E-Paper
Advertisement

మార్వెల్ హీరోలు నటించిన మాస్టర్ పీస్… ఎత్తులకు పైఎత్తులు… తెలివైన దొంగ వేటలో మొండి డిటెక్టివ్

మార్వెల్ హీరోలు నటించిన మాస్టర్ పీస్… ఎత్తులకు పైఎత్తులు… తెలివైన దొంగ వేటలో మొండి డిటెక్టివ్

Crime Thriller OTT : మార్వెల్ హీరోలు నటించిన ఒక అదిరిపోయే హీస్ట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో ‘అవెంజర్స్’ సినిమాలో థోర్ పాత్ర పోషించిన క్రిస్ హెమ్స్‌వర్త్, హల్క్ పాత్రలో నటించిన మార్క్ రుఫాలో ప్రధాన పాత్రలు పోషించారు. వీళ్ళిద్దరూ ఈ సినిమాలో దొంగ-పోలీసుగా తలపడటం విశేషం. అంతేకాదు వీరిద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్స్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయి. ఇది మామూలు దొంగతనం సినిమాలా కాకుండా, చాలా రియలిస్టిక్‌గా, గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఇక దీని ఓటీటీ డీల్ కూడా భారీ ధరకే అమ్ముడుపోయింది. ఆ వివరాలేంటి ? ఈ కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ప్రముఖ రచయిత డాన్ విన్స్‌లో రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘క్రైమ్ 101’ (Crime 101). దీనికి ‘అమెరికన్ యానిమల్స్’ వంటి విభిన్నమైన క్రైమ్ సినిమాలను తీసిన బార్ట్ లేటన్ దర్శకత్వం వహించారు. ఇందులో క్రిస్ హెమ్స్‌వర్త్ (థోర్ ఫేమ్) దొంగ పాత్రలో, మార్క్ రుఫాలో (హల్క్ ఫేమ్) డిటెక్టివ్ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమా 2026 ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఇప్పుడు 2026 ఏప్రిల్ 1 నుండి Amazon Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ మధ్య గట్టి పోటీ జరిగింది. చివరికి అమెజాన్ MGM స్టూడియోస్ సుమారు $100 మిలియన్ల భారీ ధరతో ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది.

స్టోరీ ఏమిటంటే

లాస్ ఏంజిల్స్ ఏరియాలో మైక్ డేవిస్ అనే దొంగ ఉంటాడు. వాడు మామూలోడు కాదు, పక్కా ప్లాన్‌తో తనకంటూ పెద్ద పెద్ద నగల కొట్టులనే టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఏ దొంగతనంలోనూ చిన్న క్లూ కూడా వదలడు, అసలు ఎవరికీ దొరకడు కూడా. పోలీసులు అంతా కలిసి ఇదంతా ఏదో పెద్ద గ్యాంగ్ పని అని తలలు పట్టుకుంటూ ఉంటారు. కానీ లౌ లూబెస్నిక్ అనే ఒక తెలివైన డిటెక్టివ్ మాత్రం వీడి మీద కన్నేస్తాడు. ఇదంతా ఏదో ముఠా చేస్తున్న పని కాదు, ఒక్కడే చేస్తున్నాడని పసిగడతాడు. అటు దొంగ తన ఆఖరి వేటగా ఒక పెద్ద స్కెచ్ వేసి, ఒక ఇన్సూరెన్స్ బ్రోకర్‌తో చేతులు కలుపుతాడు. ఇక్కడ దొంగ తెలివికి, డిటెక్టివ్ పట్టుదలకు మధ్య ఒక రేంజ్ లో మైండ్ గేమ్ నడుస్తుంది. చివరికి ఆ దొంగ దొరికిపోతాడా? లేక డిటెక్టివ్ కళ్ళలో కారం కొట్టి తన ఆఖరి స్కెచ్ సక్సెస్ చేసుకుంటాడా? అన్నదే అసలైన మజా ఇచ్చే క్లైమాక్స్.

Read Also : ఊహించని మలుపులతో ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ కామెడీ… ఎప్పుడు ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Related News

కోరిక తీరింది.. కానీ ప్రాణం పోయింది! హారర్ థ్రిల్లర్ లవర్స్ అవ్వొద్దు..

ఓటీటీ లోకి ‘అవతార్ 3’ వచ్చేస్తుంది.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగంటే..?

హత్య చూసిన తర్వాత ఊపిరి బిగబట్టే ఉత్కంఠ… ఊహించని మలుపులతో వణుకు పుట్టిస్తున్న మూవీ

వియన్నా హైజాక్ వెనుక ఉన్న అసలైన విలన్ ఎవరు?… ఓటీటీలో ఉత్కంఠ రేపుతున్న సినిమా

రూమ్‌మేట్‌ హత్యతో ఐదేళ్లు శిక్ష… జైలుపాలైన కూతురి కోసం సముద్రాలు దాటిన ఓ తండ్రి కథ

ఇలాంటి యాక్షన్ సినిమాలే దుమ్ము లేపేది… ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది

అంతరిక్షంలో అబ్బురపరిచే మిస్టరీ… ఓటిటిలో అదరగొడుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా

ఆ ఇంట్లో ఏదో ఉంది… మంత్రగత్తె మాయలో పడ్డ తోబుట్టువులు… ప్రాణాలతో బయటపడతారా?

Big Stories

×