటి విడత ఎన్నికలు ముగిసి, రేపు రెండో విడత పోలింగ్ జరగనున్న తరుణంలో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్న ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గం మల్లేశం తన ఎన్నికల ప్రణాళికను (మ్యానిఫెస్టో) విడుదల చేసి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా.. ‘క్రికెట్ బ్యాట్’ గుర్తుపై పోటీ చేస్తున్న ఆయన, గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని భారీ వాగ్ధానాలు చేశారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మల్లేశంను గెలిపించాలనలి కోరారు.

సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి

Advertisement

మల్లేశం తన కరపత్రంలో పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారు. గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం, గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 5 వేల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించడం చర్చనీయాంశమైంది. వృద్ధులు, ఒంటరి మహిళలు మరియు వికలాంగుల కోసం రేషన్ సరుకులను నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేస్తామని ఆయన వాగ్ధానం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

మౌలిక సదుపాయాలు అభివృద్ధి

Advertisement

గ్రామ మౌలిక వసతుల విషయంలో మార్గం మల్లేశం స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేశారు. మాదాపూర్ చెరువును అభివృద్ధి చేసి, దాని కట్టను సుందరీకరించడంతో పాటు పక్కనే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో వేసిన నాసిరకం రోడ్ల స్థానంలో కొత్తగా సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని, ప్రతి ఇంటికీ నిరంతరం తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. రవాణా సౌకర్యాల కోసం మాదాపూర్ నుండి ఆర్టీసీ బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలోని పాత హనుమాన్ ఆలయం, శ్రీ రామాంజనేయ దేవాలయాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తామని భక్తి భావంతో కూడిన హామీని కూడా చేర్చారు.

రైతు, మహిళా సాధికారత

రైతుల సంక్షేమం కోసం మార్కెట్ యార్డ్ నిర్మాణం చేస్తామని, వడ్లు, మొక్కజొన్న వంటి పంటలను సకాలంలో కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తామని మల్లేశం తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి పొందేలా మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామ సూపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతి మూడు నెలలకొకసారి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, పారిశుధ్యం కోసం ప్రతి వారం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వివరించారు.

చివరగా.. గత పాలనలో జరిగిన అవినీతిపై ప్రత్యేక అధికారి ద్వారా విచారణ చేయిస్తానని చెబుతూ, పారదర్శక పాలన అందిస్తానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మాదాపూర్ గ్రామ బిడ్డగా తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరుతున్నారు.

ALSO READ: CM Revanth Reddy: హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీతో కలిసి ప్రయాణం

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×