Oppo A6i+, A6v 5G| చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తన A-సిరీస్‌లో రెండు కొత్త 5G స్మార్ట్‌ఫోన్లను చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది. Oppo A6i+ 5G, Oppo A6v 5G అనే ఈ ఫోన్లు బడ్జెట్, మిడ్-రేంజ్ కొనుగోలుదారులకు ప్రత్యేక విడుదల చేసింది. ఇందులో పెద్ద డిస్‌ప్లేలు, స్మూత్ పర్‌ఫార్మెన్స్, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌పై దృష్టి పెట్టారు. రెండు ఫోన్లు డ్యుయల్ సిమ్, 5G నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తాయి.
ఒప్పో A6i+ 5G మూడు వేరియంట్లలో వచ్చింది. 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర 1,499 యూవాన్ (రూ.17,400). 12GB RAM + 256GB వేరియంట్ 1,599 యూవాన్ (రూ.18,600). టాప్ మోడల్ 12GB RAM + 512GB స్టోరేజ్‌తో 1,799 యూవాన్‌కి (రూ.20,900) లభిస్తుంది. Oppo A6v 5G సింగిల్ వేరియంట్‌లో 8GB RAM + 256GB స్టోరేజ్‌తో 1,199 యూవాన్ ధరలో ఉంది. రెండు ఫోన్లు ఫిబ్రవరి 6 నుంచి Oppo అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో అమ్మకాలకు వస్తాయి.
ఒప్పో A6i+ 5G గ్లేషియర్ వైట్, చెస్ట్‌నట్ వెల్వెట్ బ్రౌన్ కలర్లలో లభిస్తుంది. ఒప్పో A6v 5G గ్లేషియర్ బ్లూ, వైల్డర్‌నెస్ గ్రీన్, టైటానియం రాక్ పర్పుల్ షేడ్స్‌లో వస్తుంది. ఈ కలర్లు యువతను, బడ్జెట్ కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి.
రెండు ఫోన్లలో 6.75 ఇంచ్ HD+ LCD డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్ ఇస్తుంది. 240Hz టచ్ సాంప్లింగ్ రేట్ ఉండటం వల్ల రెస్పాన్సివ్‌నెస్ మెరుగుపడుతుంది. పీక్ బ్రైట్‌నెస్ 1,125 నిట్స్ వరకు ఉంది. బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
రెండు ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉంది. ఇది ఎఫిషియెంట్ పనితీరు, 5G కనెక్టివిటీ ఇస్తుంది. రోజువారీ టాస్క్‌లు, సోషల్ మీడియా, స్ట్రీమింగ్ సులభంగా జరుగుతాయి. సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ బ్యాలెన్స్‌డ్ పర్‌ఫామెన్స్ అందిస్తుంది.
రెండు ఫోన్లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. 1080p వీడియో 60fpsలో రికార్డ్ చేయవచ్చు. ఒప్పో A6i+ 5Gలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఒప్పో A6v 5Gలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
Also Read: ఆన్‌లైన్‌లో మీ ఫొటోలకు ప్రమాదం.. యాప్‌స్టోర్‌లో పెరిగిపోతున్న బట్టలు తొలగించే ఏఐ యాప్స్
ఒప్పో A6i+ 5Gలో 7,000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఒప్పో A6v 5Gలో 6,500mAh బ్యాటరీ ఉంది. రెండింటిలో 45W SuperVOOC ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. గేమింగ్, మీడియా కన్సంప్షన్‌కు ఎక్కువ సమయం ఇస్తాయి.
రెండు ఫోన్ల డిజైన్ ఒకేలా ఉంది. మందం 8.61mm మాత్రమే. Oppo A6i+ 5G బరువు సుమారు 216 గ్రాములు. ఒప్పో A6v 5G 212 గ్రాములు. మోడరన్ లుక్‌తో సాలిడ్ బిల్డ్ ఉంది.