E-Paper
Advertisement

Oppo A80 5G: ఒప్పో నుంచి చీపెస్ట్ 5G ఫోన్.. ధర చూస్తే అసలు వదలరు!

Oppo A80 5G: ఒప్పో నుంచి చీపెస్ట్ 5G ఫోన్.. ధర చూస్తే అసలు వదలరు!
Advertisement

Oppo A80 5G: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో ఇటీవలే  Oppo A3x ఫోన్‌ను విడుదల చేసింది. అయితే అంతలోనే ఇప్పుడు కంపెనీ మరో కొత్త A సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని పేరు Oppo A80 5G. నివేదిక ప్రకారం రాబోయే ఫోన్ Oppo A80 ఇటీవల చైనాలో విడుదల చేసిన Oppo A3 ఎనర్జీ ఎడిషన్ రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. ఫోన్ లాంచ్‌కు ముందు కెమెరా, డిజైన్ , అన్ని స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

Oppo A80 5G Specifications
లీక్ ఆధారంగా A80 5G పంచ్-హోల్ డిస్ప్లేతో ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. LED రింగ్‌తో వెనుకవైపు డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది. ఇది A3 ఎనర్జీ ఎడిషన్ మాదిరిగానే ఉంటుంది. ఇది బ్లాక్, పర్పుల్, గ్రీన్ కలర్ వేరియంట్‌లలో వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Advertisement

Also Read: OnePlus Nord 4 5G Price Drop: ఇది ఊహించలేదు.. 5జీ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. కొనేస్తేపోలా!

ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ప్రాసెసింగ్‌ ఉంటుంది. ఇది 8GBRAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ సపోర్ట్‌తో వస్తుంది. బడ్జెట్‌కు తగ్గట్టుగా కెమెరా డిపార్ట్‌మెంట్ చాలా బాగుంది. ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 8MP.

Advertisement

A80 5G‌లో 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,100mAh బ్యాటరీని ప్యాక్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ColorOS 14.0.1 పై రన్ అవుతుంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్ బేసిక్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది.

బాక్స్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-సి పోర్ట్ ఉంటాయి. అలానే దీనిలో NFC, Wi-Fi 5 వంటి స్టాండర్డ్ ఫీచర్‌లు ఉన్నాయి. అదనంగా ఫోటోల కోసం AI ఎరేజర్, నెట్‌వర్క్ ఆప్టిమైజేషన్ కోసం AI లింక్‌బూస్ట్, బ్యాటరీ లైఫ్ పొడిగించడానికి AI ఛార్జింగ్ ప్రొటక్షన్ వంటి AI ఫీచర్లు ఉన్నాయి.

Also Read: Flipkart Flagship Sale 2024: ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే గిఫ్ట్.. బ్రాండెడ్ ఫోన్లపై కళ్లుచెదిరే డీల్స్.. ఆగస్టు 6 నుంచి స్టార్ట్!

Oppo A80 5G Price
నివేదిక ప్రకారం ఐరోపాలో Oppo A80 5G ధర 8GB/256GB వేరియంట్ కోసం €249 (దాదాపు రూ. 22,566)గా ఉంటుంది. కంపెనీ ఇంకా ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే దీని పూర్తి సమాచారం త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Related News

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

రూ. 20 వేల బడ్జెట్‌లో బెస్ట్ వాషింగ్ మెషీన్! మీ ఇంటికి పర్ఫెక్ట్

రూ. 16,499 కే సామ్‌సంగ్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ! ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

జేబులో పట్టే సైజులో పవర్ బ్యాంక్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

Big Stories

Advertisement
×