OPPO Enco Air 5s Earbuds Launch : ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఇయర్ బర్డ్స్ ప్రాముఖ్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అచ్చం ఫోన్ లాగే ఇవి కూడా కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇయర్ బర్డ్స్ అనగానే కనిపించే ప్రధాన సమస్య చార్జింగ్. త్వరగా చార్జింగ్ అయిపోవడం, మళ్ళీ మళ్ళీ చార్జింగ్ పెట్టుకోవడం అన్నది అసలు సమస్య. కానీ తాజాగా దానికి చెక్ పెడుతూ ఒప్పో 48 గంటల బ్యాటరీ లైఫ్ ఉన్న ఇయర్ బర్డ్స్ ను కొత్తగా రిలీజ్ చేసింది. మరి వీటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం పదండి.
ఒప్పో ఎంకో ఎయిర్ 5ఎస్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్ ఫోన్స్ ను రెనో 16 సిరీస్ స్మార్ట్ ఫోన్లతో పాటు తాజాగా చైనాలో రిలీజ్ చేసింది. ఈ కొత్త ఆడియో వేరియబుల్ సెమీ ఇన్ ఇయర్ డిజైన్ తో రావడంతో పాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, స్పెషల్ ఆడియో సపోర్ట్, ఏఐ బేస్డ్ కాల్ నాయిస్ రిడక్షన్, డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇయర్ ఫోన్లో డైనమిక్ డ్రైవర్ యూనిట్ అమర్చగా, ఇవి IP55 రేటింగ్ తో ఉన్నాయి. అంతేకాదు వీటి బ్యాటరీ లైఫ్ 48 గంటల వరకు వస్తుంది. అలాగే మూడు రంగులలో అందుబాటులో ఉన్నాయి.
ఈ ఇయర్ బర్డ్స్ మూడు రంగులలో అందుబాటులోకి వచ్చాయి. ధర విషయానికి వస్తే చైనాలో ఒప్పో ఎన్కో ఎయిర్ 5s ధర స్టార్ పర్పుల్ రంగుకు సుమారు రూ.4,600, మూన్ లైట్, డార్క్ నైట్ బ్లాక్ వేరియంట్లకు సుమారు 4,200 నుండి మొదలవుతున్నాయి. ఇంట్రడ్యూసింగ్ ఆఫర్లో భాగంగా పర్పుల్ వెర్షన్ సుమారు రూ. 4,200 అందుబాటులో ఉండగా… వైట్ అండ్ బ్లాక్ ఆఫర్ ధర రూ. 3,800గా ఉంది. ప్రస్తుతం చైనాలో ఒప్పో అఫీషియల్ అవుట్లెట్ల ద్వారా ఈ ఇయర్ బర్డ్స్ ను కొనొచ్చు.
సెమీ-ఇన్-ఇయర్ డిజైన్ తో ఉన్న ఒప్పో ఎంకో ఎయిర్ 5ఎస్ ఇయర్ బర్డ్స్ లో 12mm డైనమిక్ డ్రైవర్ యూనిట్, డ్యూయల్-ఛానల్ స్టీరియో ఆడియో అవుట్‌పుట్ ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్ 20Hz నుండి 20kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పరిధితో వస్తాయి. అలాగే డీప్, లైట్, ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌ల మధ్య ఇంటెలిజెంట్ స్విచింగ్‌తో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు సపోర్ట్ చేస్తాయి. వాయిస్ కాల్స్ కోసం ఒప్పో ట్రిపుల్ మైక్ సెటప్ కూడా ఉండడం విశేషం. ఇంకా ఆడియో ఫీచర్లలో స్పెషల్ ఆడియో, AI-ఆధారిత కాల్ నాయిస్ రిడక్షన్ ఉన్నాయి.
ఎంకో ఎయిర్ 5ఎస్ డ్యూయల్-డివైస్ కనెక్టివిటీ ఉంటుంది ఇందులో. వైర్‌లెస్ పెయిరింగ్ కోసం బ్లూటూత్ 6.0ను ఉపయోగిస్తాయి. ఇవి 10 మీటర్ల వరకు వైర్‌లెస్ రేంజ్‌ను అందిస్తాయని ఒప్పో వెల్లడించింది. స్లైడింగ్ వాల్యూమ్ కంట్రోల్స్, క్రాస్-ప్లాట్‌ఫామ్ కనెక్టివిటీని అందిస్తాయి. కంపెనీ ప్రకారం, ఇవి ఏఐ ట్రాన్స్‌లేషన్, రిమోట్ కెమెరా కంట్రోల్స్ వంటి ఒప్పో ఎకోసిస్టమ్ ఫీచర్లకు కూడా సపోర్ట్ చేయడం విశేషం.
Also Read : నెట్ ఫ్లిక్స్ టాప్ సినిమాలు… ట్రెండింగ్ లో దుమ్మురేపుతున్న 2 యానిమేటెడ్ మూవీస్
ఒప్పో ఎంకో ఎయిర్ 5ఎస్ ఛార్జింగ్ కేస్‌లో 530mAh బ్యాటరీ ఉండగా, ప్రతి ఇయర్‌బడ్‌లో 40.5mAh బ్యాటరీ ఉంటుంది. ఈ కేస్ ఛార్జర్ USB టైప్-సి పోర్ట్. ఇయర్‌బడ్స్, ఛార్జింగ్ కేస్ రెండూ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి సుమారు 90 నిమిషాలు పడుతుంది. నార్మల్ సెట్టింగ్‌లలో 50% వాల్యూమ్‌తో ఉపయోగించినప్పుడు, ఈ ఇయర్‌ఫోన్‌లు ఒకే ఛార్జ్‌పై తొమ్మిది గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయి ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 48 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్‌లో ఉన్నప్పుడు, ఇయర్‌బడ్స్ బ్యాటరీ లైఫ్ 4.5 గంటల వరకు, కేస్‌తో కలిపి 25 గంటల వరకు ఉంటుంది. ప్రతి ఇయర్‌బడ్ బరువు 3.9 గ్రాములు ఉంటుంది. ఛార్జింగ్ కేస్ బరువు 30.9 గ్రాములు. మొత్తం ప్యాకేజీ బరువు 38.7 గ్రాములు ఉంటుంది. ఈ ఇయర్‌బడ్స్‌కు దుమ్ము, వాటర్ రెసిస్టెంట్ కూడా. IP55 రేటింగ్ ఉంది. బ్యాటరీ లైఫ్ కోసం వీటికి TÜV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ ఉంటుంది.