E-Paper
Advertisement

Sunscreen: సన్‌స్క్రీన్ వాడటం లేదా ? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!

Sunscreen: సన్‌స్క్రీన్ వాడటం లేదా ? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!
Advertisement

Sunscreen: ప్రస్తుతం సూర్యరశ్మి కేవలం విటమిన్ డి ని మాత్రమే కాదు. తనతో పాటు హానికరమైన అతి నీలలోహిత కిరణాలను కూడా మోసుకొస్తోంది. చాలా మంది సన్‌స్క్రీన్ రాసుకోవడాన్ని కేవలం ఒక బ్యూటీ టిప్‌గా లేదా వేసవి కాలానికి పరిమితమైన అలవాటుగా భావిస్తారు. కానీ.. సన్‌స్క్రీన్‌ను వాడకపోతే అంటే మీ చర్మాన్ని నేరుగా ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలకు అప్పగించడమే. నిరంతరం ఎండకు గురికావడం వల్ల చర్మ కణాలు దెబ్బతిని, అది కాలక్రమేణా స్కిన్ క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది. ఈ నిర్లక్ష్యం మీ ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టవచ్చు.

సన్‌స్క్రీన్ వాడకపోతే కలిగే నష్టాలు:

Advertisement

మన శరీరంపై అతిపెద్ద అవయవం చర్మం. ఇది మనల్ని బాహ్య కారకాల నుంచి రక్షిస్తుంది. కానీ, సూర్యుడి నుంచి వచ్చే UVA, UVB కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి మనం కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే, అది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సన్‌ స్క్రీన్ వాడకపోవడం వల్ల కలిగే ప్రధాన నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. అతినీలలోహిత కిరణాల ప్రభావం:

Advertisement

సూర్య కిరణాల్లోని UVB కిరణాలు చర్మం పైపొరను కాల్చివేస్తాయి. దీని వల్ల చర్మం ఎర్రగా మారి మంట పుడుతుంది. అయితే.. UVA కిరణాలు చర్మం లోపలి పొరల వరకు చొచ్చుకుపోయి DNA నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. ఇలా DNA దెబ్బతినడమే చర్మ క్యాన్సర్‌కు పునాది వేస్తుంది.

2. చర్మ క్యాన్సర్ రకాలు:
సన్‌ స్క్రీన్ వాడకుండా ఎండలో తిరగడం వల్ల ప్రధానంగా మూడు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.

బేసల్ సెల్ కార్సి నోమా: ఇది సాధారణంగా ముఖం, మెడపై కనిపిస్తుంది.

స్క్వామస్ సెల్ కార్సినోమా: ఇది చర్మంపై మచ్చలు లేదా పొక్కుల రూపంలో మొదలవుతుంది.

మెలనోమా: ఇది అత్యంత ప్రమాద కరమైనది. ఇది చర్మంపై ఉండే పుట్టుమచ్చల రంగు మారడం లేదా కొత్తగా నల్లని మచ్చలు ఏర్పడటం ద్వారా వ్యాపిస్తుంది.

3. ముందస్తు వృద్ధాప్య ఛాయలు:

సన్‌ స్క్రీన్ వాడని వారిలో చర్మం త్వరగా ముడతలు పడటం, వేలాడటం, పిగ్మెంటేషన్ (నల్లని మచ్చలు) రావడం జరుగుతుంది. సూర్య రశ్మి చర్మంలోని కొల్లాజెన్‌ను నాశనం చేయడం వల్ల 30 ఏళ్లలోనే 50 ఏళ్ల వారిలా కనిపించే ప్రమాదం ఉంది.

4. మేఘావృతమైన రోజుల్లో కూడా ప్రమాదమే:
చాలామంది ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు సన్‌స్క్రీన్ అవసరం లేదని అనుకుంటారు. కానీ.. మేఘాలు కేవలం వెలుతురును మాత్రమే ఆపుతాయి. UV కిరణాలను కాదు. దాదాపు 80% UV కిరణాలు మేఘాలను దాటుకుని భూమిని చేరుతాయి. కాబట్టి వాతావరణంతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ తప్పనిసరి.

Also Read: అరటి పండ్లు అతిగా తింటున్నారా? మీ జీర్ణ క్రియ ప్రమాదంలో పడ్డట్లే!

ఎలాంటి సన్‌స్క్రీన్ ఎంచుకోవాలి ?
కనీసం SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను ఎంచుకోండి.
అది ‘బ్రాడ్ స్పెక్ట్రమ్’ అయి ఉండాలి. అంటే UVA, UVB రెండింటి నుంచి రక్షణ ఇవ్వాలి.
ప్రతి రెండు లేదా మూడు గంటలకు ఒకసారి సన్‌ స్క్రీన్‌ను మళ్ళీ అప్లై చేయడం ముఖ్యం.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×