E-Paper
Advertisement

Thomson Streaming Box: గూగుల్ టీవీ స్ట్రీమర్‌కు పోటీగా.. థామ్సన్ 4K బాక్స్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Thomson Streaming Box: గూగుల్ టీవీ స్ట్రీమర్‌కు పోటీగా.. థామ్సన్ 4K బాక్స్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Advertisement

Thomson Streaming Box: గూగుల్ టీవీ స్ట్రీమర్‌కు ఒక బలమైన ప్రత్యామ్నాయంగా థామ్సన్ గూగుల్ టీవీ స్ట్రీమింగ్ 260 ప్రో 4K బాక్స్ (Thomson Google TV Streaming Box 260 Pro 4K) త్వరలో గ్లోబల్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ఫీచర్లు.. ఇప్పటికే బయటకు రాగా నిపుణులు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు అడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్కి అన్న చందంగా ఈ స్ట్రీమింగ్ బాక్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

‘రెండు అడుగులు ముందుకు’

 

ఎక్కువ స్టోరేజ్

Advertisement

గూగుల్ టీవీ స్ట్రీమర్‌లో 32GB స్టోరేజ్ ఉంటే.. ఈ థామ్సన్ బాక్స్‌లో 64GB స్టోరేజ్ ఉంది. అంటే మీరు మరిన్ని యాప్స్, గేమ్స్‌ను దీనిలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

కనెక్టివిటీ పరంగా..

థామ్సన్ బాక్స్ లో రెండు USB-A పోర్ట్స్ ఉన్నాయి. పాత పెన్ డ్రైవ్‌లు లేదా హార్డ్ డిస్క్‌లను నేరుగా కనెక్ట్ చేసుకోవడానికి ఇది చాలా వీలుగా ఉంటుంది. గూగుల్‌ స్ట్రీమర్‌లో కేవలం ఒకే ఒక USB-C పోర్ట్ మాత్రమే ఉండటం గమనార్హం.

4GB RAM

Advertisement

థామ్సన్ బాక్స్ లో కూడా గూగుల్ స్ట్రీమర్ లాగే 4GB RAM అందించారు. ఫలితంగా ఇది గూగుల్ స్ట్రీమర్ కు చెరి సమానమైన పర్ఫార్మెన్స్ కలిగి ఉంటుంది.

ఒక అడుగు వెనక్కి (మైనస్‌లు)

 

ముఖ్యమైన ఫీచర్లు లేకపోవడం

థామ్సన్ బాక్స్ ను ‘ప్రో’ మోడల్ అని పిలుస్తున్నప్పటికీ.. ఇందులో Dolby Vision, Dolby Atmos సపోర్ట్ లేదు. హోమ్ థియేటర్ అనుభవం కోరుకునే వారికి ఇది పెద్ద మైనస్ గా చెప్పవచ్చు.

పాత టెక్నాలజీ

ఇందులో HDMI 2.0 పోర్ట్ మాత్రమే ఉంది (HDMI 2.1 కాదు). అలాగే వై-ఫై విషయంలో కూడా లేటెస్ట్ వెర్షన్ కాకుండా Wi-Fi 5 కే పరిమితమయ్యారు.

Also Read: North Korea: కూతురితో కలిసి.. యుద్ద ట్యాంక్‌పై షికారు.. కిమ్ మామ స్టైలే వేరు!

ఓవరాల్‌గా ఏది బెటర్..

మీకు ఎక్కువ స్టోరేజ్, USB పోర్ట్స్ అవసరం ఉండి.. డాల్బీ విజన్ వంటి హై-ఎండ్ సినిమాటిక్ ఫీచర్స్ అక్కర్లేదనుకుంటే థామ్సన్ బాక్స్మంచి ఆప్షన్ అవుతుంది. కానీ పూర్తి స్థాయి హోమ్ థియేటర్ అనుభవం కావాలనుకునే వారికి గూగుల్ టీవీ స్ట్రీమర్ లేదా ఇతర ప్రీమియం బాక్సులే మెరుగ్గా ఉంటాయని చెప్పవచ్చు.

Also Read: Wonderchef Chef Magic: రోబోటిక్ స్మార్ట్ కుక్కర్.. 500 పైగా వంటకాలు.. రెస్టారెంట్ స్టైల్ ఘుమఘుమలు!

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×