E-Paper
Advertisement

Philips OneChef: ఫిలిప్స్ సంచలనం.. అధునాతన కుక్కర్ వచ్చేసిందోచ్.. 33 స్టైల్స్‌లో వండుకోవచ్చు!

Philips OneChef: ఫిలిప్స్ సంచలనం.. అధునాతన కుక్కర్ వచ్చేసిందోచ్.. 33 స్టైల్స్‌లో వండుకోవచ్చు!
Advertisement

Philips OneChef: భారత్ లో నాణ్యమైన, అధునాత ఎలక్ట్రానిక్ గృహోపకరణ పరికరాలను అందించే కంపెనీల్లో ఫిలిప్స్ ఒకటి. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న గ్యాస్ కొరత నేపథ్యంలో అందరూ ప్రత్యామ్నాయ స్మార్ట్ కుకింగ్ పరికరాలపై మెుగ్గు చూపుతున్నారు. దీనిని గమనించిన ఫిలిప్స్.. భారత్ లో అధునాతన స్మార్ట్ కుకింగ్ పరికరాన్ని మార్కెట్ లోకి లాంచ్ చేసింది. దీనిలోని స్మార్ట్ కుకింగ్ ఫీచర్లు.. ప్రతీ ఒక్కరిని ఫీదా చేస్తున్నాయి.

ముంబయిలో లాంచ్..

తాజాగా ముంబయిలో జరిగిన ‘చెఫ్స్ టేస్టింగ్ టేబుల్’ కార్యక్రమంలో సరికొత్త ‘Philips OneChef’ ఆల్ ఇన్ వన్ స్మార్ట్ కుకింగ్ అప్లయన్స్‌ను ఆవిష్కరించారు. ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ ఆధ్వర్యంలో దీనిని లాంచ్ చేశారు. వంటగదిలో కుకింగ్ కార్యక్రమాలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చినట్లు ఫిలిప్స్ వర్గాలు ప్రకటించాయి. సంప్రదాయ భారతీయ వంటకాలను తయారు చేయడానికి ఈ ఉపకరణం ఎంతగానే ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ‘Philips OneChef’ పరికరం ఫీచర్లు, దాని ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

33-ఇన్-1 ఫంక్షన్స్

Advertisement

‘Philips OneChef’ ఆల్ ఇన్ వన్ స్మార్ట్ కుకింగ్ అప్లయన్స్‌ను మల్టీపుల్ కుకింగ్ ఫంక్షన్స్ తో లాంచ్ చేశారు. ఈ ఒక్క పరికరంతోనే ఎయిర్ ఫ్రైయింగ్, స్టిర్ ఫ్రైయింగ్ (వేపుడు), స్టీమింగ్ (ఆవిరి మీద ఉడికించడం), బాయిలింగ్ (ఉడకబెట్టడం) వంటి దాదాపు 33 రకాల వంట పద్ధతులను ఉపయోగించుకోవచ్చు.

AmbiHeat టెక్నాలజీ

ఈ స్మార్ట్ కుకింగ్ పరికరంలో అధునాతన ‘అంబియట్ టెక్నాలజీ’ని పొందు పరిచారు. ఇది వంట చేసే సమయంలో ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆహారం అంతటా సమానంగా వేడి తగిలేలా సహాయపడుతుంది. దీనివల్ల వంట రుచిగా కోరుకున్న విధంగా వస్తుంది.

స్మార్ట్ వంటకాలు

Advertisement

ఇందులో ముందుగానే సెట్ చేసిన (Preset) వంట ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. దీనివల్ల వంట చేయడం చాలా సులభం అవుతుంది. ఆహారాన్ని అంటిపెట్టుకోవాల్సి అవసరం ఉండదు. ఒకసారి ప్రీసెట్ ప్రోగ్రామ్ ను సెట్ చేస్తే.. దానంతట అది వంటను పూర్తి చేస్తుంది.

డిజైన్ పరంగా..

‘Philips OneChef’ పరికరం సాలిడ్ డిజైన్ ను కలిగి ఉంది. చూడటానికి ఎంతో స్టైలిష్ గా కనిపిస్తుంది. దీనిని 6 లీటర్ల కెపాసిటీతో తీసుకురావడం వల్ల.. కిచెన్‌లో తక్కువ స్థలంలోనే దీనిని అడ్జస్ట్ చేయవచ్చు. క్లిష్టమైన వంటలను కూడా సులభంగా చేసుకునేలా దీన్ని రూపొందించారు.

Also Read: Ugadi Pachadi Benefits: ఒక స్పూన్ ఉగాది పచ్చడి.. మీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

ధర ఎంతంటే?

ఫిలిప్స్ తన అధునాతన స్మార్ట్ కుకింగ్ పరికరం ధరను రూ.19,995 గా నిర్ణయించింది. ఇది మార్చి 19 నుండి అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది.

Also Read: Nalgonda drugs: పోలీసులకే షాక్ ఇచ్చిన గంజాయి స్మగ్లర్ల ‘లేడీ గెటప్’ స్కెచ్.. చివరికి ఏమైందంటే?

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×