E-Paper
Advertisement

OnePlus 13 నుంచి Nord సిరీస్ వరకు భారీ ఆఫర్లు.. జూన్ 10 వరకు బంపర్ డిస్కౌంట్స్!

OnePlus 13 నుంచి Nord సిరీస్ వరకు భారీ ఆఫర్లు.. జూన్ 10 వరకు బంపర్ డిస్కౌంట్స్!
Advertisement

OnePlus Sale 2026: తక్కువ బడ్జెట్‌లో కొత్త ఫోన్ లేదా టాబ్లెట్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే వన్‌ప్లస్ మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. ప్రస్తుతం భారత్‌లో OnePlus Community Sale 2026 ప్రారంభమైంది. జూన్ 10 వరకు లైవ్‌లో ఉండే ఈ సేల్‌లో వన్‌ప్లస్ ఫోన్లు, టాబ్లెట్లు, ఆడియో ప్రొడక్ట్స్‌పై భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ లభిస్తున్నాయి. వన్‌ప్లస్ వెబ్‌సైట్‌తో పాటు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్ లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ప్రత్యేక ఆఫర్లు జూన్ 7తోనే ముగియనున్నాయి.

ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై క్రేజీ డిస్కౌంట్స్:

ఈ సేల్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఫోన్ OnePlus 13. దీనిపై ఏకంగా రూ.12,000 ధర తగ్గింపుతో పాటు రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో మొత్తం రూ.17,000 లాభంతో దీనిని రూ.52,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక లేటెస్ట్ OnePlus 15 ఫోన్‌పై రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ ఉండటంతో.. దీని ఎఫెక్టివ్ ధర రూ.74,999కి తగ్గింది. అలాగే OnePlus 15R ఫోన్‌ను రూ.3,000 ఆఫర్‌తో రూ.51,999కే కొనుగోలు చేయొచ్చు. OnePlus 13S మోడల్‌పై ధర తగ్గింపు, బ్యాంక్ డిస్కౌంట్ కలిపి రూ.5,000 లాభం లభిస్తోంది. దీని ధర ఇప్పుడు రూ.49,999గా ఉంది.

Advertisement

Also Read: టీచర్లు, ఆన్‌లైన్ ట్యూటర్ల పని సులువు చేసే టాప్-5 AI టూల్స్ ఇవే!

Nord సిరీస్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ డీల్స్:

మిడిల్‌క్లాస్ వినియోగదారుల కోసం నార్డ్ సిరీస్ ఫోన్లపై కూడా వన్‌ప్లస్ మంచి ఆఫర్లను ఇస్తోంది. కొత్తగా వచ్చిన OnePlus Nord 6 ఫోన్‌పై రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుండటంతో దీని ధర రూ.40,999గా మారింది. అలాగే Nord CE 6 ఫోన్‌ను రూ.2,000 తగ్గింపుతో రూ.29,999కి, Nord CE 6 Lite ఫోన్‌ను రూ.1,500 డిస్కౌంట్‌తో రూ.21,499కే దక్కించుకోవచ్చు. దీనికి తోడు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

టాబ్లెట్లు, ఆడియో ప్రొడక్ట్స్‌పై ఆఫర్లు:

Advertisement

ఫోన్లతో పాటు టాబ్లెట్లపై కూడా కంపెనీ ఆఫర్లు ప్రకటించింది. OnePlus Pad 4పై రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుండటంతో దీని ధర రూ.56,999కి తగ్గింది. దీంతోపాటు ఉచితంగా Stylo Pro పెన్ను అందిస్తున్నారు. అలాగే OnePlus Pad Go 2 ధర రూ.26,999 కాగా.. Stylo Go 2 ఉచితంగా వస్తుంది. ఇక Pad Lite రూ.16,999కే లభిస్తోంది. ఆడియో విభాగంలో OnePlus Buds 4 ధర రూ.6,099 కాగా.. Buds Pro 3 ధర రూ.11,999గా ఉంది. వీటితో పాటు నార్డ్ బడ్స్, బుల్లెట్స్ వైర్‌లెస్ సిరీస్‌లపై కూడా మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో తెలుసా?

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×