E-Paper
Advertisement

Realme C85 5G Smartphone: భారత మార్కెట్లోకి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ లైఫ్, AI కెమెరాతో పిచ్చ క్లారిటీ!

Realme C85 5G Smartphone: భారత మార్కెట్లోకి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ లైఫ్, AI కెమెరాతో పిచ్చ క్లారిటీ!
Advertisement

Realme C85 5G Smartphone: భారీ బ్యాటరీ లైఫ్‌తో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్న వాళ్లకి ఇదే సరైన సమయం. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌‌మీ తమ యూజర్ల కోసం ‘Realme C85 5G’ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఫోన్ 6.8-అంగుళాల LCD స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ అలాగే 7,000mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రియల్‌మీ C85 5G ఫోన్ పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అందుబాటులోకి ఎప్పుడు?

కంపెనీ ఈ Realme C85 5G హ్యాండ్ సెట్ 4జీబీ RAM+ 128జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ‌తో బేస్ వేరియంట్ ధర రూ.14,999గా పేర్కొంది. అలాగే, 6జీబీ RAM+ 128జీబీ స్టోరేజ్ కలిగిన టాప్-ఆఫ్-ది-లైన్ ఆప్షన్ ధర రూ.16,499గా నిర్ణయించింది. ఈ ఫోన్ ప్యారట్ పర్పుల్, పీకాక్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. రియల్‌మీ C85 5G హ్యాండ్ సెట్ డిసెంబరు 1వ తేదీ నుంచి రియల్‌మీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌లో విక్రయానికి రానుంది.

Advertisement

Read Also: బడ్జెట్ ధరలో కొత్తఫోన్ కావాలా నాయనా.. ఈ 5జీ ఫోన్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు తెలిస్తే మతిపోద్ది!

ఫీచర్ల వివరాలు ఇలా..

ఈ రియల్‌మీ పరికరం HD+ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. 180Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ ర్యామ్ Mali-G57 MC2 GPUతో జత చేయబడిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. Realme C85 5G ఫోన్‌లో 6జీబీ వరకు RAM, 12జీబీ వరకు డైనమిక్ RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ:

Advertisement

ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX852 వెనుక కెమెరా యూనిట్ ఉంది. ఇది 30 fps వద్ద 1080p రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేయగలదు. కొత్త హ్యాండ్‌సెట్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను సైతం కలిగి ఉంది. యూజర్లు 30 fps వద్ద 1080p వీడియోలను రికార్డ్ చేయవచ్చు. అలాగే ఈ పరికరం ఆండ్రాయిడ్ 15 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌‌ను కలిగి ఉంది.

22 గంటల వీడియో ప్లేబ్యాక్:

ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఈ పరికరం 45W SuperVOOC వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఒకే ఛార్జ్‌పై 22 గంటల వీడియో ప్లేబ్యాక్, 50 గంటల కాలింగ్, 145 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందించగలదని సంస్థ తెలిపింది.

కనెక్టివిటీ ఫీచర్లు:

ఈ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఎంపికలలో.. 5జీ, 4జీ LTE, USB టైప్-C పోర్ట్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, బీడౌ, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, QZSS వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఆన్‌బోర్డ్ సెన్సార్ల జాబితాలో ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఇ-కంపాస్, యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్ ఉన్నాయి. ఇక డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇకపోతే ఈ రియల్‌మీ C85 5G ఫోన్ 166.07×77.93×8.38mm కొలతలు, 215 గ్రాముల బరువును కలిగి ఉంది.

Read Also: వారెవ్వా అనేలా హానర్ కొత్తఫోన్.. 200MP కెమెరా, 7200 mAh బ్యాటరీతో లాంచ్!

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×