E-Paper
Advertisement

Dil Raju: పవన్ కళ్యాణ్ తో ప్రాజెక్ట్ కన్ఫాం, 2017 మళ్లీ రిపీట్ అవుతుంది..

Dil Raju: పవన్ కళ్యాణ్ తో ప్రాజెక్ట్ కన్ఫాం, 2017 మళ్లీ రిపీట్ అవుతుంది..
Advertisement

Dil Raju-Pawan Kalyan Movie: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. రీసెంట్ టైమ్స్ లో దిల్ రాజు యాక్టివ్ గా సినిమాలు చేయడం లేదు. ఒకప్పుడు దిల్ రాజు బ్యానర్ నుంచి బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ నిర్మితమవుతుండేవి. అసలు దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది పక్కా హిట్ అని ఇటూ ప్రేక్షకుల్లో, అటూ ఇండస్ట్రీలో గట్టి నమ్మకం. కానీ, ఈ మధ్య ఆ అంచనాలు తారుమారు అవుతున్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వస్తున్న సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద వరుసగా డిజాస్టర్ అవుతున్నారు.

వరుస ప్లాప్స్

Advertisement

గేమ్ ఛేంజర్ తో ఈ బ్యానర్ భారీ నష్టాలు చూసింది. ఆ తర్వాత వచ్చిన నితిన్ తమ్ముడు కూడా దారుణంగా ఫెయిల్ అయ్యింది. బలగం తర్వాత అంత పెద్ద హిట్ పడి చాలా రోజులు అవుతుంది. బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ నుంచి ఈ ఏడాది వచ్చిన సంక్రాంతి వస్తున్నాం మూవీ దిల్ రాజుని, ఆ బ్యానర్ ని కాస్తా సేవ్ చేసింది. వీటి తర్వాత మరో సినిమా చేసేందుకు దిల్ రాజు పెద్ద గ్యాపే తీసుకున్నాడు. అలా ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సినిమా చేయకుండ ఖాళీ ఉండటం. ఎట్టకేలకు కొన్ని నెలల తర్వాత విజయ్ దేవరకొండతో రౌడీ జనార్థన్ మూవీని లాంచ్ చేసి వెంటనే షూటింగ్ ప్రారంభించారు. ఈ ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటుంది.

పవన్ కళ్యాణ్ తో ప్రాజెక్టు కన్ఫర్మ్

ఇదిలా ఉంటే ఇటీవల గోవాలో జరిగిన ఓ మూవీ ఈవెంట్ లో దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ చాలా విషయాల పై క్లారిటీ ఇచ్చేశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ కలిసి సినిమాలో నిర్మిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో గోవా మూవీ ఫెస్టివల్లో శిరీష్ మాట్లాడుతూ.. రావడం లేట్ అవ్వోచ్చేమో గాని.. రావడం మాత్రం పక్క అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ డైలాగ్ అనే విషయం తెలిసిందే. ఈ డైలాగ్ చెప్పిన అనంతరం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే త్వరలోనే వస్తున్నామంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా ఉందని శిరీష్ స్పష్టం చేశారు. మరోవైపు రౌడీ జనార్ధన్ సినిమా జరుగుతుంది. అలానే ఎల్లమ్మ సినిమా కూడా త్వరలో పట్టాలెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కి మళ్లీ 2017 రిపీట్ అవుతుంది అని క్లారిటీ ఇచ్చాడు శిరీష్.

Advertisement

Also Read: Manasantha Nuvve Re Release: మనసంతా నువ్వే రీ రిలీజ్.. డైరెక్టర్ వీఎన్ ఆదిత్య ఏమన్నారంటే..

కలిసి వచ్చిన 2017

2017 లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన అన్ని సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. సంక్రాంతి కానుకగా శతమానం భవతి సినిమా అప్పట్లో వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు పోటీగా వచ్చిన ఆ సినిమా ఒక మార్క్ క్రియేట్ చేసింది. ఆ తరువాత నాని హీరోగా వచ్చిన నేను లోకల్ సినిమా కూడా అప్పట్లో బాగా వర్కౌట్ అయింది. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా కూడా అప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. 2017 అనేది ఆ బ్యానర్ కు విపరీతంగా కలిసి వచ్చింది. అందుకే శిరీష్ మాట్లాడుతూ2017 మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్పారు.

Related News

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

Big Stories

Advertisement
×