Oppo Reno 15C vs Redmi Note 15 Pro+ vs OnePlus Nord 5 Smartphone Comparison| రూ.40,000లోపు ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మూడు బలమైన ఆప్షన్లు ఉన్నాయి. ఒప్పో రెనో 15C, రెడ్‌మి నోట్ 15 ప్రో+, వన్‌ప్లస్ నార్డ్ 5. ఈ మూడు ఫోన్లు పర్‌ఫామెన్స్, కెమెరా, బ్యాటరీ, సాఫ్ట్‌వేర్ పరంగా వేర్వేరు స్పెసిఫికేషన్స్‌తో విడుదలయ్యాయి. ధర, డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వివరాలు పోల్చి మీకు అవసరాలను తగిన ఫోన్ ఏదో నిర్ణయించుకోండి.
ఒప్పో రెనో 15C 8GB ర్యామ్ + 256GB ధర రూ.34,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.37,999కి లభిస్తోంది.
రెడ్‌మి 15 ప్రో+ 5G 8GB + 128GB వేరియంట్ ధర రూ.37,999.
వన్‌ప్లస్ నార్డ్ 5 8GB + 256GB వేరియంట్ ధర రూ.33,999, 12GB + 256GB ధర రూ.36,999.
వన్‌ప్లస్ హై వేరియంట్ కూడా తక్కువ ధరలో ఆఫర్ చేస్తోంది.
ఒప్పో రెనో 15C 5Gలో 6.57 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది.
రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5Gలో పెద్ద 6.83 ఇంచ్ ఆమోలెడ్ డిస్‌ప్లే , 1.5K రిజల్యూషన్, 120Hz రేట్, 3200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 5లో 6.83 ఇంచ్ AMOLED, ఫుల్ HD+, 144Hz రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. రెడ్‌మి బయట ఉపయోగానికి, వన్‌ప్లస్ స్మూత్ గేమింగ్‌కు బెస్ట్.
ఒప్పో రెనో 15C 5G ఆండ్రాయిడ్ 16తో వస్తుంది, ColorOS 16 ఇంటర్‌ఫేస్ ఉంటుంది. రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5G ఆండ్రాయిడ్ 15తో HyperOS 2తో రన్ అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ 5 ఆండ్రాయిడ్ 15తో OxygenOS 15తో వస్తుంది. వన్‌ప్లస్ సాఫ్ట్‌వేర్ క్లీన్‌గా, స్మూత్‌గా ఉంటుంది.
ఒప్పో రెనో 15C 5Gలో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ఉంది. రోజువారీ పనులకు సరిపోతుంది.
రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5Gలో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం బెటర్ ఆప్షన్.
వన్‌ప్లస్ నార్డ్ 5లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ఉంది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ లెవల్ స్పీడ్, ఎఫిషియెన్సీ ఇస్తుంది. పర్‌ఫామెన్స్‌లో వన్‌ప్లస్ ముందుంది.
ఒప్పో రెనో 15C 5Gలో 50MP ప్రైమరీ + 8MP అల్ట్రా-వైడ్ + 2MP మాక్రో ఉన్నాయి. రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5Gలో 200MP ప్రైమరీ (OIS) + 8MP అల్ట్రా-వైడ్ ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ 5లో 50MP ప్రైమరీ (OIS) + 8MP అల్ట్రా-వైడ్ ఉన్నాయి. కెమెరా పరంగా రెడ్‌మి బెటర్.
ఒప్పో రెనో 15C 5G, వన్‌ప్లస్ నార్డ్ 5 రెండింటిలోనూ 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ బాగుంటాయి.
రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5Gలో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు ఈ ఫోన్ సరిపోతుంది.
ఒప్పో రెనో 15C 5Gలో 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5Gలో 6500mAh బ్యాటరీ, 100W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 5లో 6800mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ ఉంది. బ్యాటరీ లైఫ్‌లో ఒప్పో ముందుంది, ఛార్జింగ్ స్పీడ్‌లో రెడ్‌మి టాప్‌లో ఉంది.
Also Read: మీ మనసులో మాటను పసిగట్టే ఐఫోన్ .. చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖకవళికలతోనే
ఒప్పో రెనో 15C 5Gలో Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB Type-C ఉన్నాయి. రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5Gలో NFC, IR బ్లాస్టర్ అదనంగా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 5లో Wi-Fi 6, NFC, బ్లూటూత్ 5.4, GPS ఉన్నాయి.
పర్‌ఫామెన్స్, స్పీడ్, గేమింగ్ కావాలంటే వన్‌ప్లస్ నార్డ్ 5 బెస్ట్. కెమెరా క్వాలిటీ, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే రెడ్‌మి నోట్ 15 ప్రో+ 5G మంచిది. భారీ బ్యాటరీ, లేటెస్ట్ ఆండ్రాయిడ్ కావాలంటే ఒప్పో రెనో 15C 5G తీసుకోండి. మీ అవసరాల ప్రకారం ఎంచుకోండి.