E-Paper
Advertisement

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!
Advertisement

Tata EV Discount September 2026: ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్న వారికి టాటా మోటార్స్ సెప్టెంబర్ నెలలో అదిరిపోయే ఆఫర్లను తీసుకొచ్చింది. ముఖ్యంగా హారియర్ EV, కర్వ్ EV, నెక్సాన్ EVతో పాటు ప్రీ ఫేస్‌ లిఫ్ట్ పంచ్ EV, టియాగో EVలపై ఊహించని బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్,  స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్ లాంటి ఆఫర్లు లభిస్తున్నాయి.

హారియర్ EVపై రూ.2.75 లక్షల వరకు..

ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV హారియర్ EVపై గరిష్టంగా రూ.2.75 లక్షల బెనిఫిట్స్ అందిస్తోంది. మిడ్ స్పెక్ ఫియర్ లెస్, టాప్ స్పెక్ ఎంపవర్డ్ వేరియంట్లపై రూ.1 లక్ష ఇంటర్వెన్షన్ ఆఫర్, రూ.75,000 వరకు ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్, రూ.1 లక్ష వరకు లాయల్టీ ఇన్సెంటివ్ ఉన్నాయి. అడ్వెంచర్ వేరియంట్‌పై రూ.75,000 ఇంటర్వెన్షన్ ఆఫర్ ఉండగా, మొత్తం బెనిఫిట్స్ రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. హారియర్ EV ధరలు రూ.21.79 లక్షల నుంచి రూ.29.79 లక్షల వరకు ఉన్నాయి.

కర్వ్ EVపై ఏకంగా రూ.3.35 లక్షల ఆఫర్

Advertisement

కర్వ్ EV  సిరీస్X అప్‌డేట్‌కు ముందు ఉన్న వేరియంట్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. గరిష్టంగా రూ.3.35 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో రూ.3 లక్షల క్యాష్ డిస్కౌంట్, రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. పాత క్రియేటివ్ వేరియంట్‌పై రూ.2.5 లక్షల క్యాష్ డిస్కౌంట్‌తో కలిపి మొత్తం బెనిఫిట్స్ రూ.2.85 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుత సిరీస్X వేరియంట్లపై  గరిష్టంగా రూ.65,000 బెనిఫిట్ లభిస్తుంది.

నెక్సాన్ EVపై రూ.45,000 వరకు..  

నెక్సాన్ EV కొనుగోలుదారులకు కూడా ఈ నెలలో అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. అన్ని వేరియంట్లపై గరిష్టంగా రూ.45,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఇందులో రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. నెక్సాన్ EV ధర రూ.12.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

పంచ్ EVపై రూ.1.45 లక్షల వరకు..

Advertisement

ప్రీ ఫేస్‌లిఫ్ట్ పంచ్ EV లాంగ్ రేంజ్ 35kWh వేరియంట్లపై రూ.1.1 లక్ష క్యాష్ డిస్కౌంట్‌ తో పాటు రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. దీంతో మొత్తం బెనిఫిట్స్ రూ.1.45 లక్షలకు చేరుతుంది. 25kWh మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు, బేస్ స్మార్ట్ వేరియంట్‌పై రూ.95,000 వరకు బెనిఫిట్ ఉంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ పంచ్ EVపై మాత్రం సెప్టెంబర్‌లో డిస్కౌంట్ లేదు.

టియాగో EVపై కూడా భారీ ఆఫర్లు

ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టియాగో EV XT లాంగ్ రేంజ్ వేరియంట్‌పై గరిష్టంగా రూ.1.45 లక్షల ప్రయోజనం లభిస్తుంది. ఇందులో రూ.70,000 క్యాష్ డిస్కౌంట్, రూ.50,000 ఇంటర్వెన్షన్ ఆఫర్, రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. XZ+ లాంగ్ రేంజ్ వేరియంట్‌పై రూ.1.25 లక్షల వరకు, 19kWh మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.65,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.

Read Also: కార్నివాల్ హైబ్రిడ్ To న్యూ సోనెట్.. కియా నుంచి రాబోతున్న 10 క్రేజీ కార్లు ఇవే!

Tags

Related News

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

కార్నివాల్ హైబ్రిడ్ To న్యూ సోనెట్.. కియా నుంచి రాబోతున్న 10 క్రేజీ కార్లు ఇవే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఏముంది గురూ!

క్రెటా To స్కార్పియో-N.. రూ.20 లక్షల్లో బెస్ట్ SUVలు ఇవే!

Big Stories

Advertisement
×