E-Paper
Advertisement

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?
Advertisement

80-20 Battery Rule: స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ఇయర్‌బడ్స్, పవర్ టూల్స్.. ఇలా మనం రోజూ వాడే చాలా పరికరాల్లో లిథియం-అయాన్ బ్యాటరీలే ఉంటాయి. కొంతకాలం తర్వాత బ్యాటరీ పనితీరు తగ్గడం సహజమే. అయితే మనం వాటిని ఎలా ఛార్జ్ చేస్తున్నామన్నది కూడా బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే ఇప్పుడు 80-20 రూల్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు.

80-20 రూల్ అంటే?

సింపుల్‌గా చెప్పాలంటే.. బ్యాటరీని సాధ్యమైనంత వరకు 20 శాతం నుంచి 80 శాతం మధ్య ఉంచడం. ప్రతిసారీ బ్యాటరీని పూర్తిగా ఖాళీ చేయడం లేదా తరచూ 100 శాతం వరకు ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీపై కొంత అదనపు ఒత్తిడి పడుతుంది. 20-80 శాతం మధ్య ఉంచితే ఆ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

Advertisement

అయితే 20 శాతానికి రాగానే వెంటనే ఛార్జర్ పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే 80 శాతం దాటితే బ్యాటరీ వెంటనే పాడైపోతుందని కూడా అనుకోవద్దు. ఇది కచ్చితంగా పాటించాల్సిన రూల్ కాదు. మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో Battery Protection, Charging Limit వంటి ఆప్షన్లు ఉంటే అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించవచ్చు.

Also Read: ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

100 శాతం ఛార్జ్ చేయకూడదా?

Advertisement

అలా ఏమీ లేదు. ప్రయాణానికి వెళ్తున్నప్పుడు లేదా ఎక్కువసేపు ఛార్జర్ అందుబాటులో ఉండదనుకున్నప్పుడు 100 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. 80 శాతం వద్ద ఆపడం బ్యాటరీ లైఫ్‌ను కాపాడుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి అలవాటు మాత్రమే.

బ్యాటరీకి వేడి పెద్ద సమస్య:

ఛార్జింగ్ సమయంలో కొద్దిగా వేడి రావడం సాధారణమే. కానీ ఎండలో ఫోన్ పెట్టడం, వేడెక్కిన కారులో వదిలేయడం, ఛార్జింగ్‌లోనే భారీ గేమ్స్ ఆడటం వంటివి బ్యాటరీపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.

అందుకే ఛార్జింగ్ చేసేటప్పుడు పరికరాన్ని వీలైనంత వరకు చల్లని ప్రదేశంలో ఉంచాలి. అవసరమైతే మందమైన కేస్‌ను కూడా తొలగించండి. 80-20 రూల్ కంటే కూడా బ్యాటరీని వేడి నుంచి కాపాడటం చాలా ముఖ్యం. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీ పనితీరు ఎక్కువకాలం మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది.

Also Read: మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Tags

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×