E-Paper
Advertisement

Panasonic New ACs: కొత్త ఏసీ కావాలా? పానాసోనిక్ నుంచి అడ్వాన్స్డ్ ఏసీలు.. 57 రకాల మోడళ్లలో..!

Panasonic New ACs: కొత్త ఏసీ కావాలా? పానాసోనిక్ నుంచి అడ్వాన్స్డ్ ఏసీలు.. 57 రకాల మోడళ్లలో..!

Panasonic New ACs: ప్రముఖ టెక్ కంపెనీ పానాసోనిక్.. 2026 ఏడాదికి సంబంధించి రేంజ్ రెసిడెన్షియల్ ఎయిర్ కండీషనర్లు (AC) విడుదల చేసింది. ఈ సందర్భంగా 57 కొత్త ఏసీ మోడల్స్ ను కస్టమర్లకు పరిచయం చేసింది. సమ్మర్ లో దేశవ్యాప్తంగా ఉండే ఎండ తీవ్రత, దుమ్ముతో కూడిన పరిస్థితులను తట్టుకునేలా వీటిని రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

డస్ట్ బస్టర్ టెక్నాలజీ..

కొత్త మోడల్స్‌లో డస్ట్ బస్టర్ (DustBuster) అనే ధూళి నియంత్రణ టెక్నాలజీ హైలెట్ గా నిలుస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఏసీ బయటి యూనిట్‌లో పేరుకుపోయే ధూళిని ఆటోమేటిక్‌గా తొలగిస్తుందని తెలిపింది. ఫలితంగా ఏసీ పనితీరు స్థిరంగా కొనసాగుతుందని తెలియజేసింది. ఇతర ఏసీల్లో దూళి కారణంగా కూలింగ్ తగ్గే సమస్యకు ఈ డస్ట్ బస్టర్ టెక్నాలజీ చెక్ పెడుతుందని స్పష్టం చేసింది.

ప్రారంభ ధర ఎంతంటే?

ఈ కొత్త ACల ధర రూ. 32,490 నుంచి ప్రారంభమవుతుందని పానాసోనిక్ తెలిపింది. ఇందులో 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఇన్వర్టర్ మోడల్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ అధునాతన ఏయిర్ కండీషనర్లు 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతల్లో పనిచేసేలా రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పరీక్షల్లో 48 డిగ్రీల సెల్సియస్ వద్ద పూర్తి శీతలీకరణ సామర్థ్యాన్ని ఇది ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.

స్మార్ట్ కంట్రోలింగ్ వ్యవస్థ

గదిలోని గాలిని శుద్ధి చేసేందుకు కొత్త ఏసీల్లో నానో టెక్నాలజీని చేర్చినట్లు పానాసోనిక్ వర్గాలు తెలిపాయి. ఇది ఇంటి లోపలి కాలుష్యకారకాలు, దుర్వాసనలను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నాయి. మరోవైపు పానాసోనిక్ కొత్త ఏసీ లైనప్ లో స్మార్ట్ కంట్రోలింగ్ వ్యవస్థ కూడా ఉండనుంది. పానాసోనిక్ కి చెందిన MirAIe యాప్ ద్వారా ఫోన్ నుంచే ఏసీని కంట్రోల్ చేయవచ్చు. శక్తి వినియోగాన్ని ట్రాక్ చేయడానికి, ఫిల్టర్ క్లీన్ హెచ్చరికలను ఎప్పటికప్పుడు పొందేందుకు ఈ యాప్ సాయపడనుంది.

Also Read: Refrigerator Offers: ఫ్లిప్‌కార్ట్ క్రేజీ ఆఫర్.. అతి తక్కువ ధరకే.. శాంసంగ్, వర్ల్‌పూల్, గోద్రేజ్ ఫ్రిడ్జ్‌లు!

ఏఐ ఆధారిత అడాప్టివ్ కూలింగ్

పానాసోనిక్ లేటెస్ట్ ఏసీ మోడల్స్ లో Converti8 technology కూడా ఉంది. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కూలింగ్ సామర్థ్యాన్ని సర్దుబాటు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. గదిలోని టెంపరేచర్ ఆధారంగా కూలింగ్, ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ మెంట్, ఏఐ ఆధారిత అడాప్టివ్ కూలింగ్, తనకు తానుగా శుభ్రపరుచుకునే ఇండోర్ కాయిల్ ఫంక్షన్.. పానాసోనిక్ ఏసీల్లో మరిన్ని ఫీచర్లుగా చెప్పవచ్చు.

Also Read: Drunk Thief: ఇంట్లో దొంగతనానికి వెళ్లి.. గుర్రుపెట్టి పడుకున్నాడు.. ఫస్ట్ టైమ్ అనుకుంటా..!

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×