BigTV English
Advertisement

IRCTC Master List: టికెట్ కన్ఫార్మ్ కావడానికి ఇదో కొత్త ట్రిక్.. మాస్టర్ లిస్ట్‌తో ఇలా ట్రై చేయండి!

IRCTC Master List: టికెట్ కన్ఫార్మ్ కావడానికి ఇదో కొత్త ట్రిక్.. మాస్టర్ లిస్ట్‌తో ఇలా ట్రై చేయండి!

Indian Railway:

భారతీయ రైల్వే ద్వారా నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరమైన ప్రయాణాలు కొనసాగిస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో కన్ఫార్మ్ టికెట్లు దొరకడం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా పండుగలు, సెలవు దినాల్లో రద్దీ కారణంగా కన్ఫార్మ్ టికెట్లు లభించవు. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల సౌలభ్యం కోసం IRCTC ‘మాస్టర్ లిస్ట్’ అనే ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది టికెట్ బుకింగ్ సమయాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. కన్ఫార్మ్ టికెట్ పొందే అవకాశాలను మరింత పెంచుతుంది.


ఇంతకీ ఏంటీ IRCTC మాస్టర్ లిస్ట్ ఫీచర్? 

ఆన్‌ లైన్‌ లో టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు, ఎక్కువ టైమ్ ప్రయాణీకుల పేర్లు, వయస్సు, లింగం సహా ఇతర సమాచారాన్ని ఫిల్ చేసేందుకు ఉపయోగిస్తారు. అప్పటికే చాలా మంది టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల కన్ఫార్మ్ టికెట్ లభించదు. ఈ నేపథ్యంలో ‘మాస్టర్ లిస్ట్’ ఫీచర్ ప్రయాణీకుల వివరాలను ముందే ఫిల్ చేసి పెట్టుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకునే సమయంలో మాస్టర్ లిస్టులోఆల్రెడీ ఉన్న వివరాలను నేరుగా ఉపయోగించుకోవచ్చు. చాలా సమయం ఆదా అవుతుంది. ఈజీగా కన్ఫార్మ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది. మాస్టర్ లిస్ట్ అనేది టికెట్ బుకింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడానికి ఉపయోగపడటంతో పాటు కన్ఫార్మ్ టికెట్ దొరికేలా చేస్తుంది.

మాస్టర్ లిస్ట్‌ ను ఎలా క్రియేట్ చేసుకోవాలి?   

⦿ ముందుగా IRCTC వెబ్‌ సైట్ లేదంటే మొబైల్ యాప్‌ ను ఓపెన్ చేయాలి.


⦿ ముందుగా సైట్ లోకి లాగిన్ కావాలి.

⦿ మై అకౌంట్ లోకి  వెళ్లి మై ప్రొఫైల్‌ ను సెలెక్ట్ చేసుకోవాలి.

⦿ ఇందులో మాస్టర్ లిస్ట్‌ ను యాడ్ చేయండి లేదంటే సవరించండి అనే ఆప్షన్ కనిపిస్తుంది.

⦿ ఇందులో ప్రయాణీకుడి పేరు, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్‌ లాంటి వివరాలను నమోదు చేయండి.

⦿ ఆధార్ ధృవీకరణ పూర్తయిన తర్వాత, ప్రయాణీకుడి సమాచారం మాస్టర్ లిస్ట్‌ కు యాడ్ అవుతుంది.

మాస్టర్ లిస్ట్ తో లాభం ఏంటి? 

ఒకసారి మాస్టర్ లిస్టులో ప్రయాణీకుడి వివరాలను నమోదు చేస్తే, టికెట్ బుక్ చేసుకున్న ప్రతిసారీ సదరు ప్రయాణీకుడి వివరాలను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మాస్టర్ లిస్ట్ నుంచి పేరును ఎంచుకుని, వెంటనే బుకింగ్‌ను పూర్తి చేసుకోవచ్చు.ఇలా చేయడం వల్ల బుకింగ్ ప్రక్రియ వేగంగా ఉంటుంది. కన్ఫార్మ్ చేయబడిన టికెట్ పొందే అవకాశాలు పెరుగుతాయి. వెయిటింగ్ లిస్ట్‌ ఇబ్బంది తగ్గుతుంది.

IRCTC వాలెట్‌ తో చెల్లింపులపై టైమ్ ఆదా  

IRCTC వాలెట్‌ తో లేదంటే QR కోడ్‌ ను స్కాన్ చేయడం ద్వారా చెల్లిస్తే, టైమ్ మరింత సేవ్ అవుతుంది. అలా కాకుండా కార్డు ద్వారా చెల్లింపు చేయడం ద్వారా ఎక్కువ సమయం పడుతుంది. కన్ఫార్మ్ టికెట్ పొందే అవకాశం తగ్గుతుంది. టికెట్ బుకింగ్ సమయంలో టికెట్ కన్ఫార్మ్ అవుతుందో? లేదో? కొన్ని సెకన్ల సమయం నిర్ణయిస్తుంది. సో, ప్రతి సెకెన్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని మర్చిపోకూడదు.

Read Also: షాకింగ్.. 6 గంటల పాటు IRCTC వెబ్ సైట్ డౌన్.. కారణం ఏంటంటే?

Related News

Viral Video: రైల్వే స్టేషన్‌లో మెట్లు దిగలేక వికలాంగుడి పాట్లు.. వెంటనే రైల్వే పోలీస్ ఏం చేశాడంటే..

IRCTC Down: షాకింగ్.. 6 గంటల పాటు IRCTC వెబ్ సైట్ డౌన్.. కారణం ఏంటంటే?

AP Trains: ఏపీలో రైళ్లకు మరింత వేగం.. రైల్వేశాఖ కీలక నిర్ణయం!

Viral Video: పర్సును కొట్టేసిన దొంగలు, కోపంతో ఏసీ కోచ్ విండో పగలగొట్టిన మహిళ, వీడియో వైరల్!

Train Derailed: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, అదే మార్గంలో దూసుకొచ్చిన ఎక్స్‌ ప్రెస్‌..

Cyclone Montha Effect: మొంథా ఎఫెక్ట్, వందేభారత్ సహా పలు రైల్వే సర్వీసులు బంద్!

IRCTC Tour Package: కాశీ నుంచి అయోధ్య వరకు.. 5 రోజుల పవిత్ర యాత్రలో భాగమయ్యే అవకాశం

Big Stories

×