E-Paper
Advertisement

గోవా-ఢిల్లీ ఇండిగో విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమస్య, వెంటనే అత్యవసర ల్యాండింగ్

గోవా-ఢిల్లీ ఇండిగో విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమస్య, వెంటనే అత్యవసర ల్యాండింగ్
Advertisement

IndiGo flight: నిన్న ఎయిరిండియా.. నేడు ఇండిగో విమానం ఆకాశం నుంచి సడన్‌గా ల్యాండింగ్ అవుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తిరిగి గోవా ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. అసలు విమానంలో ఏం జరిగింది?

 

గోవా-ఢిల్లీ ఇండిగో విమానం టేకాఫ్  అయిన కొద్దిసేపటికే..

Advertisement

మంగళవారం ఉదయం 9.16 గంటలకు గోవా నుంచి ఢిల్లీకి ఇండిగో నంబర్ 6E 2102 విమానం బయలు దేరింది. గాలిలో ఉండగా ఇంజన్ సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానం 14 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. పరిస్థితి గమనించిన గోవా ఎయిర్ పోర్టు కంట్రోల్‌తో మాట్లాడారు. దీని కారణంగా గోవాలోని మోపా ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

 

14 వేల అడుగుల ఎత్తు నుంచి అక్కసారిగా, గోవా ఎయిర్‌పోర్టులో

Advertisement

ఫ్లైట్‌రాడార్24 అనే విమానయాన ట్రాకర్ నుండి అందిన సమాచారం ప్రకారం.. ఆ విమానం దక్షిణ మహారాష్ట్ర తీరం మీదుగా గోవా వైపు మళ్లి తిరిగి గోవా ఎయిర్ పోర్టుకు చేరింది. విమానం గోవా వైపు మళ్ళినప్పుడు సమయం విమానం ఉదయం 9:51 గంటలకు రన్‌వే‌పై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. స్టాండ్ 6 వద్ద దాన్ని పార్క్ చేశారు. ఆ తర్వాత ఉదయం 10:03 గంటలకు ఏటీసీ పూర్తి అత్యవసర పరిస్థితిని ముగించింది. ఢిల్లీకి బయలుదేరే విమానం సమయాన్ని మధ్యాహ్నం 3:30 గంటలకు మార్చారు సంబంధిత అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: టిష్యూ పేపర్ ఎంత పని చేసింది? ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఏం జరిగింది?

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×