BigTV English
Advertisement

ChatGPT – OpenAI: షాకింగ్.. సూసైడ్ ఆలోచనలో 12లక్షల మంది ChatGPT యూజర్స్!

ChatGPT – OpenAI: షాకింగ్.. సూసైడ్ ఆలోచనలో 12లక్షల మంది ChatGPT యూజర్స్!

ChatGPT – OpenAI: ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ఎంతోమంది తమ మానసిక పరిస్థితి కారణంగానో, ఒంటరితనం వల్లనో క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు (సూసైడ్) తీసుకుంటూ ఉంటారు. ఇలా సూసైడ్ చేసుకునే వారి సంఖ్య రోజుకోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అయితే, తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సంస్థ OpenAI తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ప్రతివారం ChatGPTని ఉపయోగిస్తున్న 80 కోట్లమంది వినియోగదారుల్లో సుమారు 12 లక్షల మందికి ఆత్మహత్య చేసుకోవాలనే స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని OpenAI లెక్కించింది.


అత్యంత ఆందోళనకరమన్న OpenAI..

తాజాగా ప్రచురించిన ఒక బ్లాగ్ పోస్టులో, OpenAI ఈ అంచానాను విడుదల చేస్తూ.. ఏఐపై ప్రజలు తీవ్రమైన భావోద్వేగ అనుబంధం పెంచుకుంటున్నారని, లక్షలాది మందిలో మానసిక రుగ్మతల లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఈ సంభాషణలు గణాంక పరంగా చాలా అరుదైనప్పటికీ, తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య గణనీయంగా ఉందని ఈ నివేదిక చూస్తే అర్థమవుతుంది.

మానసిక నిపుణులతో భద్రతా చర్యలు..

12 లక్షల మందికి పైగా సూసైడ్ ఆలోచనలు కలిగి ఉన్నారన్న ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. తమ ప్లాట్‌ఫామ్‌ను సురక్షితంగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించే క్రమంలో OpenAI ఈ వివరాలను పంచుకుంది. మానసిక ఆరోగ్య సంక్షోభం, ఆత్మహత్య ఆలోచనల వంటి సున్నితమైన అంశాల్లో చాట్‌బాట్ స్పందించే తీరును మెరుగుపరిచేందుకు 170 మందికి పైగా మానసిక ఆరోగ్య నిపుణులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.


భద్రతా నియమాల్లో 91 శాతం సక్సెస్..

అప్డేటెడ్ GPT-5 మోడల్ ఇలాంటి సున్నితమైన విషయాల్లో చాలా మెరుగ్గా పనిచేస్తున్నట్లు OpenAI తెలిపింది. అంతర్గత పరీక్షల్లో, పాత మోడల్‌తో పోలిస్తే కొత్త మోడల్ 65 శాతం అధికంగా సరైన రీతిలో స్పందించిందని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా సూసైడ్‌కు సంబంధించిన సంభాషణల్లో భద్రతా నియమాలను పాటించడంలో పాత మోడల్ 77 శాతం సక్సెస్ అయితే, కొత్త మోడల్ 91 శాతం కచ్చితత్వంతో పనిచేసిందని వివరించింది.

టీనేజర్ మరణంతో వెలుగులోకి..

కాలిఫోర్నియాకు చెందిన టీనేజర్ ఆడమ్ రైన్.. తీవ్రమైన మానసిక సమస్యతో సూసైడ్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానికి సంబంధించిన సలహాలను ChatGPT ఇవ్వడం వల్లే అతను చనిపోయాడని OpenAIపై దావా వేశారు. దీని తర్వాత, OpenAI తన చాట్‌బాట్‌ను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంది. వినియోగదారుల మానసిక ఆరోగ్య సమస్యలను మెరుగ్గా గుర్తించడం, స్పందించడం కోసం ChatGPTని అప్డేట్ చేసింది. అంతేకాదు.. తల్లిదండ్రుల నియంత్రణలను పెంచడం, సంక్షోభ హెల్ప్‌లైన్ల నంబర్లకు మెరుగైన ప్రాప్యతను అందించడం, సున్నితమైన సంభాషణలను సురక్షితమైన మోడళ్లకు ఆటోమేటిక్‌గా మళ్లించడం వంటి రక్షణ ఏర్పాట్లను OpenAI ప్రవేశపెట్టింది.

 

 

 

 

 

 

Related News

Jio-Google Gemini Pro: జియో యూజర్లకు అదిరిపోయే శుభవార్త… 18 నెలల పాటు ఉచితమే!

Realme C85 Pro: విడుదలకు ముందే.. Realme C85 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్ లీక్!

Vivo X300 Series: ఇవాళే Vivo X300 సిరీస్ లాంచ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కిర్రాక్ అంతే!

YouTube New Feature: యూట్యూబ్ షాకింగ్ డెసిషన్.. ఇక నుంచి అలా చెయ్యలేరు!

Lines on Keyboard: కీబోర్డ్‌ లో F, J మీద చిన్న లైన్స్.. ఎందుకు ఉంటాయో తెలుసా?

Pocket Size Printer: జేబులో సరిపోయే ఫొటో ప్రింటర్.. షావోమీ కొత్త గాడ్జెట్ గురించి తెలుసా

Calling Name Presentation: టెస్టింగ్ టైమ్.. మొబైల్ స్క్రీన్లలో ఇకపై వ్యక్తి పేరు, డిజిటల్ అరెస్టులకు బ్రేక్?

Big Stories

×