E-Paper
Advertisement

ఎసీ లేకుండానే చల్లని రైలు ప్రయాణం.. మొట్ట మొదటి ఏసీ బోగిని ఎలా తయారు చేశారంటే?

ఎసీ లేకుండానే చల్లని రైలు ప్రయాణం.. మొట్ట మొదటి ఏసీ బోగిని ఎలా తయారు చేశారంటే?
Advertisement

Indian Railway: భారతీయ రైల్వే చరిత్రలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అనేక వినూత్న ప్రయోగాలు జరిగాయి. వాటిలో ముఖ్యమైనది ఎయిర్ కండిషన్డ్ రైళ్ల ప్రారంభం. చాలా మంది అనుకున్నట్లు దేశంలో ఎయిర్ కండిషనింగ్ సదుపాయం 1936లో మొదలుకాలేదు. వాస్తవానికి, దేశంలోని తొలి ఎయిర్ కండిషన్డ్ రైలు సర్వీసు 1934లోనే ప్రారంభమైంది. ఆ కాలంలో బొంబాయి, బరోడా అండ్ సెంట్రల్ ఇండియా రైల్వే ఆధ్వర్యంలోని పాపులర్ ఫ్రాంటియర్ మెయిల్ రైలులో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చారు. ఈ రైలు అప్పటి బొంబాయి నుంచి పెషావర్ వరకు నడిచేది. బ్రిటిష్ పాలనలో అత్యంత ప్రతిష్టాత్మక రైళ్లలో ఈ రైలు ఒకటిగా గుర్తింపు పొందింది.

కూలింగ్ కోసం ఐస్ బ్లాక్‌ ల ఏర్పాటు

ఆ రోజుల్లో ప్రస్తుతం ఉన్నట్లుగా విద్యుత్ ఆధారిత ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు అందుబాటులో లేవు. అయినప్పటికీ ప్రయాణికులకు చల్లని వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక పద్ధతులను ఉపయోగించేవారు. కోచ్‌ లలో పెద్ద ఐస్ బ్లాక్‌ లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా గాలిని చల్లబరచే విధానాన్ని అమలు చేసేవారు. ఈ విధానాన్ని ఐస్ కూల్డ్ కోచ్‌లు అని పిలిచేవారు. రైలు ప్రయాణ సమయంలో ఐస్ క్రమంగా కరుగుతూ ఉండేది. ఆ చల్లదనం కోచ్‌ లోని గాలికి చేరి లోపలి ఉష్ణోగ్రతను తగ్గించేది. దీంతో వేసవికాలంలో కూడా ప్రయాణికులు కొంతవరకు చల్లని వాతావరణంలో ప్రయాణించే అవకాశం పొందేవారు. ఆ కాలానికి ఇదో ఆధునిక సాంకేతికగా గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత విద్యుత్ ఆధారిత ఏసీ వ్యవస్థ

Advertisement

ఫ్రాంటియర్ మెయిల్‌ లో ప్రవేశపెట్టిన ఈ సదుపాయం భారతీయ రైల్వేల్లో ప్రయాణ సౌకర్యాల అభివృద్ధికి కొత్త దారిని చూపింది. తర్వాతి సంవత్సరాల్లో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో విద్యుత్ ఆధారిత ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఐస్ ఆధారిత కూలింగ్ విధానాలు క్రమంగా కనుమరుగయ్యాయి. అయితే, భారతీయ రైల్వేల్లో ఎయిర్ కండిషనింగ్ చరిత్రను పరిశీలిస్తే, 1934లో ఫ్రాంటియర్ మెయిల్‌ లో ప్రారంభమైన ఈ ప్రయోగం ఓ మైలురాయిగా నిలిచింది. అప్పటి పరిమిత సాంకేతిక వనరులతోనే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు రైల్వే అధికారులు చేసిన ప్రయత్నాలకు ఇదో నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఇప్పటి ఏసీకి అప్పట్లోనే పునాది

ఇప్పటి అత్యాధునిక ఏసీ కోచ్‌లు, వేగవంతమైన రైళ్లు, ప్రీమియం సేవల వెనుక ఇలాంటి చారిత్రక ప్రయోగాలే పునాదిగా చెప్పవచ్చు. భారతీయ రైల్వే అభివృద్ధి ప్రయాణంలో ఫ్రాంటియర్ మెయిల్‌ కు ప్రత్యేక స్థానం ఉండటానికి ఇదే ప్రధాన కారణం. 1934లో ప్రారంభమైన ఈ ఐస్ కూల్డ్ కోచ్‌లు దేశంలో రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చిన తొలి అడుగుగా చరిత్రలో నిలిచిపోయింది.

Advertisement

Read Also: ఫ్రీ ఎంఎంటీఎస్ ట్రావెల్ కు నో.. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైల్వే బోర్డు!

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×