E-Paper
Advertisement

Oppo A6 Pro 5G: రూ.21,999 ధరకే IP69 రేటింగ్ స్మార్ట్‌ఫోన్.. ఇండియన్ మార్కెట్లోకి ఒప్పో A6 ప్రో 5G వచ్చేసింది!

Oppo A6 Pro 5G:  రూ.21,999 ధరకే IP69 రేటింగ్ స్మార్ట్‌ఫోన్.. ఇండియన్ మార్కెట్లోకి ఒప్పో A6 ప్రో 5G వచ్చేసింది!
Advertisement

Oppo A6 Pro 5G: ప్రముఖ OPPO సంస్థ వినియోగదారుల అభిరుచులకు తగిన విధంగా, అత్యాధునిక ఫీచర్లతో భారత మార్కెట్లోకి ‘OPPO A6 Pro 5G’ను అధికారికంగా లాంచ్ చేసింది. 2025లో విడుదలైన ఒప్పో A5 ప్రో 5Gకి కొనసాగింపుగా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌‌ను కలిగి ఉందని తెలుస్తోంది. దీని స్క్రీన్ గరిష్టంగా 1125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ వరకు సపోర్ట్ అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఒప్పో A6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం..

ఈ OPPO A6 Pro 5G మొబైల్.. IP66, IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను కలిగి ఉన్నాయి. అలాగే అధిక పీడన, పూర్తిగా నీటిలో మునిగిన పరిస్థితులతో పాటు 80 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిని కూడా ఈ ఫోన్ తట్టుకోగలదని ఒప్పో తెలిపింది. అలాంటి భద్రతా ప్రమాణాలతో దీనిని తయారు చేసినట్లు తెలుస్తోంది. దీనిలో మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే ఇది 8GB LPDDR4x RAMతో పాటు 128GB/ 256GB UFS 2.2 స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది.

Advertisement

Also Read: వచ్చేస్తోంది గేమింగ్ బీస్ట్ ఐకూ 15R.. ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయ్!

ఇక గేమింగ్, రోజూవారీ ఉపయోగం కొరకు.. 3900mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. ఇకపోతే OPPO A6 Pro 5G ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15పై పనిచేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. దీనిలో 50 మెగాపిక్సల్ ప్రైమరీ రియర్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సల్ మోనోక్రోమ్ కెమెరాను అమర్చారు. అలాగే సెల్ఫీల కోసం 16 మెగాపిక్సల్ కెమెరా, భద్రతకు సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. 7000mAh భారీ బ్యాటరీ కలిగి ఉన్న ఈ ఫోన్ 80W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ మద్దతు ఇస్తుంది.

Advertisement

OPPO A6 Pro 5G ఫోన్ ఐదేళ్ల వరకు దీర్ఘకాలిక దృఢత్వాన్ని కలిగి ఉంటుందని కంపెనీ తెలపింది. ఇక కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే.. దీనిలో 5G SA/NSA సపోర్ట్, డ్యుయల్ 4G VoLTE, వైఫై 802.11 ac, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ఫోన్ బరువు సుమారు 216 గ్రాములు కాగా.. మందం 8.6mmగా ఉంటుంది. ఇది క్యాపిచినో బ్రౌన్, అరోరా గోల్డ్ కలర్స్‌లో లభిస్తుంది.

ఈ హ్యాండ్ సెట్ 8GB + 128GB వేరియంట్ ధర రూ.21,999 ఉండగా.. 8GB + 256GB వేరియంట్ ధర రూ.23,999గా ఉంది. ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, OPPO స్టోర్‌లు, ప్రధాన రిటైల్ దుకాణాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మరో గుడ్ న్యూస్ ఏమిటంటే.. లాంచ్ ఆఫర్లలలో భాగంగా.. ఈ ఫోన్‌ను బ్యాంక్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు 24 నెలల వరకు నో-కాస్ట్ EMI వెసులుబాటు పొందొచ్చు.

Also Read: రెడ్‌మీ డబుల్ ధమాకా.. భారత మార్కెట్లో రెడ్‌మీ నోట్ 15, రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రో గ్రాండ్ లాంచ్!

 

 

 

 

 

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×