BigTV English
Advertisement

Bahubali: బాహుబలి రీ రిలీజ్ అరాచకం, మాస్ జాతరకు ఇది పెద్ద దెబ్బే

Bahubali: బాహుబలి రీ రిలీజ్ అరాచకం, మాస్ జాతరకు ఇది పెద్ద దెబ్బే

Bahubali  : చాలామంది కొన్ని సినిమాల్లో బీభత్సమైన డైలాగులు వేస్తుంటారు. చరిత్ర అంటే మాది, చరిత్ర సృష్టించాలంటే మేమే చరిత్ర తిరగరాయాలంటే మేమే అని అంటుంటారు. అలాంటి డైలాగ్స్ వింటున్నప్పుడు చాలామంది ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. ఇక అలాంటి చరిత్ర నిజంగానే ఒకరు సృష్టిస్తే, కలకాలం గుర్తుండిపోయే సినిమాలు చేస్తే. ఒక సినిమా తెలుగు సినిమా చరిత్రను తిరగ రాస్తే అదే బాహుబలి.


ఎవరు ఊహించని ఒక కొత్త ప్రపంచాన్ని ఊహించి, మాహిష్మతి అనే సామ్రాజ్యాన్ని వెండితెరపై చిత్రీకరించాడు ఎస్.ఎస్ రాజమౌళి. ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ సినిమా తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీని చూడటం కంప్లీట్ గా మారిపోయింది.

బాహుబలి రీ రిలీజ్ అరాచకం

ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంతటి అరాచకం సృష్టించిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే మొత్తం 121 షోస్ ప్లాన్ చేస్తే, ఇప్పటి వరకు హౌస్ ఫుల్ అయిన షోలు 116. మిగతావి కూడా ఫుల్ అయిపోతాయి అని చెప్పాలి.


Hyderabad – 50/50

Vizag – 14/14

Vijayawada – 19/24

Guntur – 9/12

Kakinada – 5/5

Rajahmundry – 5/5

Tirupati – 5/5

Vizianagaram – 2/3

kadapa+Kurnool+Chittoor – 3/4

Bhimavaram+Tpgudem+Tanuku – 4/4

ఇలా అన్నిచోట్ల మంచి ఆదరణ బాహుబలి సినిమాకు లభిస్తుంది. కేవలం రిలీజ్ అప్పుడు మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా మరోసారి ప్రభంజనం చూపిస్తుంది బాహుబలి.

మాస్ జాతర సినిమాకు దెబ్బ 

మామూలుగా ఒక కమర్షియల్ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా పోటీ లేకపోతే దానికి మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన సినిమా మాస్ జాతర. ఆ సినిమా కూడా ప్రస్తుతం ప్రేక్షకులు ముందుకు అక్టోబర్ 31న అనగా రేపు విడుదల కానుంది. రేపు ఈవెనింగ్ చూస్తూ ఈ సినిమా మొదలవుతుంది.

నవంబర్ 1న మార్నింగ్ నుంచి ఈ సినిమా అవైలబుల్ గా ఉంటుంది. అయితే బాహుబలి సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో అక్కడక్కడ మాస్ జాతిర సినిమా పై నష్టం చూపిస్తుంది. మామూలుగా మాస్ జాతర సినిమా రేపు ఈవినింగ్ షోస్ కి టికెట్లు దొరకడం చాలా కష్టం. కానీ బాహుబలి రిలీజ్ వలన చాలా చోట్ల మాస్ జాతర టిక్కెట్లు అవైలబుల్ గా ఉన్నాయి.

ఇక ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే సేఫ్ అయినట్లే. ఈ సినిమాకి మాస్ జాతర అనే టైటిల్ పెట్టడంతో పాటు, కింద ట్యాగ్ లైన్ గా మనదే ఇదంతా అని పెట్టారు. ఇది రవితేజ ఫేమస్ డైలాగ్. కానీ మనదే ఇదంతా అనుకునే సిచువేషన్ ఇప్పుడు లేదు. ఎందుకంటే బాహుబలి వచ్చేసింది. ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇకపోతే ఇప్పటికే మాస్ జాతర సినిమా నుంచి విడుదలైన పాటలు మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా మీద మంచి పాజిటివ్ టాక్ అయితే ఉంది. రిజల్ట్ ఏమవుతుందో చూడాలి.

Also Read: Venky Trivikram : సినిమా ఫస్ట్ షెడ్యూల్ అప్పుడే, వెంకటేష్ తో శ్రీనిధి కీలక సీన్స్

Related News

imran hashmi : తెలుగు సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు, అంత మాట అనేసవెంటి ఓమీ

Mamitha Baiju: అదృష్టం అంటే ఈ అమ్మాయి ఇదే, నచ్చిన స్టార్లతో అవకాశం

Narvini Dery: అజ్మల్ అలాంటివాడే.. ఆడిషన్ అని చెప్పి గదిలోకి పిలిచాడు.. హీరోపై నటి సంచలన కామెంట్స్‌

Baahubali The Epic :వెయిట్ చేయక్కర్లేదు, బాహుబలి చేంజెస్ కాకుండా ఇవి ఆడ్ చేశారు

Bison: U-18 మహిళల కబడ్డీ జట్టుకు మారి సెల్వ రాజ్ విరాళం, ఇది కదా అసలైన వ్యక్తిత్వం

Baahubali The Epic : బాహుబలి రీ రిలీజ్, మెగాస్టార్ చిరంజీవి పై ట్రోలింగ్

Baahubali : జై మాహిష్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపిన జక్కన్న, ఇది మరో చరిత్ర

Big Stories

×