Hero Vishal : తమిళ స్టార్ హీరో విశాల్ నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఆయన పలు వివాదాల్లో చిక్కుంటున్నాడు. ఇటీవల హీరో విశాల్, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ గొడవలు కాస్త కోర్టు మెట్లేక్కింది.. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం విశాల్ తన సినిమా హక్కులను వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి అమ్మడంతోనే ఈ కేసు నమోదు అయింది. అంతేకాదు లైకా నుంచి విశాల్ అప్పుగా తీసుకున్న డబ్బులను వడ్డీతో సహా కట్టాలని ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది.. గత కొన్ని రోజులుగా ఈ కేసు విచారణ జరుగుతోంది. తాజాగా తుది విచారణ జరిపిన కోర్టు విశాల్ కి షాక్ ఇచ్చింది. వెంటనే లైకాకు మొత్తం అమౌంట్ కి కట్టాలని ఆదేశించింది. ప్రస్తుతం ఈ న్యూస్ కొలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
హీరో విశాల్, లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్ మొత్తం రూ.21.30 కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది. ఈ కేసు గత కొన్ని నెలలుగా మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉంది. ఈ రుణాన్ని 30% వడ్డీతో కలిపి చెల్లించాలని తీర్పు ఇచ్చింది.. ఇప్పటికే విచారణ జరిపిన కోర్టు ఫైనల్ తీర్పు ఇచ్చేసింది.. లైకాను చీట్ చెయ్యడం పై సీరియస్ అయ్యింది కోర్టు. మద్రాస్ కోర్టులో విశాల్ వేసిన ఫిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. లైకా సంస్థకు 30 శాతం వడ్డీతో రూ.21 కోట్లు చెల్లించాలంటూ విశాల్‌ను ఆదేశించింది. ఈ తీర్పు విశాల్‌కు గట్టి షాకేనని చెప్పాలి. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి…
Also Read: సాగర్ ను ఇరికించిన శ్రీవల్లి.. కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు.. భాగ్యం ప్లాన్ సక్సెస్..
హీరో విశాల్ హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. విశాల్ కు ఫిలిం ఫ్యాక్టరీ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆ నిర్మాణ సంస్థ కోసం అన్బుచెళియన్ అనే ఫైనాన్షియర్ నుంచి దాదాపు రూ.21.29 కోట్లను విశాల్ అప్పుగా తీసుకున్నాడు.. అయితే ఆ అప్పును సమయానికి చెల్లించలేకపోయాడు.. దాంతో లైకా ప్రొడక్షన్ ను అప్పు కోసం సంప్రదించాడు. అది తీరిపోయేంత వరకు తన సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇస్తానని లైకాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో విశాల్ అప్పులను లైకా ప్రొడక్షన్ క్లియర్ చేసింది.. ఇక దీని ప్రకారం విశాల్ తన నిర్మిస్తున్న సినిమా హక్కులను ఆ సంస్థకే ఇవ్వాలి. వీరమే వాగై సూడుం సినిమాను విశాల్ సొంతంగా రిలీజ్ చేయడంతో.. లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది.. దీనిపై లైకా సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పై గతంలో విచారణ జరిపిన కోర్టు వాయిదా వేసింది. మరోసారి విచారణ జరిపి ఫైనల్ తీర్పును ఇచ్చేసింది. లైకాకు 30 శాతం వడ్డీతో మొత్తం చెల్లించాలని ఆదేశించింది. లైకా అప్పు తీరేంతవరకు విశాల్ ఫిలింఫ్యాక్టరీపై నిర్మించే సినిమాలను థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.. దీనిపై విశాల్ ఎలా రియాక్ట్ అవుతారో అన్నది ఆసక్తిగా మారింది. ఇకపోతే విశాల్ ఇటీవలే సినీనటి సాయి ధన్షిక తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఇప్పుడున్న సమస్యలతో ఈ పెళ్లి ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..