E-Paper
Advertisement

ఒరాకిల్‌లో మాస్ లేఆఫ్స్.. వారే టార్గెట్.. ఈ లేఆఫ్స్ వెనుక ఒక వింతైన అల్గారిథమ్!

ఒరాకిల్‌లో మాస్ లేఆఫ్స్.. వారే టార్గెట్.. ఈ లేఆఫ్స్ వెనుక ఒక వింతైన అల్గారిథమ్!
Advertisement

Oracle’s Massive Job Cuts: గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థలో ఇటీవల చోటుచేసుకున్న భారీ లేఆఫ్స్ టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి. సుమారు 30,000 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించడం ద్వారా సంస్థ తన చరిత్రలోనే అతిపెద్ద కోతను విధించింది. అయితే ఈ తొలగింపుల సంఖ్య కంటే కూడా, ఏ ప్రాతిపదికన ఉద్యోగులను లే ఆఫ్ చేశారనే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దశాబ్దాల కాలం పాటు సంస్థకు సేవలు అందించిన సీనియర్ ఉద్యోగులు కూడా రోడ్డున పడటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

ఒరాకిల్‌లో సుమారు 34 ఏళ్ల పాటు సెక్యూరిటీ అలర్ట్ మేనేజర్‌గా పనిచేసిన నీనా లూయిస్ పెట్టిన లింక్డ్‌ఇన్ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. “34 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత (అందులో 33 ఏళ్లు అద్భుతమైనవి). ఈరోజు నేను కూడా ఆ 30,000 మంది బాధితులలో ఒకరిగా మారాను.” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఆఫ్స్ వెనుక ఒక వింతైన అల్గారిథమ్ పని చేస్తోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అధిక వేతనం పొందుతున్న వారు, మిడ్-లెవల్ మేనేజర్లు, భారీగా స్టాక్ ఆప్షన్స్ (Stock Options) కలిగి ఉన్న వారిని ఏరికోరి తొలగించినట్లు కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. అంటే కంపెనీ తన ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి సీనియర్లను లక్ష్యంగా చేసుకుందనే ఆమె ఆరోపణలు చేశారు.

Advertisement

ఈ లేఆఫ్స్ ప్రభావం ఒరాకిల్‌లోని ఐదు ప్రధాన విభాగాలపై పడింది. ఒరాకిల్ హెల్త్, సేల్స్, క్లౌడ్, కస్టమర్ సక్సెస్, నెట్‌సూట్ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. వీరిలో ఒక ఏడాది అనుభవం ఉన్న వారి నుండి 18 ఏళ్ల పాటు సంస్థలో కొనసాగిన కుర్ట్ ఫ్రీడెన్ వంటి సీనియర్ టెక్నికల్ స్టాఫ్ వరకు అందరూ ఉన్నారు. కుర్ట్ ఫ్రీడెన్ తన లే ఆఫ్ ను ధైర్యంగా స్వీకరిస్తూనే, ఇది తన రిటైర్మెంట్‌కు సరైన సమయమని ప్రకటించారు.

మరో మాజీ ఉద్యోగి మార్క్ ఫిట్టెన్ ఈ తొలగింపులను అత్యంత బాధాకరమైనవిగా అభివర్ణించారు. “సుమారు 29,999 మందితో పాటు నేను కూడా బయటకు వచ్చాను. ఇందులో ఎంతో మంది తెలివైన వారు, ప్రతిభావంతులు ఉన్నారు. కనీసం సహోద్యోగులకు సరైన వీడ్కోలు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండానే పంపించేయడం చాలా నిరాశ కలిగించింది.” అని ఆయన పేర్కొన్నారు. కేవలం లాభాల వేటలో పడి మానవీయ విలువలను పక్కన పెట్టడంపై టెక్ నిపుణులు విమర్శలు గురిపిస్తున్నారు. ప్రస్తుతం లింక్డ్‌ఇన్ వేదికగా వందలాది మంది బాధితులు కొత్త అవకాశాల కోసం తమ ప్రొఫైల్స్‌ను షేర్ చేస్తున్నారు.

Advertisement

టెక్ రంగంలో ఈ తరహా భారీ లేఆఫ్స్ రాబోయే రోజుల్లో ఇతర సంస్థల్లో కూడా పునరావృతమవుతాయేమోనన్న భయాందోళనలు ఉద్యోగుల్లో నెలకొన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ పెరుగుతున్న తరుణంలో, అనుభవం కంటే వ్యయ నియంత్రణకే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని ఈ మాస్ లే ఆఫ్ లు స్పష్టం చేస్తున్నాయి.

Read Also: బెడ్ దిగక్కర్లేదు.. రిమోట్‌తో ఫ్యాన్ వేయొచ్చు.. తక్కువ ధరలో లభించే టాప్-5 మోడల్స్ ఇవే!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×