E-Paper
Advertisement

Wireless Powerbank: కేవలం రూ.1,549లే.. 10,000mAh వైర్‌లెస్ పవర్ బ్యాంక్ లాంచ్

Wireless Powerbank: కేవలం రూ.1,549లే.. 10,000mAh వైర్‌లెస్ పవర్ బ్యాంక్ లాంచ్
Advertisement

Wireless Powerbank| పోర్ట్రానిక్స్ కంపెనీ భారత మార్కెట్‌లో ఒక కొత్త పవర్ బ్యాంక్‌ లాంచ్ చేసింది. దీని పేరు పోర్ట్రానిక్స్ రెవో (Portronics Revvo). దీని సామర్థ్యం 10,000mAh. అయితే ఇది సాధారణ పవర్ బ్యాంక్ కాదు మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ పవర్ బ్యాంక్. అంటే ఫోన్ వెనుక భాగంలో అతుక్కుపోతుంది. ఈ పవర్ బ్యాంక్‌ ముఖ్యంగా ఐఫోన్ యూజర్ల కోసం, వైర్ లేకుండా సులభంగా ఫోన్ ఛార్జ్ చేయాలనుకునే వాళ్ల కోసమే దీన్ని రూపొందించారు.

ధర ఎంతంటే

ఈ రెవో పవర్ బ్యాంక్ ధర కేవలం ₹1,549 మాత్రమే! ఇంత తక్కువ ధరలో ఇంత మంచి ఫీచర్లు ఉన్న పవర్ బ్యాంక్ మర్కెట్లో లాంచ్ కావడం ఇదే తొలిసారి. ఈ పవర్ బ్యాంక్ మూడు అందమైన కలర్లలో వస్తుంది. బ్లాక్, బ్లూ, మోచా. కంపెనీ 12 నెలల వారంటీ కూడా ఇస్తోంది. ఇప్పుడు ప్రోట్రానిక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇది లభిస్తోంది. త్వరలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్ సైట్లతో పాటు ఆఫ్‌లైన్ దుకాణాల్లో కూడా దొరుకుతుంది.

స్పెషల్ మ్యాగ్నెటిక్ ఫీచర్

Advertisement

ఈ పవర్ బ్యాంక్‌లో ముఖ్యమైన స్పెషల్ ఫీచర్ ఏంటంటే.. 15W మ్యాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్! ఐఫోన్ 12, 13, 14, 15 సిరీస్‌లో ఉన్న MagSafe ఫీచర్ ఉన్న ఫోన్లకు ఇది గట్టిగా అంటుకుంటుంది. ఒక్క వైర్ కూడా కనిపించదు, పాకెట్‌లో వైర్లు చిక్కులు పడే సమస్య ఉండదు. ఫోన్ వెనుక భాగంలో ఈ పవర్ బ్యాంక్ అంటుకుని ఛార్జ్ అవుతూ ఉంటుంది. చాలా సులభంగా, క్లీన్‌గా పనిజరుగుతుంది.

డిజైన్

ఈ పవర్ బ్యాంక్ డిజైన్ కూడా చాలా బాగుంది. మ్యాట్ ఫినిషింగ్, రౌండెడ్ కార్నర్స్, చిన్న సైజు వల్ల పాకెట్‌లో సులభంగా పెట్టుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్‌తో పాటు కాంప్లిమెంటరీగా కిక్ స్టాండ్ ఉంది. ఇందులో ఫోన్‌ను నిలబెట్టి వీడియో కాల్స్ చేయొచ్చు, సినిమాలు చూడొచ్చు. మరోవైపు ఛార్జ్ అవుతూనే ఉంటుంది. అంటే హ్యాండ్స్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్!

వైర్ చార్జింగ్ కూడా

Advertisement

వైర్ ఉపయోగించి ఛార్జ్ చేయాలనుకున్నా ఇది సూపర్ ఫాస్ట్‌గా ఛార్జ్ అవుతుంది. 22.5W క్వాల్‌కామ్ క్విక్ ఛార్జ్, 20W PD ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సాధారణ ఛార్జర్‌ల కంటే చాలా వేగంగా ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈ పవర్ బ్యాంక్‌తో పాటు టైప్ సి టు టైప్ సి (Type-C to Type-C) కేబుల్ కూడా ప్యాక్‌లో వస్తుంది. ఈ కేబుల్‌ని పవర్ బ్యాంక్‌లోనే ఒక స్లాట్‌లో దాచేయొచ్చు, ఎక్కడికి వెళ్లినా ఎక్స్‌ట్రా వైర్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

బ్యాటరీ 10,000mAh హై-డెన్సిటీ లి-పాలిమర్, చాలా రోజులు నిలుస్తుంది. ఎంత ఛార్జ్ మిగిలి ఉందో చూడడానికి డిజిటల్ LED డిస్‌ప్లే ఉంది, ఛార్జింగ్ శాతం ఈ డిస్‌ప్లేలో కనిపిస్తుంది. మొత్తంమీద చూస్తే ₹1,549 ధరలో MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్, ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, కిక్ స్టాండ్, LED డిస్‌ప్లే, కేబుల్ స్లాట్.. అన్నీ ఒకే ప్యాక్‌లో ఉన్న పవర్ బ్యాంక్ ఇది ఒక్కటే! ఐఫోన్ యూజర్లు అయితే కచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇంత తక్కువ ధరలో ఇది సూపర్ యూజ్‌ఫుల్ గాడ్జెట్!

Also Read: ఐఫోన్ పోగొట్టుకున్నారా? లేదా చోరీ అయిందా? ఆపిల్ కొత్త ఐఫోన్ ఇస్తోంది.. వారికి మాత్రమే

Related News

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

ఇంట్లో Wi-Fi పెట్టిస్తున్నారా? జియో, ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్స్‌లో దేనితో ఎక్కువ లాభం?

రూ.5,500లకే బెస్ట్ ఆటో-క్లీన్ చిమ్నీలు! మీ వంటగదికి ఏది పర్ఫెక్ట్ ?

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

Big Stories

Advertisement
×