E-Paper
Advertisement

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఆల్ రౌండ్ అటాక్.. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు 5 ప్రధాన అస్త్రాలు!

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఆల్ రౌండ్ అటాక్.. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు 5 ప్రధాన అస్త్రాలు!
Advertisement

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమైంది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, 22-ఏ భూముల సమస్యతో పాటు ఇతర అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ప్రభుత్వాన్ని సభలో నిలదీయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆయా సమస్యలపై ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు నిర్వహిస్తున్న బీజేపీ.. ఇప్పుడు వాటినే అసెంబ్లీ వేదికగా మరింత బలంగా ప్రస్తావించాలని వ్యూహం రచించింది.

1000 రోజుల పాలన..

అలాగే 1000 రోజుల కాంగ్రెస్ పాలనపైనా బీజేపీ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలున్నాయి. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. కానీ అమలు చేయకుండా వంద రోజులు గడువు కోరింది. ఇప్పుడు 1000 రోజుల పాలన పూర్తయినా ఇచ్చిన హామీలు ఇచ్చినట్లే ఉన్నాయి తప్ప.. అమలు మాత్రం జరగడంలేదని కమలనాథులు విమర్శనాస్త్రాలు సంధించే అవకాశాలున్నాయి. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలపై నేతలకు రాంచందర్‌రావు దిశానిర్దేశం చేశారు.

ధర్నా చౌక్ వద్ద..

Advertisement

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను బీజేపీ ప్రధాన అంశంగా తీసుకోనుంది. బకాయిల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రాబట్టాలని పార్టీ భావిస్తోంది. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్న ఆరోపణలు కూడా తాజాగా తెరపైకి వచ్చాయి. కాగా ఈ అంశంపై బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద సోమవారం చేపట్టాలని భావించిన ధర్నాకు అనుమతించలేదు. దీంతో బీజేవైఎం నేతలు, నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.

Also read: పాకిస్తాన్ హెడ్ కోచ్ గా గౌత‌మ్ గంభీర్‌…? ఇక టీమిండియా జ‌ట్టుకు న‌ర‌క‌మేనా !

22-ఏ జాబితాలో..

Advertisement

ఇదిలాఉండగా బీజేపీ మరో ప్రధాన అస్త్రంగా 22-ఏ నిషేధిత భూముల అంశాన్ని ఎంచుకుంది. భూ భారతి వ్యవస్థలో ప్రైవేట్ పట్టా భూములు, ఇళ్లు, ప్లాట్లు 22-ఏ జాబితాలో చేరుతున్నాయంటూ పార్టీ ఇప్పటికే ఆందోళనలు నిర్వహించింది. ఈ అంశంపై న్యాయ విచారణ జరిపించాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీల అమలు విషయంలోనూ బీజేపీ దూకుడు పెంచనుంది. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, అవినీతి ఆరోపణలు, వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీజేపీ నిర్ణయించింది. సభను ఎక్కువ రోజులు నిర్వహించాలని కూడా బీజేఎల్పీ డిమాండ్ చేయనుంది.

గన్ పార్క్ వద్ద నిరసన..

తెలంగాణ బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద నిరసన చేపట్టి అనంతరం అసెంబ్లీకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించేలా చేయడమే ఈ నిరసన ఉద్దేశంగా పార్టీ నేతలు చెబుతున్నారు. సోమవారం ఉదయం 8:30 కి గన్ పార్క్ వద్ద నిరసనకు దిగే అవకాశముంది. బయట ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు.. అదే అంశాలను సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని సమాధానం చెప్పేలా చేయాలని బీజేపీ భావిస్తోంది. గన్‌పార్క్ వద్ద నిరసన అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమాధానం చెప్పాలని డిమాండ్ చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ చేపట్టనున్న ఈ నిరసనతో రేపు రాజకీయ వాతావరణం వేడెక్కే అవకాశం ఉంది.

Also read: జమీందారు వంశంలో పుట్టి.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ.. ఎవరీ కంటెస్టెంట్?

15 రోజుల సభ నడపాలి : ఏలేటి..

రాష్ట్ర ప్రభుత్వం ఒకట్రెండు రోజులు సభ నడపాలని చూస్తోందని, కనీసం 15 రోజుల పాటు సభ కొనసాగించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేఎల్పీ కార్యాలయంలో మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఫైరయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, అవినీతి అక్రమాలపై ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తామన్నారు. సభను నడపడానికి ఈ ప్రభుత్వం భయపడుతోందని ఏలేటి చురకలంటించారు.

పాయల్ శంకర్ మాట్లాడుతూ..

కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం బీజేఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తున్న తీరును ఎండగడతామన్నారు. రాష్ట్రాని దోచుకుంటున్న తీరు, కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలపై ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యార్థులు పడుతున్న అవస్థలు, కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ప్రశ్నిస్తామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు, అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత చేస్తున్న వాటిని సభలో నిలదీస్తామని పాయల్ శంకర్ స్పష్​టంచేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి ఉన్నారు.

Also Read: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌కు ఇలాంటి ప్రైవసీ కూడా ఉంటుందా? కొత్త టెక్నాలజీ ఇదేనండోయ్!

Tags

Related News

నోరు జారిన వైనం.. అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌తో అభాసుపాలు..! ద‌ళిత స్పీక‌ర్‌పై ఇదేం వైఖ‌రి? చ‌ర్య‌ల‌కు డిమాండ్..

కేసీఆర్ క్లాస్‌.. కేటీఆర్ మాస్‌! చ‌ర్చ‌ల వ్యూహం ఆయ‌న‌ది.. ర‌చ్చ చేసి ఫోక‌స్ త‌మ‌పై నిలిపే ఎత్తుగ‌డ ఈయ‌న‌ది..!

క్షణికావేశంలో ముగిసిన కుటుంబ కథ.. పశ్చిమ గోదావరిలో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన!

జమ్మలమడుగు పాలిటిక్స్‌లో రగులుతున్న పోలిటికల్ వార్.. బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్!

సీఎం రేవంత్ వ్యూహం వర్సెస్ బీఆర్ఎస్ కౌంటర్.. తెలంగాణ అసెంబ్లీలో ఏం జరగబోతోంది?

తెలంగాణలో ఈవీ వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టులు.. టెట్ క్వాలిఫికేషన్‌పై ప్రశ్నలు

Big Stories

Advertisement
×