E-Paper
Advertisement

Chiranjeevi: కృష్ణ చేసిన సాయం వలనే చిరు మెగాస్టార్ అయ్యాడా.. ?

Chiranjeevi: కృష్ణ చేసిన సాయం వలనే చిరు మెగాస్టార్ అయ్యాడా.. ?
Advertisement

Chiranjeevi: ఇండస్ట్రీలో ఏ అవకాశం ఎవరికి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అన్నట్లు.. ఇండస్ట్రీలో కూడా ప్రతి హిట్ సినిమాకు ఒక హీరో పేరు రాసి ఉంటుంది. ఆ కథ ఎంతమంది దగ్గరకు వెళ్లినా.. చివరకు రావాల్సిన హీరో వద్దకే వచ్చాయి ఆగుతుంది.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ప్రస్తుతం స్టార్లుగా చెప్పుకొస్తున్న హీరోలందరి లైఫ్ లో కూడా తమను స్టార్ ను చేసిన సినిమా ఒకటి ఉంటుంది. ఆ హీరో గురించి చెప్పలాంటే ఆ సినిమాకు ముందు.. ఆ సినిమా తరువాత అని చెప్పుకొస్తారు. లాంటి ఒక సినిమా.. మెగాస్టార్ చిరంజీవి జీవితంలో ఖైదీ. ఈ విషయం అందరికి తెలుసు.

Advertisement

అయితే ఈ సినిమాకు మొదట అనుకున్న హీరో చిరంజీవి కాదంట. ఒకవేళ ఖైదీ సినిమా కనుక చిరు చేయకపోయి ఉంటే.. ఆయన హిట్ కొట్టడానికి మరింత సమయం పట్టేది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ కథ మొదట ఎవరి వద్దకు వెళ్ళింది.. ? చివరకు చిరు వద్దకు ఎలా వచ్చింది అంటే.. అది సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాయమే అని తెలుస్తోంది.

అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తరువాత కొత్తగా వచ్చిన కృష్ణ .. ఏడాదికి డజన్ సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నాడు. ఆ సమయంలోనే కృష్ణ వద్దకు ఖైదీ కథ వచ్చింది. ఇక కథ విన్న కృష్ణ.. ఇది చిరంజీవికి అయితే బాగా సెట్ అవుతుందని.. నిర్మాతలను చిరువద్దకు పంపాడట. అప్పటికే చిరు అంటే కృష్ణకు ఎనలేని అభిమానం. వీరిద్దరూ కలిసి ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించారు.

Advertisement

చిరు నటన అన్నా, డ్యాన్స్ అన్నా కృష్ణకు ఎంతో ఇష్టం. దానివల్లనే ఖైదీకి చిరు సూట్ అవుతాడని నమ్మి, నిర్మాతలను చిరు దగ్గరకు పంపించాడట. ఇక కథ నచ్చడంతో చిరు కూడా ఖైదీని ఓకే చేశాడు. అలా కృష్ణ చేసిన సాయం వలన.. ఖైదీ చిరుకు పడింది. అంతేకాదు. ఈ సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించింది కూడా కృష్ణనే.

ఇక మెగాస్టార్ కెరీర్ లోనే ఖైదీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిరు నట ప్రస్థానం చెప్పాలంటే ఖైదీకి ముందు ఖైదీకి తరువాత అని చెప్పుకోవడం మొదలయ్యింది. ఏ సినిమా తరువాత చిరు వెనకెక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. వరుస సినిమాలు చేస్తూ మెగాస్టార్ గా ఎదిగాడు.  ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×