Philips 5G Smartphone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో కొత్త బ్రాండ్ సందడి చేయబోతోంది. ఫిలిప్స్ నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఫోన్ అధికారిక పేరును కంపెనీ ఇంకా వెల్లడించకపోయినా.. అమెజాన్‌లో ప్రత్యక్షమైన ప్రత్యేక మైక్రోసైట్ ద్వారా లాంచ్ తేదీ మాత్రం ఖరారైంది. అంతేకాదు, లాంచ్‌కు ముందే ఫోన్ డిజైన్, 120Hz డిస్‌ప్లే, 64MP కెమెరా వంటి కీలక వివరాలు కూడా బయటకు వచ్చాయి. మరి ఫిలిప్స్ తీసుకురాబోతున్న ఈ కొత్త 5G ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి
అమెజాన్ ల్యాండింగ్ పేజీ ప్రకారం ఫిలిప్స్ కొత్త 5G ఫోన్ సెప్టెంబర్ 2న భారత్‌లో విడుదల కానుంది. బ్లాక్, గ్రే, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కనిపించింది. అయితే, ఈ రంగులకు కంపెనీ పెట్టిన అధికారిక పేర్లు ఇంకా తెలియాల్సి ఉంది. ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లు లాంచ్ రోజున వెల్లడయ్యే అవకాశం ఉంది.
కొత్త ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లే ఉంటుందని ఫిలిప్స్ ధృవీకరించింది. ఇది 6GB, 8GB RAM వేరియంట్లలో రానుంది. స్టోరేజ్ విషయంలో 128GB, 256GB ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. హోల్ పంచ్ డిస్‌ప్లే, సన్నని బెజెల్స్, గుండ్రటి మూలలతో ఫోన్ డిజైన్ కనిపిస్తోంది.
Also Read: బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?
ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ AI కెమెరా యూనిట్ ఉంటుంది. కెమెరా మాడ్యూల్‌పై ఎడమవైపున అమర్చారు. దీనిలో రెండు కెమెరా లెన్స్‌లు నిలువుగా ఉండటంతో పాటు ఫ్లాష్ కూడా కనిపిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వనున్నారు.
ఆడియో కోసం ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించనున్నారు. వీటికి Ultra Max ఆడియో సపోర్ట్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. అలాగే, దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ కూడా ఉంది. ఫోన్ అధికారిక పేరు ఇంకా ప్రకటించలేదు. అయితే, గతంలో వచ్చిన అమెజాన్ లిస్టింగ్‌లో Philips S7221 అనే పేరు కనిపించింది. ఈ పేరు తుది మోడల్‌కు సంబంధించినదేనా అనేది సెప్టెంబర్ 2న స్పష్టమవుతుంది.
భారత్‌లో ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో తిరిగి అడుగు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 120Hz డిస్‌ప్లే, 64MP కెమెరా, 8GB వరకు RAM, 256GB స్టోరేజ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌ను బడ్జెట్ ధర విభాగంలో పోటీదారుగా నిలబెట్టే అవకాశం ఉంది. అయితే, ధర, ప్రాసెసర్, బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ వేగం వంటి కీలక వివరాలు ఇంకా తెలియలేదు. ఇవి వెల్లడైన తర్వాతే ఫోన్ విలువ, పనితీరుపై స్పష్టమైన అంచనాకు రావచ్చు.
Also Read: ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!