E-Paper
Advertisement

Oppo Find N6: ఒప్పో కొత్త ఫొల్డెబుల్ ఫోన్ లాంచ్.. 6000mAh బ్యాటరీ, కొత్త ఫోల్డింగ్ టెక్నాలజీ, ధర ఎంతంటే?

Oppo Find N6: ఒప్పో కొత్త ఫొల్డెబుల్ ఫోన్ లాంచ్.. 6000mAh బ్యాటరీ, కొత్త ఫోల్డింగ్ టెక్నాలజీ, ధర ఎంతంటే?

Oppo Find N6| చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఒప్పో ఫైండ్ N6 (Oppo Find N6) లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఒప్పో మునుపటి ఫొల్డెబుల్ మోడల్ కంటే చాలా మెరుగైన ఫీచర్లతో వచ్చింది. ఇందులో క్రీజ్ (మడత గీత) కనిపించకుండా చేసే కొత్త టెక్నాలజీ, మెరుగైన హింజ్ డిజైన్ ఉపయోగించారు. ఫైండ్ N6 ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ColorOS 16తో వస్తుంది. దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా ఉన్నాయి.

ధర, అందుబాటు వివరాలు

ఒప్పో ఫైండ్ N6 బేస్ వేరియంట్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర చైనా యువాన్ 9,999 (భారత కరెన్సీలో దాదాపు రూ.1,26,500). 16GB ర్యామ్ + 512GB వేరియంట్ 10,999 యువాన్లు (రూ.147600). 16GB ర్యామ్ + 1TB స్టోరేజ్ వేరియంట్ 11,999 యువాన్లు (రూ.161000). ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్స్.. బ్లాసమ్ ఆరెంజ్, స్టెల్లార్ టైటానియం కలర్లలో దొరుకుతుంది. మూడో కలర్ వేరియంట్ పెర్ల్ బ్లాక్ కలర్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రీ-ఆర్డర్లు మొదలయ్యాయి. మార్చి 20 నుంచి అధికారిక విక్రయాలు ప్రారంభమవుతాయి. ఎర్లీ బయ్యర్లకు ఫ్రీ యాక్సెసరీస్ ఇస్తారు.

డిస్‌ప్లే, డిజైన్ ఫీచర్లు

కవర్ డిస్‌ప్లే 6.62 ఇంచ్, ఇన్నర్ ఫోల్డబుల్ స్క్రీన్ 8.12 ఇంచ్ ఉంది. రెండూ LTPO ప్యానెల్స్‌తో వస్తాయి. 1Hz నుంచి 120Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. Dolby Vision సపోర్ట్ ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 3600 నిట్స్ వరకు ఉంటుంది. డిజైన్ ప్రీమియం‌గా, స్మూత్ ఫోల్డింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ కెపాసిటీ

6000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఎక్కువ కాలం బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. 80W సూపర్‌వూక్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. త్వరగా ఛార్జ్ అవుతుంది, సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు.

పర్‌ఫామెన్స్, హార్డ్‌వేర్

ఈ కొత్త ఫోల్డింగ్ ఫోన్ అడ్వాన్స్ ప్రాసెసర్ చిప్‌సెట్‌తో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ఎలైట్ వస్తుంది. హెవీ టాస్క్‌లకు బలమైన పర్‌ఫామెన్స్ ఇస్తుంది. LPDDR5X ర్యామ్ (12GB/16GB), UFS 4.1 స్టోరేజ్ (256GB/512GB/1TB) ఆప్షన్లు ఉన్నాయి. ఫాస్ట్ స్పీడ్, స్మూత్ మల్టీటాస్కింగ్ దొరుకుతుంది.

కొత్త హింజ్ టెక్నాలజీ డ్యూరబిలిటీ

టైటానియం ఫ్లెక్షన్ హింజ్ డిజైన్ ఉపయోగించారు. ఇది మునుపటి కంటే విశాలంగా, మెరుగైన డ్యూరబిలిటీ ఇస్తుంది. క్రీజ్ దాదాపు కనిపించదు. జీరో-ఫీల్ క్రీజ్ టెక్నాలజీ స్క్రీన్ స్మూత్‌గా ఉంచుతుంది. TUV రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ ఉంది. అధికారికంగా 6 లక్షల సార్లు ఫోల్డ్స్ సపోర్ట్ చేస్తుంది. టెస్టింగ్‌లో 10 లక్షల ఫోల్డ్స్ వరకు తట్టుకుంది. IP56, IP58, IP59 రేటింగ్స్ ఉన్నాయి. దుమ్ము, నీరు నుంచి ఫోన్‌లో ప్రొటెక్షన్ ఫీచర్స్ ఉన్నాయి.

Also Read: మీ ల్యాప్‌టాప్‌లో వైఫై కనెక్షన్ కావడం లేదా? ఈజీగా ఇలా సెట్టింగ్స్ చేయండి

కెమెరా ఫీచర్లు

కొత్త ఫోల్డింగ్ ఫోన్‌లో 200MP ప్రైమరీ కెమెరా ఉంది. అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌లు ఉన్నాయి. ట్రూ కలర్ సెన్సార్ వల్ల కలర్ అక్యురసీ మెరుగుపడుతుంది. వైట్ బ్యాలెన్స్, నేచురల్ టోన్స్ బాగుంటాయి. రెండు డిస్‌ప్లేలపై 20MP కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ అద్భుతంగా ఉంటాయి.

కొత్త ఫోల్డబుల్ టెక్నాలజీ‌తో Oppo Find N6 మరింత మెరుగుపడింది. మెరుగైన డ్యూరబిలిటీ, పవర్‌ఫుల్ పనితీరు, అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం ఫోల్డబుల్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

ముఖ్య గమనిక: ఈ కథనంలో పేర్కొన్న ఫోల్డెబుల్ ఫోన్ ఫీచర్లు, ధరలు.. ఆయా బ్రాండ్ కంపెనీల ప్రకటించే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు కొనాలని సూచన. పైన చెప్పిన ధరలు మీరు కొనుగోలు చేసే సమయానికి మారిపోయి ఉండవచ్చు. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు.

Related News

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

Big Stories

×