E-Paper
Advertisement

Redmi K90 Ultra: 10,000mAh బ్యాటరీ, టాప్‌క్లాస్ కెమెరా ఫీచర్స్.. ఎక్కడా తగ్గేదేలే అంటున్న రెడ్‌మీ K90 అల్ట్రా!

Redmi K90 Ultra: 10,000mAh బ్యాటరీ, టాప్‌క్లాస్ కెమెరా ఫీచర్స్.. ఎక్కడా తగ్గేదేలే అంటున్న రెడ్‌మీ K90 అల్ట్రా!
Advertisement

Redmi K90 Ultra: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రెడ్‌మీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి ఫీచర్లు, సరసమైన ధరలతో యూజర్ల నమ్మకాన్ని సంపాదించుకున్న ఈ బ్రాండ్.. ఇప్పుడు మరోసారి హై- ఎక్స్‌పెక్టేషన్లతో కొత్త ఫోన్‌ను రంగంలోకి దించడానికి సన్నాహాలు చేస్తోంది. ‘Redmi K90 Ultra’ పేరు మీద త్వరలోనే విడుదల కానున్న ఈ స్మార్ట్‌‌ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

మునుపటి కంటే భారీ అప్‌గ్రేడ్:

తాజా లీక్స్ ప్రకారం.. ఫోన్‌ మునుపటి K80 Ultraతో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ భారీ అప్‌గ్రేడ్స్‌తో రానుంది. ముఖ్యంగా కెమెరా పనితీరు, బ్యాటరీ సామర్థ్యం విషయంలో Redme ఈసారి మరో స్థాయికి వెళ్లినట్టే కనిపిస్తోంది. పవర్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని.. ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Also Read: హెచ్ఎండి టచ్ 4జీ బ్యాక్ అగైన్.. ఆలస్యం చేస్తే మంచి అవకాశాన్ని కోల్పోతారు బాసూ!

బ్యాటరీ విషయంలో నో కాంప్రమైజ్:

ఈ Redmi K90 Ultraలో ఉండే 10,000mAh బ్యాటరీ.. ఇప్పటివరకు వచ్చిన K90 సిరీస్ ఫోన్ల కంటే చాలా పెద్ద అప్‌గ్రేడ్‌గా చెప్పొచ్చు. అక్టోబర్‌లో లాంచ్ అయిన K90, K90 Pro Max మోడల్స్‌తో పోలిస్తే ఇది మరింత శక్తివంతంగా ఉండనుందని సమాచారం.

ఎందులోనూ తగ్గేదే లే:

Advertisement

మరో విశేషం ఏమిటంటే.. ఈ ఫోన్ 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్ధతు ఇస్తుంది. అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్ విషయంలో కూడా రెడ్‌మీ తగ్గేదేలేదన్నట్టే ఉంది. K90 Pro Maxలో ఉన్న 50W వైర్‌లెస్ ఛార్జింగ్ కంటే.. ఇంకా మెరుగైన సామర్థ్యంతో, పూర్తిస్థాయి వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నట్లు లీక్స్ చెబుతున్నాయి.

సన్నని ఫ్రేమ్‌లో భారీ బ్యాటరీ:

రెడ్‌మీ K90 అల్ట్రాలో ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా.. ఫోన్ డిజైన్ విషయంలో రెడ్‌మీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం 8.5mm మందంతో సన్నని ఫ్రేమ్‌లోనే ఈ భారీ బ్యాటరీని అమర్చడం నిజంగా ఆసక్తికర విషయం. దీని వల్ల ఫోన్ చేతిలో బరువుగా లేదా పెద్దగా అనిపించదన్నది నిపుణుల అంచనా.

ఆకర్షణీయమైన డిజైన్:

ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే, 6.81 నుంచి 6.89 అంగుళాల LTPS OLED స్క్రీన్‌తో రెడ్‌మీ K90 అల్ట్రా రానుందని సమాచారం. 1.5K రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గుండ్రని అంచులు, మెటల్ మిడిల్ ఫ్రేమ్ వంటి ప్రీమియం డిజైన్ ఎలిమెంట్స్ ఈ ఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చనున్నాయి. మొత్తానికి, బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్, డిజైన్.. ఆల్ ఇన్ వన్ పవర్ ప్యాక్‌గా రెడ్‌మీ K90 అల్ట్రా మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. వివో V50e 5G ఫోన్ అద్భుతమైన ధరలో, అస్సలు మిస్ అవ్వకండి!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×