E-Paper
Advertisement

నెట్ ఫ్లిక్స్ టాప్ సినిమాలు… ట్రెండింగ్ లో దుమ్మురేపుతున్న 2 యానిమేటెడ్ మూవీస్

నెట్ ఫ్లిక్స్ టాప్ సినిమాలు… ట్రెండింగ్ లో దుమ్మురేపుతున్న 2 యానిమేటెడ్ మూవీస్
Advertisement

Netflix : ఓటీటీలలో ఎన్నో కొత్త కొత్త సినిమాలు వస్తాయి. అయితే ట్రెండింగ్ లో మాత్రం కొన్ని సినిమాలే ఉంటాయి. దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో తాజాగా భారీ వ్యూస్ తో ఆడియన్స్ మనసుకు ఆకట్టుకుంటున్న వరుస టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

1. Kartavya (2026)

సైఫ్ అలీ ఖాన్ నటించిన పవర్‌ఫుల్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘కర్తవ్య’. వివాదాస్పద బాబా ఆశ్రమంలోని చైల్డ్ అబ్యూస్ స్కామ్‌ను బయటపెట్టే క్రమంలో ఓ జర్నలిస్ట్ హత్యకు గురవుతుంది. ఆ హంతకుడిని పట్టుకోవడానికి, తన తమ్ముడిని ‘పరువు హత్య’ నుండి కాపాడుకోవడానికి మాలిక్ చేసే పోరాటమే ఈ మూవీ స్టోరీ. ఇది టాప్ 1లో ట్రెండింగ్ లో ఉంది.

Advertisement

2. Dhurandhar 2

బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురంధర్’ సీక్వెల్ ‘ధురంధర్ 2’. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అండర్‌ వరల్డ్, రాజకీయాలు, గ్యాంగ్‌స్టర్ల మధ్య సాగే మైండ్ గేమ్స్, పగ-ప్రతీకారాల చుట్టూ తిరిగే ఈ ఇంటెన్స్ క్రైమ్ డ్రామా టాప్ 2 లో ట్రెండ్ అవుతోంది. అలాగే మొదటి పార్ట్ కూడా నెట్ ఫ్లిక్స్ లోనే టాప్ 8లో అందుబాటులో ఉంది.

Advertisement

3. GOAT Animated Movie (2026)

నెట్‌ఫ్లిక్స్‌లో భారీ వ్యూయర్‌షిప్ సాధించిన సరికొత్త స్పోర్ట్స్-యాక్షన్ యానిమేషన్ మూవీ ‘గోట్’. ఓ అనాథ కుర్రాడు ఫుట్‌బాల్ ఆటపై ఉన్న పిచ్చితో, అన్ని అడ్డంకులను దాటుకుని ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్‌గా ఎలా ఎదిగాడనేది ఇన్స్పిరేషనల్ జర్నీ ఈ మూవీ.

4. Blue Beetle (2023)

డిసి (DC) సూపర్ హీరో చిత్రం ‘బ్లూ బీటిల్’. జైమ్ రేయస్ అనే మెక్సికన్ యువకుడికి అనుకోకుండా ఒక పురాతన బయో-టెక్నాలజీ స్కారబ్ దొరకడం, అతనికి ఒక శక్తివంతమైన ఆర్మర్ సూట్‌ ను ఇవ్వడంతో కథ మలుపు తిరుగుతుంది. అతను తన కుటుంబాన్ని ప్రపంచాన్ని కాపాడే సూపర్ హీరోగా ఎలా ఎదిగాడు అన్నది కథ.

5. Swapped

హార్ట్ టచింగ్ ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘స్వాప్డ్’. మ్యాజికల్ మొగ్గ వల్ల ఓ కొండపై జంతువులు రూపం మార్చుకునే శక్తిని పొందుతాయి. అలా ఓ పక్షి, మరో జంతువు ఒకదాని రూపంలోకి మరోటి మారాక ఏం జరిగింది ? తమ నివాసాన్ని ఎలా కాపాడుకున్నాయి ? అనేది కథ.

6. Ladies First

థియా షారోక్ దర్శకత్వం వహించిన అమెరికన్ కామెడీ డ్రామా ‘లేడీస్ ఫస్ట్’. ఎలియోనోర్ పౌరియాట్ ఫ్రెంచ్ మూవీ ‘ఐ యామ్ నాట్ యాన్ ఈజీ మ్యాన్’ నుండి ప్రేరణ పొందిన ఈ సినిమాలో సాచా బారన్ కోహెన్, రోసమండ్ పైక్, చార్లెస్ డాన్స్, ఎమిలీ మోర్టిమర్, టామ్ డేవిస్, రిచర్డ్ ఇ. గ్రాంట్, ఫియోనా షా ప్రధాన పాత్రల్లో నటించారు. మే 22న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ మూవీ టాప్ 6లో ట్రెండ్ అవుతోంది.

Also Read : ఆకాశం నుంచి ఊడిపడే డబ్బుల కట్టలు… క్రేజీ క్లైమాక్స్

7. Made in Korea

ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన మూవీ ఇది. ఇందులో కొరియా అంటే పిచ్చి ఉన్న అమ్మాయిగా నటించింది ప్రియాంక. అయితే ప్రియుడు నమ్మించి మోసం చేయడంతో, కొరియాకు వెళ్ళిన ఆ అమ్మాయి అక్కడ ఎలా సర్వైవ్ అయ్యింది అన్నది స్టోరీ.

9. Bharatanatyam Mohiniyattam 2

‘భరతనాట్యం – మోహినీయట్టం 2’ మూవీ మలయాళం క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. అమాయకపు ఫ్యామిలీ అంతా కలిసి ఓ మర్డర్ కేసులో ఎలా చిక్కుకున్నారు ? దాని నుంచి ఎలా బయట పడ్డారు ? అన్నది కథ.

10. Youth

ఇక చివరగా టాప్ 10లో ‘యూత్’ అనే సినిమా ఉంది. ఈ కాలపు కాలేజీ విద్యార్థుల జీవితాలు, టెన్షన్లు, ప్రేమలు, సోషల్ మీడియా వల్ల వారు ఎదుర్కొంటున్న సవాళ్ల చుట్టూ తిరిగే ఒక యూత్‌ఫుల్ డ్రామా ఇది.

Tags

Related News

వీళ్ళకు చావులేదు… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ సీక్వెల్

సముద్రం ఎడారిగా మారితే ? మనిషి మాంసం కోసం అగాధపు జీవుల అరాచకం… థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్

ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

1300 కోట్ల థ్రిల్లర్ తెలుగులో… కేక పుట్టిస్తున్న మైండ్ బ్లాక్ క్రైమ్ కామెడీ

2600 కోట్ల కలెక్షన్లు… 7.9 IMDb రేటింగ్… తెలుగులో అందుబాటులో ఉన్న ఆల్ టైమ్ క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఫ్రెండ్స్‌తో చూస్తే పొట్టచేక్కలవ్వాల్సిందే… పిచ్చి పిచ్చి గొడవలతో నవ్వించే కామెడీ డ్రామా

ఎఫైర్ ను అడ్డం పెట్టుకుని ఇదేం పాడుపని ? ప్రతీ నిమిషం నెయిల్ బైటింగ్ సస్పెన్స్

Big Stories

Advertisement
×