OPPO Reno 15 Pro Mini: చైనా బ్రాండ్ OPPO తన ‘ఒప్పో రెనో 15 ప్రో మినీ’ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో చైనాలో ఆవిష్కరించబోతోంది. టెక్ నిపుణుల అంచనా ప్రకారం.. ఈ ఫోన్ ఈ నెలాఖరు లేదా 2026 జనవరిలో విడుదల కావచ్చు. దేశీయ వేరియంట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్, గ్లోబల్ వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ఉంటాయి. ఇక ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ 200MP ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ని అందిస్తుంది. దీంతో యూజర్ల అధిక రిజల్యూషన్ ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేసుకోవచ్చు.
ఈ ఒప్పో రెనో 15 ప్రో మినీ స్మార్ట్‌ఫోన్‌ను 7.99 మిల్లీ మీటరు సన్నని ప్రొఫైల్, దాదాపు 187 గ్రాముల బరువుతో కాంపాక్ట్ ఫోన్‌గా రూపొందించినట్లు సమాచారం. ఈ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్, సన్నని బెజెల్స్‌తో కూడిన 6.32-అంగుళాల అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుందని అంచనా. ఇది 1.5K రిజల్యూషన్, దుమ్ము, నీటి నిరోధకత కోసం IP66, IP67, IP69 రేటింగ్‌లను కలిగి ఉండొచ్చు. అలానే గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో ప్రీమియం డిజైన్ కూడా ఉంటుంది.
Also Read: 10,000mAh బ్యాటరీ, టాప్‌క్లాస్ కెమెరా ఫీచర్స్.. ఎక్కడా తగ్గేదేలే అంటున్న రెడ్‌మీ K90 అల్ట్రా!
ఈ హ్యాండ్ సెట్ వెనుక భాగంలో హై క్వాలిటీ ఫొటోలను క్యాప్చర్ చేయడానికి మంచి కెమెరా సెటప్ ఉంటుంది. దీనిలో 200MP మెయిన్ సెన్సార్, అలాగే 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3.5× ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ ఉండొచ్చని అంచనా.
ఇకపోతే.. ఒప్పో రెనో 15 ప్రో మినీ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 4K వీడియో రికార్డింగ్ చేయగల 50MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీంతోపాటు ఈ ఫోన్ 6300 mAh నుండి 6500 mAh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుందని లీక్స్ సూచిస్తున్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ చైనీస్ వేరియంట్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్, గ్లోబల్ వేరియంట్ కోసం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా. అలాగే ఈ ఫోన్ 128GB/ 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు 8GB లేదా 12GB RAM ఆప్షన్‌లతో రావొచ్చు. ఇకపోతే ఈ ఒప్పో రెనో 15 ప్రో మినీ కలర్ ఓఎస్ 16 ఆధారిత ఆండ్రాయిడ్ 16తో లాంచ్ అవుతుందని సమాచారం.
Also Read: షాకిచ్చిన మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ప్రైస్ డ్రాప్.. ఇప్పుడు కొనకపోతే తర్వాత మీరే ఫీలవుతారు!