E-Paper
Advertisement

మండుతున్న పెట్రో ధరలు.. ఈ 5 బైక్‌ లు మీ ఖర్చు తగ్గించేస్తాయి!

మండుతున్న పెట్రో ధరలు.. ఈ 5 బైక్‌ లు మీ ఖర్చు తగ్గించేస్తాయి!
Advertisement

Top Fuel Saving Bikes 2026:  దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా ఇప్పుడు చాలామంది ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రోజూ ఆఫీస్‌, కాలేజ్‌, ఇతర రోజువారీ పనుల కోసం బైక్‌ను ఉపయోగించే వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లే కమ్యూటర్ బైక్‌లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. రూ. 1 లక్ష లోపు ధరలో మంచి మైలేజీతో పాటు తక్కువ మెయింటెనెన్స్‌ ఖర్చు ఉన్న టాప్  బైకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ టీవీఎస్ స్పోర్ట్

టీవీఎస్ స్పోర్ట్ బైక్ ఎక్స్‌ షోరూమ్ ధర సుమారు రూ.57 వేల నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ ప్రకారం.. ఇది లీటర్ పెట్రోల్‌ కు దాదాపు 80 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ఈ సెగ్మెంట్‌ లో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్‌ లలో టాప్ లో నిలిచింది. 109.7cc ఇంజన్‌తో వచ్చే ఈ బైక్ సిటీ, రూరల్  ప్రయాణాలకు బాగా ఉపయోగపడుతుంది. తక్కువ బరువు ఉండటం వల్ల ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది.

⦿ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

Advertisement

ఇది చాలా కాలంగా గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణాల్లో కూడా మంచి ఆదరణ పొందుతోంది. దీని ధర సుమారు రూ.56 వేల నుంచి ఉంటుంది. లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. 97.2cc ఇంజన్‌ తో వచ్చే ఈ బైక్‌లో i3S టెక్నాలజీ ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్ ఆగినప్పుడు ఇంజన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవడం ద్వారా ఇంధనం ఆదా అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ బైక్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

⦿ హోండా షైన్ 100

హోండా షైన్ 100 కూడా ప్రస్తుతం మార్కెట్లో మంచి ఆదరణ దక్కించుకుంది. దీని ధర సుమారు రూ.65 వేల వరకు ఉంటుంది. లీటరుకు 65 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. 98.98cc ఇంజ న్‌తో వచ్చే ఈ బైక్ సాధారణ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది.

⦿ బజాజ్ ప్లాటినా 100

Advertisement

దీని ధర సుమారు రూ.68 వేల వరకు ఉంటుంది. కంపెనీ ప్రకారం లీటర్ కు 70 కిలో మీటర్ల  వరకు మైలేజీ ఇస్తుంది. 102cc ఇంజన్‌ తో వచ్చే ఈ బైక్‌ లో చక్కటి సీటు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి మంచి కంఫర్ట్ ఇస్తుంది.

⦿ హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0

హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌ టెక్ 2.0 ధర సుమారు రూ.83 వేల వరకు ఉంటుంది. లీటరుకు 73 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో డిజిటల్ మీటర్‌, బ్లూ టూత్ కనెక్టివిటీ, LED లైట్లు లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. మైలేజీతో పాటు కొంచెం స్టైలిష్, టెక్నాలజీ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌ గా చెప్పుకోవచ్చు.

Read Also: టాటా To మహీంద్రా.. భారత మార్కెట్‌లో దుమ్మురేపుతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×