E-Paper
Advertisement

Tollywood: అగ్ర హీరోల చిత్రాలు లేక వెలవెలబోతున్న థియేటర్లు.. ఎగ్జిబిటర్లు ఏమంటున్నారంటే?

Tollywood: అగ్ర హీరోల చిత్రాలు లేక వెలవెలబోతున్న థియేటర్లు.. ఎగ్జిబిటర్లు ఏమంటున్నారంటే?
Advertisement

Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా.. ‘ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు’ అనే మాటే వినబడింది. ఒకవేళ ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే మాత్రం, స్టార్ హీరో సినిమా అయినా అయిండాలి, లేదంటే కంటెంట్ పరంగా మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్నారు. ఈ క్రమంలో చాలా వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు (Single Screen Theatres) మూతబడుతున్నాయి. ఈ క్రమంలో సినిమాలకు పెద్ద పండగ అయిన సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లు కళకళలాడాయి. సంక్రాంతికి వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఎగబడి మరీ చూశారు. దీంతో మరోసారి పాత రోజులు పునరావృతం అయ్యాయి. కానీ, అది ఎన్నో రోజులు నిలవలేదు. మరో శుక్రవారానికి అంతా మాములైపోయింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ దాదాపు బాగానే కలెక్షన్స్ రాబట్టాయి. ఆ తర్వాత విడుదలైన సినిమాలతో మరోసారి థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్స్ వాట్సప్ గ్రూప్‌లో ఆసక్తికరమైన చర్చ నడిచింది. అదేంటంటే..

‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వెన్నెముక వంటి థియేటర్ల వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అగ్ర కథానాయకుల చిత్రాలు సకాలంలో విడుదల కాకపోవడం, ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వసూళ్లు రాకపోవడంతో ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.

Advertisement

Also Read- Pithapuramlo: ‘పద్మశ్రీ’ పురస్కారం తర్వాత రాజేంద్రప్రసాద్‌ నుంచి వచ్చే చిత్రమిదే..

ఏడాదికి ఒక్క సినిమా అయినా రావాలి
ఏ ఎస్ ఆర్ (ASR) థియేటర్ల నిర్వాహకులు అంజి రెడ్డి (Anji Reddy) ఈ సందర్భంగా మీడియా ముఖంగా థియేటర్ల దుస్థితిని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2000 థియేటర్లు కేవలం అగ్ర హీరోల సినిమాలపైనే ఆధారపడి నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి అగ్ర కథానాయకులు సంవత్సరానికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేస్తేనే చిత్ర పరిశ్రమ కళకళలాడుతుంది. పెద్ద సినిమాలు వస్తేనే కలెక్షన్లు వస్తాయి, అప్పుడే థియేటర్ల మెయింటెనెన్స్, విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాలు చెల్లించడం సాధ్యమవుతుంది’ అని అంజి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

వేలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రశ్నార్థకం

థియేటర్ల మూతతో కేవలం యాజమాన్యాలే కాకుండా, వాటిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. టికెట్ కౌంటర్ సిబ్బంది నుండి క్లీనర్లు, ప్రొజెక్టర్ ఆపరేటర్ల వరకు అందరి కుటుంబాలు ఈ సంక్షోభంలో చిక్కుకున్నాయి. పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకుల రాక తగ్గి, క్యాంటీన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా పడిపోయిందని నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement

Also Read- Battery Explosion: రీల్స్ పిచ్చా? అమాయకత్వమా? నోట్లో బ్యాటరీ పేలి బాలుడి పరిస్థితి..!

థియేటర్ల మనుగడకు అగ్ర హీరోలే దిక్కు

ఒకప్పుడు పండుగలు, సెలవుల సమయంలో వరుసగా పెద్ద సినిమాలు విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు తమ చిత్రాల నిర్మాణానికి ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో థియేటర్లకు ‘డ్రై పీరియడ్’ (సినిమాలు లేని కాలం) ఎక్కువైపోతోంది. ఈ పరిస్థితిని గమనించి, చిత్ర పరిశ్రమ శ్రేయస్సు దృష్ట్యా అగ్ర హీరోలు వేగంగా సినిమాలు పూర్తి చేసి, థియేటర్ల యాజమాన్యాలను మరియు కార్మికులను ఆదుకోవాలని ఎగ్జిబిటర్ల సంఘం విజ్ఞప్తి చేస్తోంది.’’

(Source: డిస్ట్రిబ్యూటర్స్ వాట్సప్ గ్రూప్)

Also Read- Nagabandham: ‘నాగబంధం’లో బాలీవుడ్ ‘ఫైటర్’ ఫేమ్ రిషబ్ సాహ్నీ.. ఫస్ట్ లుక్ అరాచకం!

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×