E-Paper
Advertisement

ఒప్పో ఫైండ్ X10 సిరీస్ కెమెరా డిజైన్‌లో ఊహించని మార్పులు.. పూర్తి వివరాలు మీ కోసం!

ఒప్పో ఫైండ్ X10 సిరీస్ కెమెరా డిజైన్‌లో ఊహించని మార్పులు.. పూర్తి వివరాలు మీ కోసం!
Advertisement

Oppo Find X10 Series: ఒప్పో నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘ఫైండ్ X10’ సిరీస్ గురించి అప్పుడే ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. మునుపటి ఫైండ్ X9 సిరీస్‌కు కొనసాగింపుగా.. ఈ కొత్త మోడల్స్ మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ సిరీస్‌లో ఫైండ్ X10, X10 ప్రో, X10 ప్రో మాక్స్ మోడల్స్ ఉండే అవకాశం ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఒప్పో ఈసారి డిజైన్ పరంగా ఒక పెద్ద ప్రయోగమే చేస్తోంది.

కొత్త లుక్‌లో కెమెరా మాడ్యూల్..

ఇప్పటివరకు వచ్చిన ఒప్పో ఫోన్లలో ఎక్కువగా గుండ్రటి (Circular) కెమెరా డిజైన్ చూశాం. కానీ ఫైండ్ X10 సిరీస్‌లో సమాంతరంగా (Horizontal) ఉండే వైడ్ కెమెరా మాడ్యూల్‌ను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎడమ వైపు మూడు ప్రధాన కెమెరా సెన్సార్లు, కుడి వైపు LED ఫ్లాష్‌తో పాటు రంగుల నాణ్యతను పెంచే మల్టీస్పెక్ట్రల్ సెన్సార్ ఉండనున్నాయి. ఇది ఫోన్‌కు సరికొత్త ప్రొఫెషనల్ లుక్‌ను అందిస్తుంది.

Advertisement

Also Read: మార్కెట్‌లో స్టాక్ ఖాళీ.. ఒక్కసారిగా రూ.12,000 వరకు పెరిగిన iPhone 17 సిరీస్ ధరలు!

ప్రత్యేక ఏఐ బటన్..

ఈ సిరీస్ వైట్, ఆరెంజ్, సయాన్ వంటి ఆకర్షణీయమైన కొత్త రంగులలో లభించనుంది. దీంతోపాటు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను వేగంగా ఉపయోగించుకోవడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన కస్టమైజబుల్ ‘AI బటన్’ను కూడా ఇస్తున్నట్లు సమాచారం. డిస్‌ప్లే బెజెల్స్ చాలా సన్నగా ఉండి.. అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయని సమాచారం.

200 మెగాపిక్సల్ కెమెరా..

Advertisement

ఇక పనితీరు విషయంలోనూ ఈ ఫోన్లు నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. ఇందులో అత్యంత శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ఏకంగా 200 మెగాపిక్సల్ HPC కెమెరా సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ ప్రారంభంలో ఈ ఒప్పో ఫైండ్ X10 సిరీస్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Also Read: 10 నిమిషాల ఛార్జ్‌తో 12 గంటలు బ్యాకప్.. 3D ఆడియో, నాయిస్ క్యాన్సిలేషన్‌తో సరికొత్త బోట్ హెడ్‌ఫోన్స్ లాంచ్!

Related News

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

Big Stories

Advertisement
×