E-Paper
Advertisement

Congress on BRS: మొన్న గ్రామాలు.. నేడు సిటీ.. బీఆర్ఎస్‌కు బై బై! కాంగ్రెస్ ట్వీట్ వైరల్

Congress on BRS: మొన్న గ్రామాలు.. నేడు సిటీ.. బీఆర్ఎస్‌కు బై బై! కాంగ్రెస్ ట్వీట్ వైరల్
Advertisement

Congress on BRS: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంతో.. రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ గెలుపును కాంగ్రెస్ ఘనంగా సెలబ్రేట్ చేస్తుండగా, సోషల్ మీడియాలో ఆ పార్టీ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ టార్గెట్‌గా ట్వీట్ చేసింది. మొన్న గ్రామాలు.. నేడు హైదరాబాద్ సిటీ బీఆర్ఎస్‌కు బై బై చెప్పాయి. గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఇక కనుమరుగు అవడం ఖాయం అంటూ పేర్కొంది. కాగా హైదరాబాద్ ప్రజలు అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ వైపే ఉన్నారన్న దానికి ఈ గెలుపు నిదర్శనమని ఆ పార్టీ నేతలు అన్నారు.

Advertisement

కాగా జూబ్లిహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటమిని ఎవరు కూడా మాగంటి సునీత ఓటమిగా చూడటం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఓటమిగానే చూస్తున్నారు. అంతే కాదు ఈ ఓటమికి బాధ్యత కూడా కేటీఆర్‌దే అనే చర్చ ఇప్పటికే గులాబీ సర్కిల్‌లలో మొదలైంది. కేటీఆర్ ప్రస్తావించిన తీరే ఇప్పుడు బీఆర్ఎస్ కొంప ముంచిదనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కేటీఆర్ చేసిన ఆ తప్పులే ఇప్పుడు పార్టీ కొంప ముంచాయనే ప్రచారం జరుగుతోంది.

Also Read: కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. 17 ఫైర్ ఇంజిన్లతో

Advertisement

కేటీఆర్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్.. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ తీరు పెద్ద చర్చకే తెరలేపిందనే చెప్పాలి. ఆయన మాట్లాడే భాష, ఆయన వ్యవహార శైలి ప్రజల్లో ఏవగింపును తీసుకొచ్చాయని చెప్పాలి. వీటిన్నటిని ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నేతలు పాలన తీరుపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. అయితే ఇందులో లాజిక్ కంటే పర్శనల్ టార్గెట్ ఎక్కువగా కనిపించింది. ఆయన మాట్లేడే తీరు ఇప్పటికే అనేక సార్లు విమర్శలకు కారణం అయింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఘోర ఓటమికి కారణం అయిందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×