E-Paper
Advertisement

Poverty Remedies: మీకు పట్టిన దరిద్రాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ చిన్న రెమెడీస్ పాటించండి

Poverty Remedies: మీకు పట్టిన దరిద్రాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ చిన్న రెమెడీస్ పాటించండి

Poverty Remedies: దరిద్రపు బాధలతో అష్టకష్టాలు పడుతున్నారు. రూపాయి సంపాదన లేక జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారా..? ఎంత సంపాదించినా డబ్బులు నిలవడం లేదా..? అయితే మీకు పట్టిన దరిద్రాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే శాస్త్రం ప్రకారం కొన్ని రెమెడీలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఏ రాశి వాళ్లు ఎలాంటి పరిహారం చేసుకోవాలో తెలియజేస్తున్నారు.

మీకు పట్టిన దరిద్రాలన్నీ  తొలగిపోవాలంటే మీ రాశి ప్రకారం మీరు మీ ఇష్టదైవానికి ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఏ రాశి వారు ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:

ఈ రాశి జాతకులకు జీవితంలో కలిసి రావాలంటే తాంబూలంలో మామిడి పండు పెట్టి మంగళవారం కుమారస్వామికి నైవేద్యంగా సమర్పించాలట. ఇలా తరుచుగా చేస్తుంటే వీరి జీవితంలో నెగెటివ్‌ మొత్తం పోయి హ్యాపీగా ఉంటారట.

వృషభ రాశి:

ఈ రాశి వారు తమ జీవితంలోని కష్టాలన్నీ తీరిపోయి ప్రశాంతంగా బతకాలంటే.. తమలపాకులో మిరియాలు పెట్టి మంగళవారం నాడు రాహువును పూజిస్తే వీరికి తిరుగే ఉండదట. అయితే ఈ పరిహారం కొద్ది వారాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు.

మిథున రాశి:

ఈ రాశి జాతకులకు కలిసి రావాలంటే బుధవారం నాడు ఇష్టదేవత గుడికి వెళ్లి తాంబూలంలో అరటిపండు పెట్టి సమర్పించాలట. ఇలా తరుచుగా చేస్తుంటే.. వీరు పట్టిందల్లా బంగారంలా జీవితం సాగిపోతుందట.

కర్కాటక రాశి:

ఈ రాశి వారు జీవితంలో ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలంటే తాంబూలలో దానిమ్మ పండును ఉంచి శుక్రవారం నాడు కాళికా దేవిని పూజించాలట.ఇలా చేయడం వల్ల కాళికాదేవి దయతో మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయట.

సింహ రాశి:

ఈ రాశిలో పుట్టిన వారు జీవితంలో మంచి జరగడానికి తాంబూలంలో అరటిపండును ఉంచి గురువారం నాడు ఇష్టదేవతను పూజించాలట.

కన్యారాశి:

ఈ రాశి జాతకులు తమలపాకులో మిరియాలు ఉంచి.. గురువారం ఇష్టదేవతను పూజిస్తే అంతా మంచి జరుగుతుందట.

తులారాశి:

ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తమలపాకులో లవంగాలు ఉంచి శుక్రవారం నాడు ఇష్టదేవతను పూజించాలట. ఇలా చేయడం వల్ల వీరికి జీవితంలో ఆర్థికపరమైన కష్టాలు తీరిపోతాయట.

వృశ్చిక రాశి:

ఈ రాశి జాతకులు తమలపాకులో కర్జూరం ఉంచి మంగళవారం నాడు ఇష్ట దైవాన్ని పూజించాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఈ రాశి వారికి ఉన్న సమస్త కష్టాలు తీరిపోతాయట.

ధనుస్సు:

ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తమలపాకులో కలకండా ఉంచి.. గురువారం నాడు ఇష్ట దేవతను పూజిస్తే అంతా మంచి జరుగుతుందట.

మకరరాశి:

ఈ రాశి జాతకులు జీవితంలో స్థిరత్వం కోసం తమలపాకులో బెల్లం ఉంచి శనివారం కాలికామాతను పూజిస్తే మంచిదట

కుంభ రాశి: 

ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తమ కష్టాలు తీరడానికి తమలపాకులో నెయ్యి ఉంచి శుక్రవారం నాడు కాళికామాతని పూజించినట్టైతే మంచి జరుగుతుందట.

మీన రాశి:

ఈ రాశిలో పుట్టిన జాతకులు తమలపాకులో పంచదార ఉంచి.. ఆదివారం నాడు ఇష్ట దైవాన్ని పూజిస్తే వీరికి అంతా మంచే జరుగుతుందట.

ముఖ్య గమనిక:

పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: Hindu tradition: ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా..? అసలు శాస్త్రం ఎం చెప్తుందంటే..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×